మామిడి పండ్లను ఇలాగే తినాలట, ఎలాగో చూడండి మామిడి పండ్లు తినడానికి ఒక పద్దతి ఉంటుంది. ఆ పద్దతి ప్రకారమే తినాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లకు ఇతర కూరగాయల వలే పురుగుల మందులు పిచికారి చేస్తుంటారు. వాటిని తినే ముందు బాగా కడగాలి. మామిడికాయలు పాడైతే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. వాటిని కట్ చేసే ముందు 5 నిమిషాలు నీళ్లలో ఉంచండి. మామిడిపండ్లు కమ్మటి రుచి, వాసన కలిగి ఉంటాయి. వీటిపై తేనెటీగలు, కీటకాలు వాలుతుంటాయి. మామిడికాయల మందపాటి తొక్క తొందరగా మెత్తబడుతుంది. కాబట్టి గంటలతరబడి నీళ్లలో నానబెట్టకూడదు. వీటిలో అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. షుగర్ పేషంట్లు తినకూడదు. మామిడిపండ్లను డెజర్ట్ గా తీసుకోవడం సాధారణం. కానీ భోజనం చేసిన వెంటనే వీటిని తినకూడదు. షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినడం బెటర్. పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం.. డైలీ 100 గ్రాములకు మించి మామిడిపండ్లను తినకూడదు.