News
News
X

Upcoming Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా - థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్ ఇవే!

ఈ వారం కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

FOLLOW US: 

ఈ వారం కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

'ఊర్వశివో రాక్షసివో':

అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఒక సినిమాను రూపొందించింది. ఆ మధ్య ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. 'ప్రేమ కాదంట' (Prema Kadanta Movie) టైటిల్‌తో వచ్చిన ఆ సినిమాకు రాకేశ్ శశి దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చారు. కొత్త టైటిల్ ఏంటంటే.. 'ఊర్వశివో రాక్షసివో'. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ కి మంచి బజ్ వచ్చింది. నవంబర్ 4న (Allu Sirish New Movie Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.  

లైక్ షేర్ సబ్ స్క్రైబ్:  

News Reels

సంతోష్ శోభన్ నటిస్తోన్న తాజా సినిమా Like, Share, Subscribe. సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మేర్లపాక గాంధీ 'లైక్ షేర్ సబ్ స్క్రైబ్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా  నటిస్తోంది. నవంబర్ 4 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

బొమ్మ బ్లాక్ బస్టర్:

నందు ఆనంద్ కృష్ణ‌ (Nandu Anand Krishna ) కథానాయకుడిగా నటించిన సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్' (Bomma Blockbuster Telugu Movie). ఇందులో ఆయనకు జోడీగా ర‌ష్మీ గౌత‌మ్ (Rashmi Gautam) నటించారు. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై ప‌వ్రీణ్ ప‌గ‌డాల‌, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మ‌డ్డి, మ‌నోహార్ రెడ్డి ఈడా నిర్మించారు. నవంబర్) 4వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

బనారస్:

జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటించిన సినిమా 'బనారస్'. జయతీర్ధ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. 

తగ్గేదేలే:

నవీన్ చంద్ర తాజాగా నటించిన సినిమా 'తగ్గేదేలే'. ఈ సినిమాకు 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా దివ్య పిళ్ళై కనిపించనున్నారు. అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు తెరపై కనిపించనున్నారు. ఇక భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా 'తగ్గేదేలే' సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జెట్టి:

నందిత శ్వేతా ప్రధాన పాత్రలో దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక రూపొందించిన సినిమా 'జెట్టి'. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మిలి:

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ 'మిలి'. ముత్తుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. 

ఓటీటీ రిలీజెస్: 

నెట్ ఫ్లిక్స్:

నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా నవంబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

ఇన్సైడ్ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమా అక్టోబర్ 31 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

ఎనోలా హోమ్స్ 2, మేనిఫెస్ట్ సీజన్ 4 నవంబర్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్నాయి. 

హాట్ స్టార్:

రణబీర్ కపూర్, అలియా జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు నవంబర్ 4 నుంచి హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 

ప్రైమ్ వీడియో:

దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా నవంబర్ 4 నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

ఆహా:

బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న 'అన్ స్టాపబుల్' మూడో ఎపిసోడ్ నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్

Published at : 31 Oct 2022 02:50 PM (IST) Tags: Tollywood Upcoming Movie releases Urvasivo Rakshasivo like share subscribe Bomma blockbuster Like share subscribe.

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్