తను నా బంగారం- ఇదంతా కలలా ఉంది- నయన్ భర్త విఘ్నేష్ ఎమోషనల్ పోస్ట్
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయన తార.. తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. పెళ్లి తర్వాత విఘ్నేష్ తొలి బర్త్ డేను ఊహించని రీతిలో సెలబ్రేట్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తింది.
దక్షిణాది సినిమా పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తాజాగా మూడు ముళ్ల బంధంతో ఓ ఇంటావిడ అయ్యింది. తన ప్రియుడు, ప్రముఖ దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. వెడ్డింగ్ తర్వాత ఈ కొత్త దంపతులు ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఏమాత్రం తీరిక దొరికినా.. టూర్లేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా తన భర్తకు నయనతార ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.
వాస్తవానికి నయనతార, విఘ్నేష్ చాలా కాలంగా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. పార్టీలు, పబ్బులకు వెళ్తూనే ఉన్నారు. ఇద్దరు బర్త డే వేడుకలు, వాలంటైన్స్ డే వేడుకలు అంటూ నానా రచ్చ చేశారు. అయితే, పెళ్లి తర్వాత విఘ్నేష్ తొలి బర్త్ డేను ఊహించని రీతిలో జరపాలని నయన్ ఫ్లాన్ చేసింది. ఆదివారం రోజున అతడి బర్త్ సెలబ్రేషన్ నిర్వహించింది. నయన్ సర్ ప్రైజ్ చూసి విఘ్నేష్ ఆశ్చర్యపోయాడు.
ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరున్న బుర్జ్ ఖలీఫా ముందు విఘ్నేష్ శివన్ బర్త్ డే నిర్వహించింది నయనతార. ఈ వేడుకల్లో విఘ్నేష్ ఫ్యామిలీ మెంబర్స్ సైతం పాల్గొన్నారు. తన భార్య చేసిన బర్త్ డే వేడుకలను చూసి శివన్ ఎంతో హ్యాపీగా ఫీలయ్యాడట. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్టు పెట్టాడు. “నా భార్య నయనతార అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. తను నా బంగారం. నన్నెంతో ప్రేమించే వ్యక్తుల మధ్య పుట్టిన రోజు సెలబ్రేషన్స్ బుర్జ్ ఖలీఫా దగ్గర చేసుకోవడం కలలాగా ఉంది. ఇంత కంటే ప్రత్యేకతను నేను ఊహించలేను. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని, మరచిపోలేని క్షణాలను నాకు ఇచ్చిన ఆ భగవంతుడికి ఎప్పటికీ ధన్యవాదాలు’’ అంటూ ఎమోష్ అయ్యాడు.
View this post on Instagram
కొద్ది రోజుల క్రితం నయన్, విఘ్నష్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. అద్భుత ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి ఫోటోలను ఫ్యాన్స్ ముందుంచుతున్నారు. మరోవైపు పెళ్లి తర్వాత నయన తార నటనా జీవితాన్ని వదులుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, వాటిలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. తాజాగా తను షారుఖ్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేయడంతోపాటు తన కెరీర్ లో 75వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి తాజా మూవీ గాడ్ ఫాదర్ లో నయనతార పవర్ ఫుల్ రోల్ పోషించబోతున్నది. తాజాగా ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సత్యప్రియ జయదేవ్ గా ఈ సినిమాలో తను కనిపించనున్నట్లు పోస్టర్ లో వెల్లడించారు. ఈమె ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.