Katrina Kaif: అనంత్ అంబానీ ఈవెంట్‌కి సింగిల్‌గా వచ్చిన విక్కీ కౌశల్, ప్రెగ్నెన్సీ వల్లే కత్రినా రాలేదా?
Vicky Kaushal: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ సంగీత్ ఈవెంట్‌కి విక్కీ కౌశల్ సింగిల్‌గా వచ్చాడు. కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ వస్తున్న టైమ్‌లో విక్కీ ఇలా ఒక్కడే కనిపించాడు.
Katrina's Pregnancy Rumours: కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై విక్కీ కౌశల్ కానీ, కత్రినా కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. అయితే...అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్ సంగీత్ ఈవెంట్‌కి బాలీవుడ్ తారలంతా వచ్చారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌కి కూడా ఇన్విటేషన్ పంపింది అంబానీ ఫ్యామిలీ. కానీ ఈ ఈవెంట్ విక్కీ కౌశల్ సింగిల్‌గా వచ్చాడు. కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ వస్తున్న టైమ్‌లో ఇలా ఒక్కడే రావడం ఇంట్రెస్టింగ్ మారింది. కత్రినా గర్భం దాల్చడం వల్లే రాలేకపోయిందని, అందుకే విక్కీ ఒక్కడే వచ్చాడని కొందరు అప్పుడే తేల్చేస్తున్నారు. ఈవెంట్‌కి వచ్చిన సమయంలో ఫొటోగ్రాఫర్‌లు అడిగిన ప్రశ్నకి విక్కీ చాలా తెలివిగా సమాధానమిచ్చి జారుకున్నాడు. "వదిన ఎక్కడుందన్నా" అని అడగ్గా "ఔటాఫ్ ముంబయి" అని బదులిచ్చి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు విక్కీ కౌశల్.
అప్పటి నుంచి రూమర్స్..
కొద్ది రోజుల క్రితం కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. Bad Newz సినిమా ట్రైలర్‌ని చాలా బాగుందంటూ టీమ్‌కి ఆల్‌ది బెస్ట్ చెప్పింది. విక్కీ కౌశల్ ఇన్‌స్టా పోస్ట్‌ని ఇలా షేర్ చేసింది కత్రినా. "ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అందరికీ కంగ్రాట్స్" అని స్టోరీ పెట్టింది. ఈ పోస్ట్‌కి కరణ్ జోహార్‌నీ ట్యాగ్ చేసింది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో విక్కీ కౌశల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. Bad Newz సినిమాలో కత్రినా కూడా ఉందని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మూవీలో కత్రినా ఎక్కడుందని అంతా కన్‌ఫ్యూజ్ అయ్యారు. సినిమాలో నేరుగా ఆమె లేకపోయినప్పటికీ ఆమె ప్రెగ్నెంట్ అని ఇలా హింట్ ఇచ్చాడన్న గుసగుసలు వినిపించాయి. ఈ బ్యాడ్ న్యూస్ సినిమాలోని హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అది కూడా చాలా అరుదుగా జరిగిపోతుంది.
View this post on Instagram
ఇలాంటి సినిమా గురించి మాట్లాడుతూ కత్రినా కూడా ఇందులో ఉందని విక్కీ అనడం వల్ల కత్రినా ప్రెగ్నెంట్ అని హింట్ ఇచ్చాడంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లోనే మీడియా "గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతున్నారు" అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు చాలా ఫన్నీగా సమాధానమిచ్చాడు విక్కీ కౌశల్. "ప్రస్తుతానికి బ్యాడ్ న్యూస్‌ని ఎంజాయ్ చేయండి. గుడ్ న్యూస్ చెప్పే టైమ్ కూడా వస్తుంది. అయినా అలాంటి విషయాల్ని చెప్పడానికి మేమేమీ సిగ్గుపడం" అని తేల్చి చెప్పాడు. ఇప్పుడు అనంత్ అంబానీ సంగీత్‌కి ఒక్కడే రావడం వల్ల మరోసారి ఇదే డిబేట్ జరుగుతోంది.