Vijay Varma: ఆ విషయాల గురించి మాట్లాడ్డం ఇష్టం లేదు- తమన్నాతో ప్రేమాయణంపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తమన్నా- విజయ్ వర్మ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గా ఈ విషయాన్ని ఇద్దరూ కన్ఫామ్ చేశారు. అయితే, విజయ్ తన ప్రేమ వ్యవహారంతో పాటు వ్యక్తిగత వివరాల గురించి మాట్లాడ్డం పెద్దగా ఇష్టం లేదని చెప్పారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో తమన్నా, విజయ్ వర్మ హాట్ టాపిక్ గా మారారు. కొంత కాలంగా వీరిద్దరి గురించి బోలెడ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గోవా వేదికగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తమ ప్రేమ గురించి తమన్నాతో పాటు విజయ్ వర్మ కూడా కన్ఫామ్ చేశారు. రీసెంట్ గా విజయ్, తమన్నా కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. ఇందులో అడల్ట్ సీన్లు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ మూవీలో పలువురు స్టార్ హీరోయిన్లు నటించినా... తమన్నా, విజయ్ క్యారెక్టర్ల మీదే ప్రేక్షకులకు మరింత ఆసక్తిక కలిగించింది.
ఆ విషయాల గురించి మాట్లాడ్డం ఇష్టం లేదు- విజయ్ వర్మ
విజయ్, తమన్నాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న కారణంగా అతడి వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అతడి కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ ముచ్చట్ల గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి అయితే, తమ రిలేషన్ గురించి విజయ్ పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ప్రేమలో ఉన్న విషయాన్ని వెల్లడించినా, తమ తదుపరి ప్లాన్స్ గురించి ఎవరూ ఏమీ చెప్పడం లేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడట్లేరు అని విజయ్ ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర విషయం చెప్పారు. తన వ్యక్తిగత వివరాల గురించి బయటకు చెప్పడం పెద్దగా ఇష్టం లేదన్నారు. "నా మొత్తం సినీ కెరీర్‌లో నా వ్యక్తిగత జీవితం గురించి నేను ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. నేను దానిని కొనసాగించాలనుకుంటున్నాను. జీవితంలో ప్రతిదానికీ ఒక సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఆ సమయంలోనే నేను మాట్లాడతాను. కానీ, ప్రస్తుతానికి నేను నా పర్సనల్ విషయాల గురించి ప్రస్తావించలేను” అన్నారు.
వరుస ప్రాజెక్టులతో విజయ్ ఫుల్ బిజీ
విజయ్ వర్మ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ బిజీ బిజీగా కొనసాగిస్తున్నారు. 'డార్లింగ్స్', 'దహద్', 'లస్ట్ స్టోరీస్ 2' లాంటి ప్రాజెక్టులతో వరుస సక్సెస్ లు అందుకున్నారు. 'కల్‌కూట్' సిరీస్ లో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీసు అధికారిగా కనిపించనున్నారు. యాసిడ్ దాడికి గురైన శ్వేతా త్రిపాఠి శర్మతో కలిసి వెబ్-సిరీస్ లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వెబ్ సిరీస్ జూలై 27 నుంచి స్ట్రీమింగ్ కొనసాగనుంది.
ఇక విజయ్ రీసెంట్ గా నటించిన ‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’ బాగా పాపులర్ అయ్యింది. ఈ సిరీస్ లో నాలుగు కథల్ని చూపించనున్నారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు. 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ ని సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ నలుగురు దర్శకులు తెరకెక్కించారు. తమన్నా, విజయ్ వర్మ సెగ్మెంట్ కు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. తమన్నా, మృనాల్ ఠాకూర్ విజయ్ వర్మ, అమృతా సుభాష్, అంగద్ బేడీ,కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, తిలోత్తమా షోమే నటించారు. ఇక ఇందులో తమన్నా, విజయ వర్మ మధ్య వచ్చే బోల్డ్ సీన్స్ ఘాటుగా ఉన్నాయి. జూన్ 29న ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: వాటీజ్ థిస్ బేబీ - విజయ్ దేవరకొండకు దూరంగా రష్మిక!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial