Urfi Javed: అందుకే నేను పూర్తిగా బట్టలేసుకోలేను - అసలు విషయం చెప్పిన ఉర్ఫీ జావెద్
ఉర్ఫీ జావేద్ నిండైన బట్టలు ఎందుకు ధరించదో వివరించింది. ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులను ధరించలేనని ప్రకటించింది.
ఉర్ఫీ జావేద్, సోషల్ మీడియాతో పరిచయం ఉన్న వారందరికీ ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె చిత్ర విచిత్రమైన డ్రెస్సింగ్ సెన్స్, ఫ్యాషన్ స్టెట్మెంట్స్ కు కేరాఫ్ అడ్రస్. ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా ఉర్ఫీ బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు(?) చూస్తే.. వామ్మో అనిపిస్తాయి.
నాకు బట్టలంటే అక్షరాలా అలెర్జీ
తాజాగా తాను ఎందుకు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాల్సి వస్తుందో వివరించింది ఉర్ఫీ జావేద్. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలోకి వదిలింది. ‘చలికాలంలో ఎవరికైనా ఈ అలర్జీ వస్తుందా?’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. నిండైన దుస్తులు ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించింది. “ఫుల్ ఉన్ని దుస్తులు ధరించడం వల్ల తన శరీరం అలర్జీకి గురవుతోందని తెలిపింది. అక్కడక్కడా పొక్కులు వస్తున్నాయి. అందుకే నాకు బట్టలంటే అక్షరాలా అలెర్జీ. ఇప్పుడు మీకూ తెలిసింది నేను ఎందుకు బట్టలు వేసుకోనో! నాకున్న ఈ తీవ్రమైన పరిస్థితి కారణంగా నిండైన బట్టలు వేసుకుంటే వెంటనే దురద ఏర్పడుతుంది. కాబట్టి నేను ఎక్కువగా నగ్నంగా ఉండటానికే ఇష్టపడతాను” అని ఉర్ఫీ వెల్లడించింది.
View this post on Instagram
ఉర్ఫీ యాక్టింగ్ కెరీర్..
ఇక ఈ ముద్దుగుమ్మ గత సంవత్సరం బిగ్ బాస్ OTT సీజన్ 1 లో కనిపించింది. షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ ఆమే. ఆ షో నుంచి బయటకు వచ్చాక మరింత గుర్తింపు పొందింది. గతంలో బుల్లితెరపై నటించి మెప్పించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.
Read Also: ఉర్ఫీ జావేద్ ఎవరు? ఎందుకు సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది?