బీర్ లో కార్బోహైడ్రేట్లు, ఆల్కహాల్, కొవ్వులు ఉంటాయి. వీటి వల్ల క్యాలరీలు పెరుగుతాయి. బీర్ లో ఉండే క్యాలరీలు.. దాని తయారీకి వాడే పదార్థాలు, బ్రూ చేసిన విధానం, అందులోని ఆల్కహాల్‌ను బట్టి మారుతుంటాయి. బీర్‌లోని ఆల్కహాల్ శరీరంలో జరిగే జీవక్రియల రేటు మీద ప్రభావం చూపుతుంది. ఇది నడుము చుట్టూ కొవ్వు చేరేందుకు కారణం అవుతుంది. కానీ మందు బాబుల్లో చాలా మందికి బీర్ అంటేనే మక్కువ. కొత్త అధ్యయనం ప్రకారం.. బీర్ సహా అన్ని ఆల్కహాలిక్ డ్రింక్స్ క్యాలరీ ఇన్ టేక్ పెంచుతాయి. ఫలితంగా స్థూలకాయ సమస్యలు వస్తాయి. వీలైనంత వరకు లైట్ బీర్ వెరైటీలను ఎంచుకోవాలట. ఒక మోతాదు దాటి తాగకూడదని ముందుగా మనసులో నిర్ణయించుకొని దానికి కట్టుబడాలి. బీర్ తో పాటు చేసే మంచింగ్ లో తక్కువ క్యాలరీలు ఉండే పదార్థాలు ఎంచుకోవాలి. బీర్యానీల వంటి వాటి జోలికి పోవద్దు. రాత్రి తాగిన బీర్ క్యాలరీలను పొద్దున్న చేసే వర్కవుట్ తో కరిగించడం మరచిపోవద్దు. ఆల్కహాల్ డీహైడ్రేట్ చేస్తుంది కనుక తప్పకుండా హైడ్రేషన్ మీద ప్రత్యేక దృష్టి నిలపాలి. తగినన్ని నీళ్లు తాగాలి. Note: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.