అన్వేషించండి

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.

Fact Check:

తమిళనాడులో మిగ్జాం ఎఫెక్ట్..

మిగ్జాం తుఫాను ప్రభావం (Cyclone Michaung) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో గట్టిగానే కనిపిస్తోంది. తీర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలో వరదలతో ప్రజలు సతమతం అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ తుఫాను విధ్వంసానికి సంబంధించిన వీడియోలు వైరల్ (Cyclone Michaung Videos) అవుతున్నాయి. అయితే...కొన్ని పాత వీడియోలనూ పోస్ట్ చేసి వాటికి #Cyclone Michaung హ్యాష్‌ట్యాగ్‌లతో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి (Chennai Airport) సంబంధించిన ఓ ఫొటోని (ఫొటో కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అందరూ షేర్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. అందులో కొన్ని విమానాలు మునిగిపోయాయి. "ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్ట్ పరిస్థితి ఇదీ. సముద్రం ఉప్పొంగుతోంది" అంటూ ఆ ఫొటోని షేర్ చేస్తున్నారు.

ఈ ఫొటోతో పాటు ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. చెన్నైలో వరదల కారణంగా ఓ వీధి వీధంతా కొట్టుకుపోయిందని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌ని నీళ్లలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ వీడియోకి (ఇక్కడ క్లిక్ చేయండి) లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. లైక్‌లూ వందల కొద్దీ వస్తున్నాయి. ఇదొక్కటే కాదు. మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. చెన్నైలో వరదలు ముంచెత్తిన తరవాత పరిస్థితులు ఇలా ఉన్నాయని ఓ వీడియోని పోస్ట్ చేశారు కొందరు నెటిజన్లు. దాన్ని చాలా మంది షేర్ చేశారు. ఓ మోటార్‌సైక్లిస్ట్‌ నీళ్లలో మునిగిపోయి ఉన్న బ్రిడ్జ్‌పై నుంచి వెళ్లిన వీడియో (వీడియో ఇదే) ఇది. ఈ వీడియోలు, ఫొటోలపై Logically Facts ఫ్యాక్ట్ చెక్ చేసింది.  reverse-image search ద్వారా అసలు విషయం వెల్లడించింది. 

ఇదీ నిజం..

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో తేలిందేంటంటే...ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలకి, మిగ్జాం తుఫానుకి ఎలాంటి సంబంధం లేదు. ఎయిర్‌ పోర్ట్ ఇమేజ్‌ ఇప్పటిది కాదు. 2015 లోది. ఈ ఇమేజ్‌ని 2015 డిసెంబర్ 2వ తేదీన వికీపీడియాలో పబ్లిష్ చేశారు. అప్పుడు కూడా చెన్నైలో వరదలు వచ్చాయి. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్ల నుంచి చెన్నై ఎయిర్‌ పోర్ట్ ఫొటో తీశారు. అప్పట్లో BBC Newsలోనూ ఈ ఫొటో పబ్లిష్ అయింది. ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ AFP ఈ ఫొటోని విడుదల చేసింది.

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?

Image Source: Wikipedia

ఇక వరద నీటిలో బైక్‌ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వీడియోనీ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఫ్యాక్ట్ చేసింది Logicallt Facts టీమ్. 2020లో జులై 29న ఈ వీడియో అప్‌లోడ్ అయింది. అప్పటి వరదలకు సంబంధించిన వీడియో ఇది. దీనికి మిగ్జాంకి ఎలాంటి సంబంధం లేదు. చెన్నైలోని క్రోమ్‌పేట్‌లోది ఈ వీడియో.

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?

ఇక మోటార్‌ సైక్లిస్ట్ నదిని దాటిన వీడియో మరీ పాతదేం కాదు. ఈ మధ్య బాగా వైరల్ అయింది. దీనికి మిగ్జాం వరదలకు ఎలాంటి లింక్ లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 6న ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పుడిదే వీడియోని మిగ్జాం తుఫాన్‌కి లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ పాతవే అని ఫ్యాక్ట్‌చెక్‌లో వెల్లడైంది. 

Image Source: Youtube

disclaimer: This report first appeared on logicallyfacts.com, and has been republished on ABP Desam as part of a special arrangement.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Embed widget