Nuvvunte Naa Jathaga Serial: నువ్వుంటే నా జతగా సీరియల్ వీక్లీ: దేవా-మిథునల బంధంపై విషం చిమ్మిన ఆదిత్య! మామ మనసు గెలిచేందుకు దేవా ఏమైనా చేశాడా?
Nuvvunte Naa Jathaga Serial August 4th to 8th Weekly Episode మిథున, దేవాలను విడదీయాలని ఆదిత్య వాళ్లు ప్రయత్నించడం హరివర్ధన్‌కి దేవా మీద పాజిటివిటీ రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి.

Nuvvunte Naa Jathaga Serial Weekly Episode దేవాని హరివర్ధన్ దగ్గర మంచోడిగా నిరూపించి తన కాపురం నిలబెట్టుకోవాలని మిథున ప్రయత్నిస్తుంటే ఎలా అయినా మిథునా దేవాలను విడదీయాలని ఆదిత్య భారీ సినిమాలో విలన్ రేంజ్‌లో ప్రయత్నిస్తుంటే తమ్ముడికి ఏం మాత్రం తీసిపోకుండా త్రిపుర కుట్రలు చేస్తుంది. సూర్యకాంతం త్రిపురతో చేతులు కలుపుతుంది. దేవా మందు లేక విలవిల్లాడిపోతాడు కానీ మిథున కోసం తాగకుండా ఉంటే ఆదిత్య దేవా ఆలోచించేలా మాట్లాడి మందు తాగేలా చేయడం అదే ఛాన్స్‌గా త్రిపుర బ్యాడ్ చేసేస్తుంది. ఇదే ఛాన్స్‌గా హరివర్ధన్‌ని రెచ్చగొట్టేస్తుంది. మిథునతో హరివర్థన్ ఎప్పటిలా దేవా నీకు కరెక్ట్ కాదు అని చెప్తాడు.
హరివర్ధన్ పద్ధతిగా ఉంటే దేవా మాత్రం లుంగీ కట్టి పక్కా నాటుగా వాళ్లని హడలెత్తిస్తాడు. డీజీ టిల్లు రేంజ్‌లో మామ ముందు కూర్చొని టిఫెన్ చేస్తాడు. దెబ్బకి హరివర్థన్ లేచి వెళ్లిపోతాడు. ఒక టైంలో త్రిపుర, రాహుల్‌లు ఇంటి నుంచి వెళ్లిపోతామని అంటే ఇది మీ ఇళ్లు వాడికి భయపడి మీరు వెళ్లిపోవడం ఏంటి నేనే ఏదో ఒకటి చేస్తా వాడినే పంపేస్తా కాస్త ఓపిక పట్టండి అని జడ్జి చెప్తారు. ఇక దేవా తల్లితో ఈ ఇంట్లో ఉండటం కష్టమే అయినా మిథున కోసం ఉంటున్నా అని చెప్పడంతో దేవాలో మార్పు వచ్చేస్తుందని శారద వాళ్లు సంతోషపడతారు.
దేవా తాగడం వల్ల ఇంట్లో జరిగిన గొడవకు దేవా మిథునకు సారీ చెప్తాడు. దేవా క్షమాపణ చెప్పేసరికి మిథున సంతోషంలో దేవాని హగ్ చేసుకొని ఎగిరి గంతులేస్తుంది. దేవాలో మార్పు వచ్చేసింది నన్ను ప్రేమిస్తున్నాడని మమల్ని ఇక ఎవరూ విడదీయలేరని ఆదిత్యతో చెప్పి పొంగిపోతుంది. ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతాడు. మిథున నాకు మాత్రమే సొంతం ఆ దేవాని హగ్ చేసుకుంటే నా రక్తం మరిగిపోయింది ఆ దేవాని చంపేయాలి అనిపించింది.. నువ్వు నా భార్యవి మిథున విధ్వంసం సృష్టించి అయినా సరే నిన్ను నాభార్యని చేసుకుంటా. మీ నాన్న దగ్గర దేవా మంచివాడని నిరూపిస్తావా మిమల్ని విడగొట్టడానికి నేను సుడిగుండంలా మీ నాన్న దగ్గర నుంచి నరుక్కొస్తా అనుకుంటాడు.
మిథున, హరివర్ధన్ సెటిల్ ఆడుతారు. దేవా, తండ్రిని ఒక్కటి చేయాలని మిథున తన కాలికి గాయం అయినట్లు నటించి మామ అల్లుడు సెటిల్ ఆడేలా ప్లాన్ చేస్తుంది. దేవాని చూసి హరివర్ధన్ ఆగిపోతాడు. మిథున మాత్రం తండ్రిని రెచ్చగొట్టి దేవాతో హరివర్ధన్ ఆడేలా ప్లాన్ చేస్తుంది. సెటిల్‌లో ఓడించి దేవాకి బుద్ధి చెప్పమని త్రిపుర, రాహుల్ అంటారు. దేవా మామతో ఆడి లాస్ట్‌లో కావాలని ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోయావ్ అని మిథున అడిగితే మీ ఫ్యామిలీ సంతోషం కోసం అని చెప్తాడు. హరివర్ధన్ వాళ్లని చూపించి మీ నాన్న ఓడిపోయి ఉంటే వాళ్లంతా బాధ పడేవాళ్లు.. నలుగురిని సంతోష పెట్టడం కోసం ఓడిపోవడం కూడా గెలుపే అవుతుంది అని దేవా చెప్పడం ఆ మాటలు హరివర్ధన్ వింటాడు. మిథున మనసులో మా నాన్న మనసు గెలుచుకునేలా ఆడావని అనుకుంటుంది.
మరో ఎపిసోడ్‌లో దేవా నేల మీద పడుకోవడం చూసి మిథున చాలా బాధ పడుతుంది. దేవా పక్కనే కూర్చొని కన్నీరు పెట్టుకుంటుంది. దేవాని లేపి కింద పడుకున్నావేంటి పైన పడుకో అని అంటుంది. కింద పడుకుంటే ఏం అవుతుంది అని దేవా అంటే.. నువ్వు నా భర్త దేవా నువ్వు నా పుట్టింట్లో ఉన్నంత వరకు నిన్ను మర్యాదలో ఒక చిన్న పొరపాటు జరిగినా.. అవమానం జరిగినా నీ భార్యగా నేను ఓడిపోయినట్లే ఇక్కడున్నంతకాలం నువ్వు ఇబ్బంది పడకుండా హాయిగా ఉండాలి పద బెడ్ మీద పడుకో అంటుంది. నీకు పెట్టిన బాధలకు కింద పడుకుంటేనే ప్రాయశ్చిత్తం అవుతుందని దేవా చెప్తాడు.
మిథున భర్త, తండ్రిని కలపడానికి గుడికి ఇద్దరూ ఒకే కారులో వచ్చేలా ప్లాన్ చేస్తుంది. దేవా డ్రైవింగ్ చేస్తే హరివర్థన్ పక్కనే కూర్చొంటాడు. సీటు బెల్ట్ పెట్టుకోమని చెప్పిన దగ్గర నుంచి కారు దిగే వరకు దేవా మీద హరి వర్ధన్ చిరాకు పడుతూనే ఉంటాడు. దేవా పక్కా నాటు మాటలు మాట్లాడితే అతని యాసకు హరివర్ధన్ చిరాకు పడతాడు. హరివర్ధన్ దేవా మీద చిరాకు కోపం పెంచుకుంటాడు. అంతలోనే మిథున మీదకు లారీ రావడం దేవా, హరివర్థన్ ఇద్దరూ కాపాడటానికి పరుగులు పెడతారు. హరివర్థన్ కాపాడలేకపోవడం దేవా కాపాడటంతో హరివర్థన్లో మార్పు వస్తుంది. ఇక ఆదిత్య అయితే మిథున మనసులో దేవాపై ఉన్న ప్రేమ చెరిపేయాలని ప్రయత్నిస్తాడు. దేవా నిన్ను ప్రేమించడంలేదు.. వదిలేయాలని ప్రయత్నిస్తున్నాడని చెప్తాడు. ఇదీ ఈ వారం అప్‌డేట్స్.





















