Onion Garlic Side Effects: ఉల్లి, వెల్లుల్లి మానేయడం ఆరోగ్యానికి మంచిదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
శాకాహారాల్లో ఉన్నప్పటికీ ఉల్లి, వెల్లుల్లి తినడమనేది ఎప్పుడూ వివాదాాస్పదమే. మరి ఆయుర్వేదం ఉల్లి, వెల్లుల్లి గురించి ఏం చేబుతోంది? ఉల్లి, వెల్లుల్లి తినాలా? మానేయ్యాలా?
ఉపనిషత్తులు మొత్తం విశ్వమంతా కూడా మూడు గుణాలు కలిగి ఉంటుందని. ఈ మూడు గుణాల్లోనే అన్నీ నిబిడికృతం అయ్యి ఉన్నాయని చెబుతున్నాయి. ఆ మూడు గుణాలు సత్వ, రాజస, తమో గుణాలు. సత్వగుణం స్వచ్ఛతకు, మంచితనానికి ప్రతీక, రాజసం వీరత్వం, ఆవేశాన్ని ప్రతిబింబిస్తుంది. తామస గుణం ఆజ్ఞానం, సోమరితనం వంటి నకారాత్మకతను సూచిస్తుంది.
సాత్విక ఆహారం అంటే..
సాత్వికాహారంలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్థితిగతులను మెరుగు పరిచే ఆహారాన్ని సాత్వికాహారంగా పరిగణిస్తారు. బియ్యం, గోధుమలు, ఆకులు, పంచధార, నెయ్యి, పండ్లు, గింజలు వంటి శాకాహారాలన్నీ సాత్వికమైన ఆహారంగా చెప్పవచ్చు.
రజోగుణ ఆహారం..
ఘాటయిన వాసనలు, చాలా బలమైన రుచి కలిగిన ఉప్పగా, చేదుగా ఉండే వాటిని చేర్చవచ్చు. ఇవి శరీరంలో వేడి కలిగించి ఆవేశాన్ని పెంచుతాయి.
తామసిక ఆహారం అంటే...
చల్లారిపోయిన ఆహారం, సగం ఉడికిన ఆహారం, చేపలు, మాంసం, గుడ్డు ఇతర అన్ని రకాల మాంసాహారు, మద్యం వంటి సోమరితనాన్ని పెంచే ఆహారాలను తామసాహారాలుగా పరిగణిస్తారు.
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుర్వేదం ప్రకారం ఉల్లి, వెల్లుల్లి ఘాటైన వాసన కలిగి ఉంటాయి కనుక వీటిని రాజోగుణ ఆహారాలుగా పరిగణిస్తుంది. ఈ ఆహారంతో మనసులో ఆవేశకావేశాలు పెరుగుతాయని, కోపం, అసూయ, గర్వం, స్వార్థం, ప్రాచూర్యాన్ని ఆశించడం వంటి ప్రాపంచిక సుఖాలను పెంపొందిస్తాయి. ఉల్లి వెల్లుల్లితో ప్రాపంచిక ఆలోచనలు చాలా బలపడతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ఆధ్యాత్మికులకు ఇవి నిషేధమా?
ఆధ్యాత్మిక సాధన చేసే వారి లక్ష్యం ప్రాపంచిక ఆసక్తులను తగ్గించుకుని మోక్షం దిశగా సాగిపోవడమే. ఆహారంలో తీసుకునే ఉల్లి, వెల్లుల్లి వంటి రాజసిక ఆహారం తీసుకున్నపుడు వాటిలోని రజోగుణం మన:శరీరాలలో ప్రాపంచిక ఆసక్తిని మరింత పెంపొందించి ఆధ్యాత్మిక మార్గానికి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆధ్యాత్మిక పురోగతి ఆశించేవారు వీటిని మానేస్తే త్వరగా లక్ష్యసిద్ధి కలుగుతుందట.
ఇవిగో శాస్త్రీయ ఆధారాలు
పురాతన వైద్య శాస్త్రాలలో ఉల్లి, వెల్లుల్లిని మాంసాహారాల సరసన చేర్చారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడాన్ని నిషేధించారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఉల్లి, వెల్లుల్లి రెండూ కూడా అల్లియం కుటుంబానికి చెందినవే. వీటిలో ఫినాలిక్ ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ రసాయనాలు ఆండ్రోజెనిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. అంటే వీటిని ఎక్కువగా తీసుకునే వారిలో లైంగిక వాంఛలను ప్రేరేపిస్తాయి.
ఆయుర్వేదం ఉల్లి, వెల్లుల్లి లైంగిక శక్తిని పెంచేందుకు, వంధ్యత్వాన్ని నివారించేందుకు ఉపయోగించవచ్చని చెబుతోంది. వీటిని తిన్నపుడు ఈ రసాయనాల ప్రభావం నేరుగా కేంద్రీయ నాడి వ్యవస్థ మీద పడుతుంది. అప్పుడు శరీరక వాంఛలు పెరుగుతాయి. లైంగిక వాంఛ తామసిక ప్రవృత్తిగా పరిగణిస్తారు కనుక వీటిని ఒక రకంగా తామాసాహారంగా కూడా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక పురోగతిని ఆశించే వారు ఉల్లి, వెల్లుల్లి మానెయ్యడమే మంచిది.
ఒక్కోమతం ఒక్కోరకమైన వివరణ అందించి ఉండవచ్చు. కానీ అన్ని మతాలు వ్యక్తులుగా పురోగతి సాధించే మార్గాలనే సూయిస్తాయి. ఉల్లి, వెల్లుల్లి మనుషుల మనసు మీద, ఆలోచనా విధానాన్ని ఉత్తేజపరుస్తాయి కనుక ఆధ్యత్మిక సాధనలో ఉన్నవారు, ఆమార్గాన్ని జీవిత లక్ష్యం చేసుకున్న వారు రోజూ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని దూరం పెట్టడమే మంచిది.
Also Read : మహిళలూ.. ఈ వయసులో బీట్ రూట్ జ్యూస్ తప్పక తాగండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.