Ram Charan : విజయ్ దేవరకొండకు కలిసి రాలేదు - మరి, రామ్ చరణ్‌కు?
హీరోలకు లోపం ఉండటం సినిమాకు వరమా? కదా? ముఖ్యంగా నత్తి హెల్ప్ అవుతుందా? లేదా? విజయ్ దేవరకొండకు అయితే కలిసి రాలేదు. మరి, రామ్ చరణ్‌కు ఏం అవుతుందో చూడాలి.
మన తెలుగు సినిమా కథానాయకుల్లో మార్పు వచ్చింది. వెండితెరపై హీరో అంటే శూరుడు, ధీరుడుగా కనిపించాలని కోరుకోవడం లేదు. లోపాలు ఉన్న క్యారెక్టర్లు చేయడానికి ముందుకు వస్తున్నారు. 'భలే భలే మగాడివోయ్'లో మతిమరుపు రోల్ చేశారు నాని. 'మహానుభావుడు'లో ఓసీడీ రోల్ చేశారు శర్వానంద్. చిన్న చిన్న హీరోలు కొందరు ఇటువంటి రోల్స్ చేశారు.
అగ్ర కథానాయకుల విషయానికి వస్తే... 'జై లవ కుశ'లో ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్లలో కనిపించారు. అందులో ఓ క్యారెక్టర్... జై నత్తితో మాట్లాడతారు. 'రంగస్థలం'లో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించారు. 'లైగర్'లో విజయ్ దేవరకొండ కూడా నత్తి ఉన్న రోల్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అటువంటి రోల్ చేస్తున్నారని సమాచారం.
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అందులో ఆయనది డ్యూయల్ రోల్ అనే సంగతి తెలిసిందే. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర నత్తి నత్తిగా మాట్లాడుతుందని సమాచారం. ఆ క్యారెక్టర్‌ను శంకర్ చాలా అంటే చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారట.
విజయ్ దేవరకొండకు కలిసి రాలేదు!
'జై లవ కుశ'లో ఎన్టీఆర్ నత్తి క్యారెక్టర్ బాగా క్లిక్ అయ్యింది. ఆయన డైలాగులు చెప్పిన తీరుకు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. అయితే... 'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండకు మాత్రం నత్తి క్యారెక్టర్ కలిసి రాలేదు. నత్తి వల్ల డైలాగ్ డెలివరీ బాలేదని చాలా మంది విమర్శలు చేశారు. సినిమా అంతా విజయ్ దేవరకొండ నత్తితో కనిపించడం వల్ల విమర్శలు వచ్చాయి. రామ్ చరణ్ మరో క్యారెక్టర్ నార్మల్‌గా మాట్లాడటం వల్ల అంత విమర్శలు రాకపోవచ్చు.
రామ్ చరణ్, శంకర్ సినిమాలో కియారా అడ్వాణీ ఓ కథానాయిక. 'వినయ విధేయ రామ' తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇటీవల వీళ్ళిద్దరిపై న్యూజీల్యాండ్‌లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో మరో కథానాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు.
View this post on Instagram
చరణ్ భార్యగా అంజలి!
Anjali Plays Ram Charan Wife Role In RC15 : రామ్ చరణ్ చేత ఈ సినిమాలో శంకర్ డ్యూయల్ రోల్ చేయిస్తున్నారు. అందులో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రోల్ కమల్ హాసన్ 'భారతీయుడు'లో ఓల్డ్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. ఆల్రెడీ సైకిల్ తొక్కే చరణ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి చూస్తే... RC15లో చరణ్ భార్యగా అంజలి నటిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళిద్దరి ఫ్యామిలీ ఫోటో లీక్ అయ్యింది. అందులో ఓ బాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి జంటగా నటిస్తుండగా... ఆ జంటకు జన్మించిన బాబు యంగ్ రామ్ చరణ్ అన్నమాట.
Also Read : పెళ్లి తర్వాత నయనతారలో ఎంత మార్పు? ఆ ఒక్క రూల్ బ్రేక్ చేసిన బ్యూటీ
శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రం (RRR Movie) తో రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయబోయే చిత్రాలు సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని, ఆ సినిమా విడుదలకు ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడీ శంకర్ సినిమాతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా చూస్తున్నారు.
Also Read : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు