Vaarasudu Movie: ‘వారసుడు’లో ఖుష్బు ట్రాక్ తొలగింపు - ఆ 20 నిమిషాలకు రూ.10 కోట్లు వేస్ట్?
‘వారసుడు’ మూవీ నుంచి ఖుష్బు పాత్రను పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. 20 నిమిషాల నిడివి గల ఆమె సీన్స్‌కు సుమారు రూ.2 కోట్లు వెచ్చించారట.
తమిళ హీరో విజయ్ నటించిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’. తమిళనాడులో జనవరి 11న విడుదలై ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 14న విడుదలైన ఈ మూవీకి యావరేజ్ టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా రష్మిక మందన్నా నటించిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగు నటులు జయసుధా, శ్రీకాంత్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. అయితే, ఈ మూవీ ప్రారంభానికి ముందు ఖుష్పూ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ మూవీ టీమ్ రిలీజ్ చేసిన స్టిల్స్‌లో కూడా ఖుష్బూ ఉన్నారు. అంతేకాదు, ఆమెపై కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేశారట. అయితే, సినిమా విడుదలైన తర్వాత ఖుష్బూ కనీసం ఒక్క సీన్‌లో కూడా లేరు.
‘వారసుడు’లో ఖుష్బు ఎక్కడ?
తమిళ సినీ ప్రేమికులకు ఖుష్బు ఎంత ఇష్టమో తెలిసిందే. జనవరి 11న ‘వారిసు’ మూవీ చూసిన తమిళ ప్రేక్షకులు.. ఖుష్బూ పాత్ర ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారట. ఆమెను ట్రైలర్‌లో కూడా చూపించకపోవడంతో ఏదో కీలక పాత్రలో లేదా అతిథి పాత్రలో కనిపిస్తుందేమో అని అనుకున్నారట. శుభం కార్డు పడేవరకు ఆమె ఒక్క సీన్‌లో కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయారు. అసలు ఖుష్బూను ఏ పాత్ర కోసం ఎంపిక చేశారు? ఎందుకు తొలగించారనే సందేహం నెలకొంది. విజయ్ సినిమాలో ఖుష్బు ఉంటుందనే ఆశతో చాలామంది అభిమానులు ఆ మూవీకి వెళ్లారు. ఆమె కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
ఖుష్బు సీన్స్‌కు రూ.10 కోట్లు ఖర్చు?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆ సినిమాలో ఖుష్బూ కూడా నటించింది. అయితే, ఎడిటింగ్‌లో మొత్తం ఆమె పాత్రనే లేపేశారట. ఆమె పాత్ర నిడివి దాదాపు 20 నిమిషాలకు పైగా ఉంటుందట. పైగా, సినిమా నిడివి కూడా బాగా పెరగడంతో చివరి క్షణంలో కత్తెరకు పనిచెప్పారట. దీంతో మూవీలో ఖుష్బూ పాత్రను పూర్తిగా తొలగించినట్లు తెలుస్తోంది. అప్పటికే ఆ సీన్లు చిత్రీకరించడం వల్ల ఖుష్బూ రెమ్యునరేషన్, షూటింగ్ వ్యయం అన్నీ కలిపి దాదాపు రూ.10 కోట్లు వరకు ఖర్చయ్యాయట. ఖుష్బూ పాత్ర తొలగించడం వల్ల దాదాపు రూ.10 కోట్లు వేస్టయినట్లు కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. లక్కీగా ‘వారిసు’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, కలెక్షన్స్ కూడా బాగానే వస్తుండటంతో నిర్మాత ‘దిల్’ రాజు హ్యాపీగా ఉన్నారు. ఈ మూవీ మొత్తం బడ్జెట్ రూ.280 కోట్లు. ఇప్పటికే ఈ మూవీ రూ.210 కోట్లు వరకు వసూళ్లు సాధించింది.
View this post on Instagram
Also Read: ‘వారిసు’ కోసం విజయ్‌కు భారీ రెమ్యునరేషన్, రష్మికాకు ఎంతిచ్చారో తెలుసా?