Veera Simha Reddy Runtime : 'వీర సింహా రెడ్డి', 'అఖండ' - ఆ విషయంలో ఒక్కటే!
Balakrishna New Movie : 'వీర సింహా రెడ్డి'గా నట సింహం నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు, 'అఖండ'కు మధ్య ఓ పోలిక ఉంది. అదేంటో చూడండి.
'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie)గా వచ్చే సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు, బాలయ్య లాస్ట్ సినిమా 'అఖండ'కు మధ్య ఓ పోలిక ఉంది. అదేంటో తెలుసా?
రన్ టైమ్ అటు ఇటుగా ఒక్కటే!
Veera Simha Reddy Run Time : సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ నిడివి ఉంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని, లెంగ్త్ ఎక్కువైందని కంప్లైంట్ చేస్తారని కొందరు చెబుతారు. రెండున్నర గంటల కంటే ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.
ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'వీర సింహా రెడ్డి' చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. టోటల్ టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. త్వరలో బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ (Shruti Hassan) మీద ఆ పాటను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : వయసుతో పాటు మారిన కథానాయకుడు, ప్రయోగాలకు భరోసా ఇచ్చిన 'విక్టరీ'
ఆల్రెడీ 'జై బాలయ్య...' సాంగ్ విడుదల చేశారు. అది బాలకృష్ణ మీద పిక్చరైజ్ చేశారు. రెండో పాట 'సుగుణ సుందరి...'ని గురువారం విడుదల చేయనున్నారు. ఆ పాటను టర్కీలోబాలకృష్ణ, శృతి హాసన్ మీద తెరకెక్కించారు.
రీ రికార్డింగ్‌లో తమన్!
'వీర సింహా రెడ్డి' పాటలకు ట్యూన్స్ అందించే పని పూర్తి అయ్యిందని, ఇప్పుడు నేపథ్య సంగీతం అందించే పనులు ప్రారంభించామని కొన్ని రోజుల క్రితం సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రితో దిగిన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.
బాలకృష్ణ లాస్ట్ సినిమా 'అఖండ'కు తమన్ సంగీతం అందించారు. ఆ సినిమా విజయం నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. అంతే కాదు... థియేటర్లలో సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు పూనకాలు వచ్చేలా చేసింది. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' నేపథ్య సంగీతం ఆ సినిమా నేపథ్య సంగీతం మించి ఉండాలని బాలకృష్ణ, నందమూరి అభిమానులు కోరుతున్నారు.
''సమర సింహా రెడ్డి, అఖండ లెవెల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆశిస్తున్నాం'', ''బావ గోపికి ఇచ్చిన మాట నిలపెట్టుకో తమన్ అన్న…! అఖండ BGM కి మించి ఉండాలి…!'', ''బాక్సులు పగిలిపోవాలి'', ''అఖండను మించి ఉండాలి'', ''తమన్ అన్నా... ర్యాంప్ ఆడించాలి అన్నా'' అని తమన్ ట్వీట్ కింద బాలకృష్ణ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. 'అఖండ'తో తమన్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇప్పుడు దాన్ని అధిగమించాల్సి బాధ్యత ఆయనపై ఉంది.
హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.