Rana Daggubati: భాషలు వేరైనా కళ ఒక్కటే, అమర్ చిత్ర కథలపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు
చిన్న పిల్లల మాదిరిగానే తాను కూడా కామిక్ కథల్ని ఎంతో ఇష్డపడతానని చెప్పారు రానా. అందుకే, అమర్ చిత్ర కథతో కలిసి ‘హిరణ్య కశ్యప్’ లాంటి చిత్రాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
నటుడు, నిర్మాత దగ్గుపాటి రానా అమర్ చిత్ర కథతో చేతులు కలిపారు. పురాణ కథనలు చిత్రాలుగు రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘హిరణ్యకశ్యప్’ అనే చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు వెల్లడించారు. ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం VFX, నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా రానాకు మద్దతు ఇస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఈవెంట్ లో రానా పాల్గొన్నారు."అమర్ చిత్ర కథతో నాకు వ్యక్తిగతంగా అనుబంధం చాలా కాలంగా ఉంది. ఈ కామిక్స్ చదవడం అమ్మ నుంచి నేర్చుకున్నాను. ఆ కథలు నాకు ఎంతో బాగా నచ్చేవి. ఈ కథలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ కథలతో సినిమాలు చేయాలని ఆలోచన నాకు చాలా కాలం క్రితమే వచ్చింది” అని చెప్పారు.
కథ అందరినీ ఏకం చేస్తుంది!
అమర్ చిత్ర కథతో రానాకు 2019 నుంచి ఏర్పడింది. హైదరాబాద్‌లో ‘ACK అలైవ్’ అనే లెర్నింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. దివంగత అనంత్ పాయ్, అతని భార్య లలిత పాయ్ స్థాపించిన కామిక్ బుక్ పబ్లిషింగ్ కంపెనీలో అతని నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా ప్రస్తుతం వాటాను కలిగి ఉంది. ఇక అమర్ చిత్ర కథ నుంచి బాగా పాపులర్ అయిన పురాణ కథలతో చిత్రాలను రూపొందించాలని రానా భావిస్తున్నారు. జూలైలో జరిగిన శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC 2023)లో ప్రతిష్టాత్మక ‘హిరణ్య కశ్యప్’ కాన్సెప్ట్ టీజర్‌ను ఆవిష్కరించారు. "కామిక్ కథలు అందరికీ నచ్చుతాయి. ఈ కథలు ఎల్లప్పుడూ ప్రజలను ఏకం చేస్తూనే ఉంటాయని నేను భావిస్తున్నాను. మీరు ఏ సంస్కృతి, ఏ భాష నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. కళ మన అందరినీ ఏకం చేస్తుంది”అని అతను చెప్పాడు.
‘హిరణ్య కశ్యప్’ పౌరాణిక అనే కథ రాక్షస రాజు చుట్టూ తిరుగుతుంది. విష్ణు భక్తుల నమ్మకాలు, విశ్వాసాలను నాశనం చేయాలనే హిరణ్య కశ్యపుడు భావిస్తాడు. అయితే, అతడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. పౌరాణిక కథనాల ప్రకారం, ఈ రాక్షస రాజు బ్రహ్మ దేవుడు నుంచి తనను మానవులు లేదంటే జంతువులు, లోపల లేదంటే వెలుపల, పగలు లేదంటే రాత్రి, ఏ ఆయుధంతోనూ తనను చంపకూడదని వరం పొందుతాడు. చివరకు అతడిని చంపడానికి విష్ణువు నరసింహ అవతారంలో వస్తాడు. ఈ కథతో చిత్రాన్ని తెరకెక్కించాలని ఎంతో ఆత్రంగా ఉందన్నారు రానా.
వచ్చే ఏడాది మార్చిలో ‘హిరణ్య కశ్యప్’ ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభం
ఇప్పటికే హిరణ్య కశ్యపుడి కథతో 1967లో ‘భక్త ప్రహ్లాద’ అనే చిత్రం వచ్చిందని చెప్పిన రానా, కొత్త వెర్షన్‌తో కథను మరింత ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ‘హిరణ్య కశ్యప్’ ప్రస్తుతం కథ రచన దశలో ఉందన్నారు. ప్రీ-ప్రొడక్షన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమవుతుందని చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ లో పని చేస్తున్నట్లు చెప్పారు. ‘హిరణ్య కశ్యప్’ మాత్రమే కాదు, ఇంకా చాలా కథలను తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు.
Read Also: జపాన్ వెకేషన్‌లో రవితేజ, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial