Vijay Devarakonda & Rashmika: విజయ్ దేవరకొండ... రష్మిక... అలా దొరికేశారట!
ఓ విషయంలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా నెటిజన్స్‌కు దొరికేశారట! అసలు, ఏమైంది? ఏంటి? అంటే...
![Vijay Devarakonda & Rashmika: విజయ్ దేవరకొండ... రష్మిక... అలా దొరికేశారట! Vijay Devarakonda and Rashmika Mandanna celebrated new year together... Here's how netizens caught both of them Vijay Devarakonda & Rashmika: విజయ్ దేవరకొండ... రష్మిక... అలా దొరికేశారట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/01/a27422287b4c4aa4f3e361169bc13220_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జనవరి 1న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఎక్కడ ఉన్నారు? ఒకే ఇంట్లో ఉన్నారా? విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి రష్మిక న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారా? అంటే... నెటిజన్స్ 'అవును' అనే అంటున్నారు. సోషల్ మీడియాలో రష్మిక, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే ఆ విషయం తెలుస్తుందని అంటున్నారు. ఫొటోల ద్వారా వాళ్లిద్దరూ దొరికేశారని అంటున్నారు.
View this post on Instagram
న్యూ ఇయర్ విషెష్ చెబుతూ రష్మిక ఓ పోస్ట్ చేశారు. అందులో ఆమె వెనుక ఓ స్విమ్మింగ్ పూల్, కొబ్బరి చెట్లు, పచ్చటి మొక్కలు ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ కూడా జనవరి 1న ఓ పోస్ట్ చేశారు. లైగర్ ఫస్ట్ గ్లింప్స్‌కు వస్తున్న అద్భుత స్పందనను సెలబ్రేట్ చేసుకుంటుంటున్నామని చెప్పడంతో పాటు అందరికీ న్యూ ఇయర్ విషెష్ చెప్పారు. అందులో అతడి వెనుక బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్, రష్మిక ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ సేమ్ టు సేమ్. అందువల్ల, జనవరి 1న విజయ్ దేవరకొండ, రష్మిక ఒకే చోట ఉన్నారనేది అర్థం అయ్యిందని అంటున్నారు. అదీ సంగతి!
View this post on Instagram
Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.
Also Read: ఆవకాయ్ సీజన్‌లో 'అంటే సుందరానికి'... చక్కిలిగింతల్ పెడుతుందని!
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన స్టార్స్!
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
Also Read: ఒక్క పోస్టర్, ఒక్క డేట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్!
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)