Ranga Ranga Vaibhavanga: ఆర్జే కాజల్, మెహబూబ్‌తో జతకట్టిన వైష్ణవ్ తేజ్, కేతిక - కొత్తగా లేదేంటో!
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయేన్సర్ సాయంతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
మెగాస్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు మాట్లాడుకోకుండానే ప్రేమించుకుంటారనేది టీజర్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ టీజర్ మెగా అభిమానులకు మాత్రం మాంచి కిక్ ఇచ్చింది. టీజర్లో వైష్ణవ్ తేజ్ చూపించిన రెండు వేరియేషన్స్‌ను చూడగానే మెగా అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే.. అందులో ముఖం మీద ఉన్న చెమటను వేలితో వేసిరే సీన్ మెగాస్టార్ చిరంజీవిది. టీజర్ చివర్లో రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చే సన్నివేశంలో వైష్ణవ్ తేజ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దించేశాడు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘కొత్తగా లేదేంటి...’ అంటూ ఓ రొమాంటిక్ సాంగ్‌ను వదిలారు.
‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రమోషన్ కోసం అప్పుడే రంగంలోకి దింగిపోయారు వైష్ణవ్, కేతిక. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ ఆర్జే కాజల్‌తో ఓ వీడియో, ‘దిల్ సే’ మెహబూబ్‌తో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram