అన్వేషించండి
Advertisement
F3 Movie: 'ఎఫ్3' బడ్జెట్ - రెమ్యునరేషన్సే ఎక్కువ?
'ఎఫ్3' సినిమా బడ్జెట్ లో సగానికంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్స్ కే సరిపోయిందట.
వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటిస్తోన్న సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలే ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. వీరితో పాటు కొన్ని పాత్రలను యాడ్ చేశారు. అందులో సునీల్, సోనాల్ చౌహన్ లాంటి స్టార్లు ఉన్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు మే 27న సినిమాను విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ జోరు పెంచారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా బడ్జెట్ లో సగానికంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్స్ కే సరిపోయిందట. 'ఎఫ్3' సినిమాకి వెంకటేష్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.15 కోట్లు అని సమాచారం. వెంకటేష్ స్టార్ హీరో అయినప్పటికీ.. ఈ రేంజ్ లో ఆయన రెమ్యునరేషన్ తీసుకోలేదు. 'ఎఫ్2' సినిమా కోసం ఆయన రూ.5 కోట్లకు అటు ఇటుగా తీసుకున్నారు.
అలాంటిది 'ఎఫ్3' సినిమాకి వచ్చేసరికి రూ.15 కోట్లు అందుకున్నారు. వరుణ్ తేజ్ కూడా రెమ్యునరేషన్ పెంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. 'ఎఫ్2' సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. సీక్వెల్ పై భారీ అంచనాలు పెరగడంతో పాటు క్రేజ్ కూడా ఉండడంతో నిర్మాత దిల్ రాజు హీరోలకు అడిగినంత మొత్తాన్ని ఇచ్చేశారట. ఐటెం సాంగ్ కోసం పూజాహెగ్డేను రంగంలోకి దింపారు. దానికి ఆమెకి దాదాపు కోటిన్నర చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా రూ.45 కోట్ల వరకు అయింది. సునీల్, సోనాల్ చౌహాన్ లాంటి తారలను తీసుకురావడంతో బడ్జెట్ లిమిట్ దాటేసిందట. 'ఎఫ్2'తో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోయింది. మరి ఆ రేంజ్ లో కలెక్షన్స్ ను సాధిస్తుందేమో చూడాలి..!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion