జింక్ తగ్గితే నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. అందువల్ల చాలా త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు.

జింక్ లోపిస్తే రెటినాలో మార్పు జరుగవచ్చు. చూపు మందగించడం, మసకగా కనిపించడం వంటి ఇబ్బందులు ఏర్పడుతాయి.

గాయాలు రెండు మూడు వారాల్లో మానకపోతే కచ్చితంగా జింక్ లోపించి ఉంటుందని భావించాలి.

జింక్ తగ్గితే వాసన గుర్తించే సామర్థ్యం తగ్గుతుంది. రుచి, వాసన ఎంజైముల నిర్వహణలో జింక్ ముఖ్య పాత్ర వహిస్తుంది.

జింక్ లోపం వల్ల ఆకలిలో కూడా తేడాలు వస్తాయి. అకారణంగా బరువు తగ్గడం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు రావచ్చు.

జింక్ లోపించినా లేదా ఎక్కువైనా జుట్టు రాలుతుంది. జింక్ లోపాన్ని ఆహారంతో సరిచేసుకోవడమే మంచిది.

జింక్ లోపిస్తే కాగ్నిటివ్ ఫంక్షన్స్ లో కూడా మార్పులు వస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, చురుకుదనం తగ్గడం జరగవచ్చు.

గర్భిణీల్లో జింక్ స్థాయిలు తగ్గితే గర్భంలోని శిశువు ఎదుగుదలలో సమస్యలు రావచ్చు. అందుకే వారికి తప్పకుండా జింక్ సప్లిమెంట్లు ఇస్తారు.

ఇన్సులిన్ ఉత్పత్తి పనితీరు మీద కూడా జింక్ ప్రభావం ఉంటుంది. జింక్ తగ్గితే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

ఈ సమాాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే