ఏవండోయ్.. చలికాలంలో మీరు తాగే టీలో ఆ ఒక్కటి వేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఉదయాన్నే మీకు టీ తాగే అలవాటు ఉందా? అయితే చలికాలంలో మీరు తాగే టీలో వంటగదిలో విరివిగా దొరికే ఈ ఒక్క మూలిక కలపండి.
ఉదయాన్నే టీ కడుపులో పడితే చాలు ఆ రోజుకి కావాల్సిన శక్తి వచ్చేసిందనుకునేవారు వందల్లో, వేలల్లో కాదు.. లక్షల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఆరోగ్యానికి టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తాయి కానీ.. దానిని తాగేవారు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోరు. ఈ విషయాన్ని పక్కనపెడితే.. శీతాకాలంలో టీలో ఒక్క మూలిక వేసుకోవడంలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. అదే అల్లం. అవును శీతాకాలంలో అల్లంతో చేసిన టీ తాగితే.. చాలా మంచిదట.
చలికాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. దానిని మీరు మీ ఉదయపు డ్రింక్తోనే ప్రారంభించవచ్చు. అదే అల్లం టీ. అల్లాన్ని మనం వంటల్లో.. జ్యూస్లలో, సూప్, కషాయంలో రెగ్యూలర్గా తీసుకుంటాము. దీనిని టీతో కూడా కలిపి తీసుకుంటారు. అయితే చలికాలంలో రెగ్యూలర్గా నేరుగా అల్లాన్ని తీసుకోలేకపోతే.. అల్లంతో చేసిన టీ తీసుకోవచ్చు. ఇది మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఈ టీని ముఖ్యంగా శీతాకాలంలో తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తికై..
చలికాలంలో ఇమ్యూనిటీ చాలా అవసరం. అల్లం టీ మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇది సీజనల్ వ్యాధులు దరిచేయకుండా మీ శరీరానికి రక్షణ ఇస్తుంది.
ఇన్ఫెక్షన్కై..
అల్లంటీ శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అల్లంలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. శరీరంలోని అంటువ్యాధులతో పోరాడుతాయి. ఇన్ఫెక్షన్ను తగ్గించి.. శరీరం నుంచి బయటకు పంపించేస్తాయి.
జలుబు దూరం చేసుకోండిలా..
చలికాలంలో తరచుగా అందరినీ వేధించే సమస్య జలుబు. ఇది వస్తే చాలు.. ఫీవర్, దగ్గు, తలనొప్పి అన్ని క్యూ కట్టి మరి వచ్చేస్తాయి. అందుకే అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎటాక్ చేస్తే.. అల్లం టీని తాగండి. జలుబుకు ఇది మంచి హోం రెమెడీగా చెప్పవచ్చు. జలుబుకు వ్యతిరేకంగా ఇది మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది. అల్లంతో పాటు.. ఏలకులు, దాల్చిన చెక్క, లెమన్ గ్రాస్ వంటి వాటిని కలిపి మసాలా టీ తయారు చేసుకుని కూడా తాగొచ్చు. ఇది కూడా జలుబు నుంచి మంచి ఉపశమనం అందిస్తుంది.
మెరుగైన ఆకలికి..
సాధరణంగా శీతాకాలంలో ఆకలి తక్కువగా వేస్తుంది. వాతావరణంలో మార్పులు, త్వరగా చీకటి పడిపోవడం దీనికి కారణం కావొచ్చు. అయితే మీరు తక్కువగా తింటే.. మీ శరీరం బలహీన పడిపోతుంది. తద్వారా మీరు త్వరగా సీజనల్ వ్యాధుల బారిన పడిపోతారు. కాబట్టి మీ ఆకలిని పెంచి.. మీ రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు అల్లం టీని తాగవచ్చు. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరిచి.. ఆకలిని పెంచుతుంది.
ఈ అద్భుతమైన ప్రయోజనాలతో పాటు.. ముఖ్యంగా టీలో అల్లం వేయడం వల్ల అద్భుతమైన రుచిని మీరు ఆస్వాదించవచ్చు. గొంతు నొప్పి, సమస్యలు ఉన్నప్పుడు ఇది మీకు తక్షణ హాయిని, ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు.. పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే.. ఉపశమనం కోసం మీరు అల్లం టీ తాగొచ్చు.
Also Read : సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే, శీతాకాలంలో ఈ సూప్ తాగండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.