News
News
X

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. గురువారం చిత్రయూనిట్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

FOLLOW US: 

సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’(Wanted PanduGod). ‘పట్టుకుంటే కోటి’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పాటలు, దర్శకత్వ పర్యవేక్షణ కూడా కె.రాఘవేంద్రరావుదే. ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా నటించారు. వెన్నెల కిశోర్‌కు జోడీగా విష్ణు ప్రియ, సప్తగిరి సరసన నిత్యశెట్టి, శ్రీనివాస్ రెడ్డికి జంటగా వసంతి నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. చూస్తుంటే.. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను సునీల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకోవడం కోసం ఇతర పాత్రదారులంతా అడవిబాట పడతారు. ఈ చిత్రంలో దాదాపు అంతా కమెడియన్స్, యాంకర్సే ఉన్నారు. ఆగస్టు 19న విడుదల కానున్న ఈ చిత్రానికి అప్పుడే ప్రమోషన్స్ మొదలైపోయాయి.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి సాంగ్‌తో మొదలైంది. ఆ తర్వాత శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్ మధ్య సన్నివేశం ఉంటుంది. శ్రీనివాస రెడ్డి.. వెన్నెల కిశోర్‌కు తన ప్రేమ కథ వినిపిస్తాడు. అలా.. సినిమాలోకి పండుగాడి ఎంట్రీ వస్తుంది. ఆ వెంట వెంటనే కామెడీ సీన్స్, 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ కామెడీ. అనసూయ, విష్ణు ప్రియా, దీపిక పిల్లిల హాట్ సాంగ్స్‌తో సినిమాపై కుర్రకారుకు ఆసక్తి కలిగించేలా చేశారు. సినిమా మొత్తం కామెడీ, గ్లామర్ సీన్స్‌తో నిండిపోయింది. సునీల్ ఇందులో ప్రధాన పాత్రధారా? లేదా అతిథి పాత్ర అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా బుల్లితెర అభిమానులకు కనువిందే. ఎందుకంటే.. ఇందులో కనిపించేవాళ్లంతా యాంకర్స్, జబర్దస్త్ కమెడియన్సే. 

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్: 

రాఘవేంద్రరావు పాటలపై విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్: తాజాగా యాంకర్ మంజుషా విష్ణు ప్రియ, దీపిక పిల్లి, వసంతి, సుడిగాలి సుధీర్‌తో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా విశేషాలను పంచుకున్నారు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో దీపిక, నేను జంటగా మాత్రమే కనిపిస్తాం. కానీ, హీరో హీరోయిన్లం కాదు. కేవలం పాత్రదారులం మాత్రమే’’ అని తెలిపాడు. దీపిక పిల్లిని జోడిగా కావాలని అడిగింది మీరేనని తెలిసిందని మంజుషా అడగ్గా.. ‘‘అమ్మో, నాకేమీ సంబంధం లేదు. డైరెక్టర్ గారే ఆమెను నాకు జోడిగా సెలక్ట్ చేశారు’’ అని పేర్కొన్నాడు. 

కె.రాఘవేంద్ర రావు సినిమా అంటే గుర్తుకొచ్చేది పండే. ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అని మంజుషా అడిగిన ప్రశ్నకు దీపిక పిల్లి బదులిస్తూ.. ‘‘ఈ సినిమాలోని ఒక విషయాన్ని లీక్ చేస్తాను. సినిమా అంతా ఒకటే పండు లీడ్ చేస్తుంది’’ అని చెబుతుంది. అనంతరం విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ‘‘మాకు ఫ్రూట్స్‌తో అభిషేకం జరిగినందుకు చాలా ఆనందిస్తు్న్నాం. రాఘవేంద్రరావు సినిమా అని చెప్పగానే. వేశారా మీ మీద పండ్లు అని అంతా అడిగేవారు. మా అమ్మా.. నీ మీద పుచ్చకాయ వేసుండాల్సింది అని అంది. రాఘవేంద్రరావు గారు మా మీద చాలా కేర్ తీసుకొనేవారు కస్ట్యూమ్స్ నుంచి మా లుక్ వరకు అన్నీ ఆయనే చూసుకొనేవారు’’ అని తెలిపింది. 

Also Read : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

Also Read : అదీ రాజమౌళి రేంజ్, హాలీవుడ్ దర్శకులతో కలిసి - దర్శక ధీరుడికి అరుదైన గౌరవం

Published at : 11 Aug 2022 08:49 PM (IST) Tags: Sudigali Sudheer Vishnu Priya Deepika Pilli Wanted Pandugadu Trailer Wanted PanduGod Trailer

సంబంధిత కథనాలు

Devatha October 1st Update: మాధవ్ మరో దారుణం- రుక్మిణిలో మొదలైన అనుమానం, అదిత్యపై అరిచిన సత్య

Devatha October 1st Update: మాధవ్ మరో దారుణం- రుక్మిణిలో మొదలైన అనుమానం, అదిత్యపై అరిచిన సత్య

Bigg Boss 6 Telugu Episode 27: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

Bigg Boss 6 Telugu Episode 27: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

టాప్ స్టోరీస్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

ST Reservations: ఎస్టీలకు గుడ్ న్యూస్, 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ అమలు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ

ST Reservations: ఎస్టీలకు గుడ్ న్యూస్, 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ అమలు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే