మనలో చాలా మంది పెరుగుతో భోజనం ముగించకపోతే తిన్నట్టే ఉండదని అంటుంటారు. అలా భోజనం ముగించడం చాలా మంచిది.

బరువు తగ్గాలని అనుకునే వారు భోజనం చివర పెరుగు తినడం వల్ల స్టెరాయిడ్ హార్మోన్లు, కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. .

పెరుగుతో నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అందువల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

జీర్థ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. పెరుగు తో జీర్ణవ్యవస్థలో ఉండే హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

పెరుగులో క్యాల్షియం ఎక్కువ, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది కనుక ఎముకలు, దంతాలు బలోపేతం అవుతాయి.

కార్డియో వాస్క్యూలార్ ఆరోగ్యానికి కూడా పెరుగు అవసరం. కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తుంది.

పెరుగులో విటమిన్లు D, B12, పోటాషియం, మెగ్నీషియం పోషకాలు ఉంటాయి. ఇవి శరీర పోషణలో ముఖ్యమైనవి.

పెరుగులో మెగ్నీషియం ఉండడం వల్ల బీపి అదుపులో ఉంటుంది.

పెరుగులోని లాక్టికాసిడ్ వల్ల చర్మానికి సహజమైన ఎక్స్ ఫోలియేంట్ గా పనిచేస్తుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.