కాల్షియం కలిగిన ఆహారం అనగానే అందరూ పాలపదార్థాల వైపే చూస్తారు. కానీ పాలు కాకుండా ఇంకా చాలా ఆహారాల్లో కాల్షియం లభిస్తుంది.

ఆకుకూరల్లో కాల్షియం మాత్రమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి.

ఫార్టిఫైడ్ మొక్కల ఆధారిత సోయా, కొబ్బరి వంటి పాలలో కూడా కాల్షియం, విటమిన్ D ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.

సోయా పాలతో చేసిన పన్నీర్ ను టోఫూ అంటారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

పప్పు ధ్యాన్యాలో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

సియా సీడ్స్, నువ్వులు, అవిసే గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పొషకాలు ఉంటాయి.

గింజలతో చేసే బట్టర్లలో కూడా కాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి అవసరమే.

సాల్మన్ వంటి చేపల్లో విటమిన్ D, ఒమెగా3 ఫ్యాటీఆసిడ్స్ ఉంటాయి. ఈ పోషకాలు ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.

అంజీర వంటి కొన్ని డ్రైఫ్రూట్స్ లో కూడా కొద్ది మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇతర ఎముక బలానికి అవసరమయ్యే పోషకాలుంటాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.

Video and Images Credit: Pexels