Naga Panchami October 9: కండిషన్ పెట్టి పంచమిని ఇంట్లోకి రమ్మన్న వైదేహి.. మరోసారి ఆలోచించుకోమన్న సుబ్బు!
Naga Panchami Serial Today Episode: పంచమి మోక్షని ఇంటికి తీసుకురావడంతో కధ మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
Naga Panchami Serial Today Episode ఈరోజు ఎపిసోడ్లో
సుబ్బు : మీ అబ్బాయిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చింది కదా లోపలికి రానివ్వండి.
పంచమి: అత్తయ్య, మోక్ష బాబుకి నయం అవ్వాలంటే నేను ఒక వ్రతం చేయాలి. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి.
చిత్ర: వెటకారంగా.. నీ దగ్గర ప్లాన్లు రెడీగా ఉంటాయి. నువ్వు వ్రతాలు చేస్తేనే మోక్ష బ్రెయిన్ బాగుంటుందా..
మోక్ష తమ్ముడు: మీరు కాసేపు మాట్లాడకండి. పెద్ద వాళ్లని మాట్లాడనివ్వండి.
మోక్ష అత్తయ్య : అసలు ఏం జరిగిందో చెప్పు. జరిగిందాంట్లో నీ తప్పేమీ లేకపోతే నువ్వు నేరుగా ఇంట్లోకి వెళ్లిపోవచ్చు.
పంచమి : నేను చెప్పినా మీరు నమ్మరు, నేను చెప్పిన వాటి మీద మీకు నమ్మకం ఉండదు.
మోక్ష పిన్ని : అలాంటిదేమీ లేదు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు.
పంచమి: నేను ఒక వారం రోజులు నిష్టగా పూజ చేయాలి, అలా చేస్తే మోక్ష బాబుకి నయమవుతుంది.
జ్వాల : నీ కథలు ఎవరు నమ్మేవాళ్లు లేరు. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్లూ అంటూ బలవంతంగా నెట్టేయబోతుంది.
మోక్ష బామ్మ జ్వాలని మందలిస్తుంది.
రఘురాం : అసలు మోక్షకి ఇలా ఎలా అయిందో చెప్పు ట్రీట్మెంట్ సంగతి తర్వాత చూద్దాం.
పంచమి: ఇదేదో దుష్టశక్తుల పని అని చెప్తే మీరు నమ్మరు కదా..
మోక్ష తమ్ముళ్లు : ఏదైనా చెప్తే నమ్మే విధంగా ఉండాలి, ఇలాంటి వాటిని మా మోక్ష అస్సలు నమ్మడు.
నా భర్తని ఎలా కాపాడుకోవాలి, వీళ్లని ఎలా నమ్మించాలి అని మదన పడుతుంది.
సుబ్బు: చిన్నవాడినైనా నా వింటాను అంటే ఒక విషయం చెప్తాను. మన కంటికి కనిపించనంత మాత్రాన దైవ శక్తి లేదని కాదు, దైవ శక్తి కనిపించదు కానీ నడిపిస్తుంది.
పంచమి : నాకు ఒక అవకాశం ఇవ్వండి. వారం రోజుల లోపల నయం అవ్వకపోతే మీరు ఏం చెప్తే అది చేస్తాను.
అందరూ వైదేహిని ఒప్పించి పంచమిని లోపలికి వచ్చేలా చేస్తారు. ఆ తరువాత శిశిర సుబ్బు దగ్గరికి వచ్చి లోపలికి రమ్మని చెప్తుంది.
సుబ్బు: నన్ను పంచమి తీసుకువచ్చింది కాబట్టి తను పిలిస్తే వస్తాను.
జ్వాల: ఎవరీ కొత్త క్యారెక్టర్, పంచమి.. మీ చుట్టమా?
సుబ్బు: నేను అందరికీ చుట్టాన్నే.
అప్పుడు బామ్మ బాబుని లోపలికి పిలువు అని చెప్పడంతో వైదేహి సుబ్బుని పిలుస్తుంది. అప్పుడు సుబ్బు ఇంట్లోకి వెళ్తాడు.
పిల్లలతో కలిసి చిన్న పిల్లాడిలా ఆడుకుంటున్న మోక్షని చూసి నవ్వుకుంటారు చిత్ర, జ్వాల. వీడు మనకి మంచి ఎంటర్టైన్మెంట్ పీస్. ఇకపై వీడిని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు అనుకుంటారు. ఆ మాటలు విన్న సుబ్బు నవ్వుకుంటాడు.
తరువాత వైదేహి నంబూద్రికి ఫోన్ చేస్తుంది.
వైదేహి: మోక్ష ఇంటికి వచ్చాడు గాని మమ్మల్ని గుర్తుపట్టే స్థితిలో లేడు. తనతో పాటు పంచమి కూడా వచ్చింది.
నంబూద్రి : తను మోక్ష బాగు కోసమే ప్రయత్నిస్తుంది. తనని బయటికి పంపించేయకండి.
వైదేహి: కానీ తను వచ్చిన దగ్గరనుంచి ఇంట్లో ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది.
నంబూద్రి : ఆమె జాతకంలో దోషం ఉంది అందుకే అలా జరుగుతుంది. అయినా ఆమెని శాశ్వతంగా ఉంచుకోమని చెప్పలేదు, తనని ఎప్పుడు బయటకు పంపించాలో నేను చెప్తాను.
వైదేహి: కానీ మోక్ష తనను వదిలి అస్సలు ఉండటం లేదు, ఏం మందు పెట్టిందో ఏమో.
నంబూద్రి : దేనినో చూసి భయపడినట్లు ఉన్నాడు అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. నాకు తెలిసిన ఒక మంచి సైకియాట్రిస్ట్ ఉంది. ఆమె పేరు మోహిని. ఆమె నెల రోజులు పాటు మీ ఇంట్లోనే ఉండి మోక్షకి మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది. రేపే తనని పంపిస్తాను.
వైదేహి: పంచమి విషయంలో కూడా ఏదైనా చేయండి.
నంబూద్రి: మీరేమీ కంగారు పడకండి తనంతట తానే ఇంట్లోంచి వెళ్లిపోయేలాగా చేస్తాను.
అందుకు సంతోషించిన వైదేహి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత వినాయకుని పూజ కోసం అంతా సిద్ధం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు.
బామ్మ: అందరూ ఇక్కడిక్కడ పనులే చేస్తున్నారు, ఎవరైనా వినాయకుని విగ్రహం తెచ్చారా లేదా..
జ్వాల: ఎవరూ తెచ్చినట్లుగా లేదు నేను, చిత్ర పెళ్లి విగ్రహాన్ని తీసుకొని వస్తాము.
సుబ్బు: విగ్రహాన్ని నేను తీసుకు వచ్చాను. నా గదిలో పెట్టాను కావాలంటే ఎవరైనా వెళ్లి తీసుకురండి.
జ్వాల వాళ్లు వాడు ఎలాంటి విగ్రహం తెచ్చాడు ఏమో, మేము ఇంకొక విగ్రహాన్ని తీసుకువస్తాము అంటే బామ్మ మందలిస్తుంది. అయితే గదిలో ఉన్న విగ్రహాన్ని నేను తీసుకు వస్తాను అని వెళ్లబోతుంది చిత్ర.
సుబ్బు: ఎవరు తీసుకొచ్చినా పర్వాలేదు కానీ తీసుకువచ్చేటప్పుడు మనస్పూర్తిగా దండం పెట్టుకొని తీసుకురండి. అప్పుడే భగవంతుడు మన చేత పూజ చేయించుకోవడానికి ఇష్టపడి మనతో వస్తాడు.
చిత్ర: అలాంటివి మా ఇంట వంట లేదు వెళ్లేమా, తెచ్చామా, పూజ చేశామా, తిన్నామా అంతవరకే.
ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా అవసరమా ఎవరైనా వెళ్లి విగ్రహాన్ని తీసుకువస్తారా లేకపోతే నేను వెళ్లి తీసుకు వస్తాను.
పంచమి: సుబ్బు చెప్పింది మంచిదే కదా భగవంతుడిని నమస్కరించి తీసుకువస్తే అంతా మంచే జరుగుతుంది.
జ్వాల : నువ్వేమీ మాట్లాడకు నీకు ఈ ఇంట్లో అంత సీన్ లేదు. ఇంట్లో మీ ఇద్దరూ వారం రోజుల గెస్టులు మాత్రమే అని పంచమి మీద కోప్పడే విగ్రహాన్ని తీసుకురమ్మని చిత్రానికి ఆర్డర్ వేస్తుంది.
చిత్ర విగ్రహం తేవడానికి వెళ్తుంది. అప్పుడు బామ్మ దిగులుగా ఉన్న వైదేహి దగ్గరికి వచ్చి పండగ పూట ఏమిటమ్మా ఈ కన్నీరు అంటుంది.
వైదేహి: ఆడుకుంటున్న కొడుకుని చూపిస్తూ నా కొడుకు చేయవలసిన పనులేనా అవి అంటుంది.
బామ్మ: బాధపడకు మనకి కూడా మంచి రోజులు వస్తాయి మళ్లీ మనం మామూలు మోక్షని చూస్తాము.
తరువాయి భాగంలో దీక్ష తీసుకోబోతున్న పంచమిని ఆపి దీక్ష తీసుకునే ముందు బాగా ఆలోచించి ఈ ఇంట్లోని నేను నమ్మే వాళ్లు నీకు సహకరించే వాళ్లు ఎవరూ లేరు. దీక్ష తీసుకున్న చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు సుబ్బు. నాకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ ఉంది. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి దీక్ష స్వీకరిస్తుంది పంచమి. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.