News
News
X

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ రోజు ఆ సినిమాను అధికారికరంగా ప్రకటించారు. 

FOLLOW US: 

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. ఈ చిత్రానికి బాక్సాఫీస్ బరిలో వరుస విజయాలతో దూసుకు వెళుతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie).

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో సినిమా రూపొందుతోన్న విషయం అటు నందమూరి అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఈ రోజు ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Music Director S Thaman) సంగీతం అందిస్తున్నారు.

''మన నట సింహం నందమూరి బాలకృష్ణ గారిని ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన చేయనటువంటి పాత్రలో చూపించే అవకాశం లభించినందుకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటారు. సూపర్ థ్రిల్లింగ్ గా ఉంది'' అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

''లయన్ బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో సినిమా చేయడం సంతోషంగా ఉంది'' అని షైన్ స్క్రీన్స్ పేర్కొంది.

తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. ఇందులో బాలకృష్ణ కుమార్తెగా 'పెళ్లి సందడి' ఫేమ్, యుంగ్ హీరోయిన్ శ్రీ లీల (Sree Leela in NBK 108) నటించనున్నారు. తెలుగమ్మాయి, మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.

అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి... నెక్స్ట్ ఇయర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా జూన్ 10న ఈ సినిమాలో బాలయ్య లుక్ విడుదల అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, ఆ రోజు విడుదల చేయలేదు. సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సమయం ఉంది కాబట్టి లుక్ తర్వాత రివీల్ చేయాలని భావిస్తున్నారట. బాలకృష్ణ క్యారెక్టర్ మాత్రమే కాదు, ఆయన లుక్ కూడా స‌మ్‌థింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుందట. ఈ చిత్రానికి 'ఐ డోంట్ కేర్' టైటిల్ ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే, ఆ విషయాన్ని యూనిట్ సభ్యులు ఎప్పుడూ చెప్పలేదు. 

Also Read : లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

అనిల్ రావిపూడి సినిమా కంటే ముందు... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా (NBK 107 Movie) తో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

Also Read : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Published at : 11 Aug 2022 05:08 PM (IST) Tags: Nandamuri Balakrishna Anil Ravipudi NBK108 Announcement NBK 108 Movie Shine Screens Balakrishna Anil Ravipudi Movie

సంబంధిత కథనాలు

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Tamannaah Bhatia: సింగిల్‌గా కాదు, ఏడాది పాటు పార్టనర్‌తో ఉంటా - ‘డేటింగ్’పై తమన్నా వ్యాఖ్యలు

Tamannaah Bhatia: సింగిల్‌గా కాదు, ఏడాది పాటు పార్టనర్‌తో ఉంటా - ‘డేటింగ్’పై తమన్నా వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం