అన్వేషించండి

Vikram Gokhale: సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, విషాదంలో బాలీవుడ్ !

బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతోన్న ఆయన పణే ఆసుపత్రి లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతోన్న ఆయన పుణే ఆసుపత్రి లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి లో వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్న ఆయన అవయవాలు పనిచేయకపోవడంతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు పుణే వైకుంఠ శ్మశాన వాటికలో నిర్వహించారు. గోఖలే మృతి తో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విక్రమ్ గోఖలే 1947లో జన్మించారు. ఆయనకు భార్య వృశాలి గోఖ్లే, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తండ్రి చంద్రకాంత్ గోఖలే కూడా రంగస్థల నటుడే కావడం విశేషం. గోఖలే తండ్రి  కూడా పలు సినిమాల్లో కనిపించారు. విక్రమ్ గోఖలే నాయనమ్మ దుర్గాబాయి కామత్ సినీ రంగంలో తొలి మహిళా నటిగా పేరు పొందింది. విక్రమ్ గోఖలే నాటక రంగంలో అనేక నాటకాల్లో నటించారు. ఆయన చేసిన నాటక పాత్రలు ఎన్నో ఆయనకు గుర్తింపు తెచ్చాయి. తర్వాత సినిమా రంగం వైపు అడుగుపెట్టారు విక్రమ్. తర్వాత ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.  అక్కడ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.

విక్రమ్ గోఖలే 1971లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పర్వానా’ సినిమాతో కెరీర్‌ని మొదలుపెట్టారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ 'అగ్నిపథ్' సినిమాలో ఆయన నటన మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా ఆయన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా  గా నిలిచింది. ఈ సినిమా లో గోఖలే పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే కమల్ హాసన్ 'హే రామ్', సంజయ్ లీల భన్సాలీ  సినిమా 'హమ్ దిల్ దే చుకే' లో  ఆయన నటన ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ‘భూల్ భులయ్యా’, ‘మిషన్ మంగళ్’, ‘దే దానా దాన్’, ‘హిచ్కీ’, ‘నికమ్మ’, ‘అగ్నీపథ్’, హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించి మెప్పించారు.

కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ఆయన మంచి సినిమాలు తెరకెక్కించారు. 2010 లో స్ప్రింట్ ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్‌ పై నిర్మించిన మరాఠీ సినిమా 'ఆఘాత్‌'తో దర్శకుడిగా పరిచయం అయ్యాయరు. అటు బుల్లితెర లోనూ ఆయన తన సత్తా చాటారు. 'ఘర్ ఆజా పరదేశి', 'అల్ప్విరామ్', 'జానా నా దిల్ సే దూర్', 'సంజీవ్ని', 'ఇంద్రధనుష్' వంటి షోల‌తో 2010లో విక్రమ్ గోఖలే ఉత్త‌మ‌ న‌టుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.  భారతీయ సినిమా పితామహుడిగా పేరు తెచ్చుకున్న దాదాసాహెబ్ ఫాల్కేకు వరసకు విక్రమ్ మనవడు కావడం విశేషం.

Read Also: నలభై తొమ్మిదేళ్ల తరువాత బ్రూస్ లీ మరణ మిస్టరీని చేధించిన పరిశోధకులు

గోఖలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన మృతి చెందారంటూ ఇంతకుముందు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం కూడా తెలిపారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే ఇంతలోనే ఆయన చనిపోయారనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదం లోకి వెళ్లారు. నటుడు విక్రమ్ గోఖలే మృతి పట్ల పలువురు ప్రమఖులు నివాళులర్పించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Allari Naresh: అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
Embed widget