Rangula Ratnam July 1st: భర్తను ఆఖరి కోరిక కోరిన వర్ష-చెల్లెలి సమస్య తెలుసుకొని తట్టుకోలేకపోతున్న రఘు?
వర్ష ఆరోగ్య పరిస్థితి మొత్తం దగ్గరికి పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Rangula Ratnam July 1st: సిద్దు ని రోడ్డు మీద వదిలేసి స్వప్న తన పుట్టింటికి వెళ్ళగా అక్కడ పోలీస్ ఉండటంతో లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా అతడు ఆపి ఈ ఇల్లు సీజ్ చేయబడింది అని.. ఈ ఇంట్లో వాళ్ళు ప్రస్తుతం స్టేషన్లో ఉన్నారు అని.. ప్రస్తుతం వీరిపై కేసు నడుస్తుందని అంటాడు. ఈ ఇంట్లోకి రావాలి అంటే కోర్టుకు వెళ్లి అక్కడ కొన్ని రూల్స్ తోని తాళం తెచ్చుకోవాలి అని అంటాడు.
దాంతో స్వప్న ఇప్పుడు కోర్టుకు వెళ్లి అంత డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో తిరిగి సిద్దు దగ్గరికి వెళ్తుంది. సిద్దు ఏం జరిగింది స్వప్న ఇల్లు సీజ్ చేశారా.. తాళం కోర్టు నుండి తెచ్చుకోమని అన్నారా అనటంతో ఈ విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతుంది స్వప్న. వాళ్ళు జైల్లో ఉన్నారు అంటే ఇల్లు కచ్చితంగా సీజ్ చేస్తారు అని అంటాడు.
ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మనకు లక్షల్లో ఇచ్చే ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అనటంతో ఇప్పుడు మనకు కావాల్సింది లక్షలు కాదు అని.. దానికి ఇల్లు తినటానికి మాత్రమే అని అంటాడు సిద్దు. దాంతో స్వప్న కాస్త వెటకారం చేసి.. ఇప్పుడు నేను డబ్బులు అడుగుతే ఇవ్వటానికి మా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు అని.. దాంతో మనం బిజినెస్ పెట్టొచ్చు అని అనటంతో సిద్దు ఇప్పుడు ఇవన్నీ మనకు వద్దు అని అంటాడు.
కానీ స్వప్న మాత్రం తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాము అని బలవంతంగా తీసుకొని వెళుతుంది. మరోవైపు వర్ష దేవుడి ముందు నిలబడి తన అత్తమామలు తనపై చూపిస్తున్న ప్రేమను తలుచుకొని బాధపడుతుంది. వాళ్లు తనను కూతురు లాగా చూసుకుంటున్నారు అని.. త్వరలో నేను వీరికి దూరమవుతాను అని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని దేవుడు ముందు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆకాష్ ఆ మాటలు విని చాలా బాధపడతాడు. ఇక ఆకాష్ ను చూసిన వర్ష కూడా చాలా బాధపడుతుంది. ఇక ఆకాష్ వర్షతో నేను మంచిగా చూసుకోనప్పుడు ఆ సమయంలో నన్ను బాగా చూసుకున్నావని.. ఇప్పుడు నేను మారాక దూరం అవుతున్నావు అని చెప్పుకుంటూ బాధపడతాడు. ఇలా ఉన్నాక కూడా ఏమి చేయాలేని అసమర్థుడుగా ఉన్నాను అని అంటాడు.
ఆ దేవుడు నా ప్రాణాలు తీసుకెళ్తే బాగుండు అని అంటాడు. దాంతో వర్ష మీరు అసమర్థుడు కాదండి.. నాకు వచ్చిన జబ్బు అటువంటిది.. మీరు ఏమీ బాధపడకండి అంటూ ధైర్యం చెబుతూ ఉంటుంది. తను కూడా ఒకవైపు ఏడుస్తూ ఉండగా తలనొప్పి గట్టిగా రావడంతో తలను గట్టిగా పట్టుకొని పడిపోతుండగా వెంటనే ఆకాష్ ఏం జరిగింది అని అడుగుతాడు. తలనొప్పి అని చెప్పటంతో వెంటనే టాబ్లెట్ తీసుకొచ్చి వేస్తాడు.
ఇక నొప్పి అలాగే తనను హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. ఇక హాస్పిటల్లో డాక్టర్స్ తనకు చికిత్స చేస్తూ ఉంటారు. తర్వాత డాక్టర్ నందగోపాల్ ఆకాష్ తో ఇప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితి అని.. జబ్బు ముదిరినప్పుడు వైద్యం చేసిన లాభం లేదు అని ఆఖరి కోరిక ఏంటో తీర్చు అని అంటాడు. ఆ తర్వాత ఆకాష్ వర్ష దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉండగా వర్ష ధైర్యం చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆకాష్ తన ఆఖరి కోరిక గురించి అడగటంతో.. తన అమ్మానాన్నలను కలపటమే తన ఆఖరి కోరిక అని చెబుతుంది. తరువాయి భాగంలో ఆకాష్ వర్షపు బ్రేక్ యువర్ ఉన్న విషయం రఘు దంపతులతో చెప్పటంతో వాళ్ళు షాక్ అవుతారు.