News
News
వీడియోలు ఆటలు
X

Upasana Konidela: బిడ్డ పుట్టేది అప్పుడే - రివీల్ చేసిన ఉపాసన!

జులై నెలలో తమకు బిడ్డ పుట్టనుందని ఉపాసన కొణిదెల తెలిపింది.

FOLLOW US: 
Share:

మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. తనకు జులైలో ప్రసవం కానుందట. ఈ విషయాన్ని ఉపాసననే స్వయంగా తెలిపారు. ‘ప్రతి తల్లిదండ్రుల లాగానే మేం కూడా ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నాం.’ అని ఉపాసన పేర్కొన్నారు. అలాగే తను గర్భంతో ఉన్నప్పుడు భర్త రామ్ చరణ్ ఎంత సపోర్ట్ చేశాడో కూడా చెప్పారు. ‘పుట్టబోయే బిడ్డకు పూర్తి స్వేచ్చని ఇస్తాం. అయితే దాంతో పాటు గైడ్ లైన్స్, బాధ్యతలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు స్టార్‌డమ్‌తో పాటు కొండంత బాధ్యత కూడా వస్తుంది. దాని విలువ దానికి ఇవ్వాల్సిందే.’ అన్నారు.

గర్భంతో ఉన్నప్పటికీ తన బాధ్యతలను ఉపాసన నిర్వర్తిస్తూనే ఉన్నారు. పని చేస్తున్న మహిళలకు తను మార్గదర్శిగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘మీ జీవితంలో తల్లి కావడం అనే భాగం కొత్తగా ఎందుకు ఉండాలి?’ అని ఉపాసన ప్రశ్నించారు. ‘నాకు ఎంతో సాయం ఉంది. తమ పిల్లల జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా ఎక్కువ మంది మహిళలు ఉద్యోగం ఎలా చేయాలి అనే విషయంలో నేను ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను.’ అని తెలిపారు.

దీంతోపాటు మెటర్నిటీ లీవ్‌పై కూడా ఉపాసన కొణిదెల మాట్లాడారు. ‘కచ్చితంగా ఆరు నెలలు మాత్రమే మెటర్నిటీ లీవ్ ఉండేలా ఎలా నిర్ణయిస్తారు? మూడు నెలలు లేదా తొమ్మిది నెలలు ఎందుకు ఉండకూడదు? వ్యక్తికి తగ్గట్లు ఎందుకు దాన్ని మార్చుకోకూడదు. హెల్త్ కేర్ మనదేశంలో అందుబాటులో ఉంది. దాని కోసం మనం వేర్వేరు రకాలుగా ప్రయత్నించాలి. నాకు ఆ సపోర్ట్ ఉంది. నా ప్రసవానికి మా సంస్థ సహకరిస్తుందని నాకు నమ్మకం ఉంది. దానికి నాకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. నా ప్రసవానికి నేను ఆ ఇన్సూరెన్స్ ఉపయోగించుకుంటాను.’ అన్నారు.

అలాగే ఆర్ఆర్ఆర్‌ సినిమాకు ముందు తమ జీవితం కూడా ఉపాసన మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్‌కు ముందు జీవితం చాలా భిన్నంగా ఉండేది. ఆర్ఆర్ఆర్ సినిమా ఒక మూడు సంవత్సరాల ప్రయాణం. ప్రస్తుతం పూర్తిగా కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం. అది మా ఇద్దరికీ పూర్తిగా అందమైన అనుభవం.’ అని పేర్కొన్నారు.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఉపాసన.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ప్రెగ్నెన్సీ అనేది ఓ వేడుకలా ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా’’ అని వెల్లడించారు.

ప్రముఖ వ్యాపార వేత్త, 'అపోలో హాస్పిటల్స్' గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన తమ పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు. శోభ కామినేని, అనిల్ కామినేని దంపతుల రెండో కుమార్తె అయిన ఉపాసన.. చిన్న వయసు నుంచే వ్యాపార లావాదేవీలను చూసుకోవడం మొదలుపెట్టారు. ఓ పక్క బిజినెస్ చూసుకుంటూనే, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉపాసన కొణిదెల మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

Published at : 20 Apr 2023 05:55 PM (IST) Tags: Upasana Ram Charan Upasana Konidela

సంబంధిత కథనాలు

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?