(Source: Poll of Polls)
Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు
Thee Thalapathy Song : విజయ్ 'వారిసు'లో రెండో పాట 'థీ దళపతి...'ని శింబు పాడిన సంగతి తెలిసిందే. జస్ట్ పాడటమే కాదు... లిరికల్ వీడియో కోసం డ్యాన్స్ కూడా చేశారు. ఆ డ్యాన్స్ హైలైట్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) కథానాయకుడిగా రూపొందుతున్న తమిళ సినిమా 'వారిసు'. తెలుగులో 'వారసుడు'గా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. కానీ, జనవరి 12న విడుదల చేయనున్నారని టాక్. ఇందులో రెండో పాట 'థీ దళపతి...' పాటను ఈ రోజు విడుదల చేశారు.
శింబు పాడటమే కాదు...
డ్యాన్స్ కూడా ఇరగదీస్తే!
'థీ దళపతి...' పాటను యువ తమిళ హీరో శింబు (Silambarasan TR aka Simbu) పాడిన సంగతి తెలిసిందే. పాడటమే కాదు... ఆయన లిరికల్ వీడియో కోసం డ్యాన్స్ కూడా చేశారు. ఆయనకు చిత్ర బృందం ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది.
హీరోగా విజయ్ కెరియర్ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అవుతోంది. ఆయన జర్నీ సెలబ్రేట్ చేసేలా ఈ సాంగ్ రూపొందించారు. లిరికల్ వీడియో చూస్తే... థియేటర్లలో ఈ సాంగ్ వచ్చినప్పుడు అరుపులు, కేకలతో దద్దరిల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది.
రికార్డులు క్రియేట్ చేస్తున్న 'రంజితమే'
Ranjitha song records : 'వారిసు' సినిమాలో తొలి పాట 'రంజితమే...' రికార్డులు క్రియేట్ చేస్తోంది. తమిళ వెర్షన్ మూడు వారాల క్రితం పాట విడుదల కాగా... ఇప్పటి వరకు 75 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. రెండు మిలియన్స్‌కు పైకా లైక్స్ వచ్చాయి. తెలుగు వెర్షన్ 'రంజితమే...'కు 1.5 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి.
తమిళంలో 'రంజితమే...' పాటను విజయ్ పాడారు. తెలుగులో ఈ పాటను యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఫిమేల్ లిరిక్స్ మాత్రం తమిళంలో పాడిన ఎంఎం మానసి తెలుగులో కూడా పాడారు. తెలుగు పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ ఈ పాటకు బాణీ అందించిన సంగతి తెలిసిందే.
Also Read : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'వారసుడు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు (Dil Raju), శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక (Rashmika Mandanna) కథానాయికగా నటించారు.
Varisu Pre Release Business : తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ (Varasudu Theatrical Rights) ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ (Prakash Raj), జయసుధ, శ్రీకాంత్ (Srikanth Meka), శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.