Fact Check: వైసీపీకి బొత్స రాజీనామా చేశారా? - ఆ వైరల్ లేఖలో నిజమెంతంటే?
Factly: వైసీపీకి సీనియర్ నాయకుడు రాజీనామా చేశారంటూ ఓ లేఖ వైరల్ అవుతుండగా 'Factly' దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ లెటర్ ఫేక్ అంటూ నిర్థారించింది.
Fact Check On Ysrcp Leader Botsa Satyanarayana Resignation Letter Gone Viral: వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేశారని చెప్తూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ పేరు మీద ఉన్న ఓ రాజీనామా లేఖను జత చేసి షేర్ చేస్తున్నారు. అయితే, వైరల్ అవుతోన్న ఈ లెటర్ ఫేక్ అంటూ 'Factly' స్పష్టత ఇచ్చింది.
క్లెయిమ్: వైసీపీకి ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారు.
ఫాక్ట్(నిజం): వైసీపీకి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయలేదు, ఈ వైరల్ రాజీనామా లేఖ ఫేక్. ఇదే విషయాన్ని బొత్స సత్యనారాయణ కూడా మీడియా సమావేశంలో తెలియజేశారు. అలాగే, ఇదే విషయాన్ని తెలియజేస్తూ వైసీపీ కూడా తమ అధికారిక X(ట్విట్టర్)లో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేశారా? అని శోధించగా.. ఈ వైరల్ రాజీనామా లేఖ ఫేక్ అని 'Factly' నిర్ధారించింది. ఈ లేఖ ఫేక్ అని చెప్తూ వైసీపీ సైతం తమ అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మే 13, 2024న పోస్ట్ చేసింది. అలాగే, ఈ లెటర్ ఫేక్ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినట్లు పలు మీడియా సంస్థలు సైతం పేర్కొన్నట్లు 'Factly' స్పష్టం చేసింది.
#FakeNewsAlert
— YSR Congress Party (@YSRCParty) May 13, 2024
ఓటమి భయంతో టీడీపీ నక్కజిత్తులు!
రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ తిరుగులేని విజయాన్ని సాధించబోతున్నట్లు ఇప్పటికే తేల్చేసిన అన్ని సర్వేలు
ఉత్తరాంధ్రలోనూ మరోసారి జోరుగా ఫ్యాన్ గాలి ఉండబోతుందని తెలిసి @JaiTDP ఫేక్ లెటర్‌తో తప్పుడు ప్రచారం
టీడీపీకి శాశ్వత సమాధి… pic.twitter.com/qJM7L3k3q9
అలాగే ఇటీవల ఒక మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు ఒక నకిలీ లేఖను సృష్టించి వైరల్ చేశారు అని టీడీపీ, కూటమిని విమర్శించారు.
అటు, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించగా వైరల్ అవుతున్న ఈ రాజీనామా లేఖలోని సంతకం కూడా బొత్స సత్యనారాయణది కాదని 'Factly' తెలిపింది.
This story was originally published by Factly, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.