![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Trinayani Serial Today October 31st: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని చెప్పేసిన విక్రాంత్.. షాక్‌లో కొడుకుల చెంపలు వాయించిన తిలోత్తమ!
Trinayani Today Episode విక్రాంత్‌ని నయని నిలదీయడంతో విక్రాంత్ నిజం చెప్పేస్తాడు. నయని గాయత్రీ పాపని పట్టుకొని ఎమోషనల్ అయిపోవడం పాప మొదటి సారి అమ్మ అని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today October 31st: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని చెప్పేసిన విక్రాంత్.. షాక్‌లో కొడుకుల చెంపలు వాయించిన తిలోత్తమ! trinayani serial today october 31st episode written update in telugu Trinayani Serial Today October 31st: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని చెప్పేసిన విక్రాంత్.. షాక్‌లో కొడుకుల చెంపలు వాయించిన తిలోత్తమ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/31/e33679a740b9b0ee326470e06eb108021730339076643882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani Serial Today Episode అమ్మవారి కాంతి విక్రాంత్ మీద పడటంతో అందరూ విక్రాంత్‌కి గాయత్రీ దేవి పునర్జన్మ గురించి తెలుసా అని షాక్ అయిపోతారు. నయని విక్రాంత్ దగ్గరకు వెళ్లీ నీకు తెలుసా విక్రాంత్ బాబు అని అంటుంది. దానికి విక్రాంత్ కాంతి పడినంత మాత్రానా నాకు ఎలా తెలుస్తుందని అడుగుతాడు. వెంటనే నయని విక్రాంత్ కాలర్ పట్టుకొంటుంది.
నయని: మాట మార్చకండి విక్రాంత్ బాబు నా కూతురు గానవిని కూడా ఎత్తుకెళ్లి సుమన బిడ్డగా నాలుగు నెలలు పెంచుకున్నారు మీరు. అప్పుడే పాపని పెంచుకున్నారని నిలదీస్తే నిజం ఒప్పుకున్నారు. మర్యాదగా ఇప్పుడు నా పెద్ద కూతురి గురించి చెప్పారా సరే సరే లేదంటే మిమల్ని చూపించిన ఆ అమ్మవారికే మిమల్ని బలి ఇచ్చేస్తాను.
విక్రాంత్: చెప్తాను వదిన మీరు కన్న కూతురు ఎవరో కాదు గాయత్రీ పాపే.
తిలోత్తమ: ఈ బిడ్డనే గాయత్రీ అక్కనా.
వల్లభ: రేయ్ రేయ్ నిజమే చెప్తున్నావా
విక్రాంత్: అబద్ధం చెప్పి అమ్మవారికి బలి అవ్వను.
నయని గాయత్రీ పాపని చూసి మోకాల మీద కూర్చొని ఏడుస్తుంది. గాయత్రీ పాప నయనిని అమ్మా అని పిలుస్తుంది. అందరూ బిత్తర పోతారు. ఎమోషనల్ అవుతారు. నయని చాలా ఏడుస్తుంది. అమ్మా అని పిలిచావా పాప అని అమ్మకి ఇంకా దూరంగానే ఉంటావా గాయత్రీ అని అంటే పాప నయని దగ్గరకు వెళ్తుంది. ఒకర్ని ఒకరు హత్తుకుంటారు. నయని ఏడుస్తుంది. పాపని ముద్దాడుతుంది.
సుమన: గాయత్రీ పాప మా అక్క కన్న కూతురా. జోగయ్య శాస్త్రి గారి కూతురు శారద కూతురు అన్నారు కదా.
విక్రాంత్: జోగయ్య శాస్త్రి గారు ఆజన్మ బ్రహ్మచారి. పెళ్లి పిల్లలు అన్న ఆలోచన ఆయనకు లేదు. అమ్మవారి ఉపాసకులు అయిన ఆయనకు వదిన కన్న కూతురు గుడిలో దొరికింది.
విశాల్ నయని దగ్గరకు వెళ్లి కూర్చొని తల నిమురుతాడు. అహల్య అందరితో పాపని హాస్పిటల్‌లో ఎత్తుకెళ్లిన జీవాన్ని నందీశా అనే ఎద్దు అడ్డుకుందని చెప్తుంది. నాగయ్య పాము బిడ్డకు కాపలాగా ఉండి ఉదయం శాస్త్రి గారికి పాము అప్పగించిందని అంటారు. నయనికి పాప గురించి తెలిసినప్పుడు తనకు ప్రాణ గండం ఉంటుంది కాపాడుకోండి అని చెప్పారని అహల్య అంటుంది. ఇక తిలోత్తమ వల్లభకు సైగ చేస్తుంది. వల్లభ బాంబ్ రిమోట్ నొక్కితే అది పని చేయదు. బాంబ్ పేలదు. విక్రాంత్ వల్లభ దగ్గరకు వెళ్లి సారీ బ్రో బాంబ్ పేలదు అంటాడు. దాంతో తిలోత్తమ, వల్లభ షాక్ అయిపోతారు. ఇక నయని తన కూతురికి అమ్మగారి పేరే పెట్టుకున్నానని తెలియకుండానే చేయాల్సినవన్నీ చేశానని పొంగిపోతుంది. ఆపద కూడా అమ్మవారు తప్పించారని విక్రాంత్ అంటాడు. ఎలా అని అందరూ అడిగితే బొమ్మలో బాంబ్ ఉందని కొబ్బరి కాయ కొట్టగానే బాంబ్ తడిచిపోతుంది.
అందరూ ఇంటికి చేరుకుంటారు. రాత్రి హాల్‌లో పావనామూర్తి, హాసిని ఉంటారు. నయని, విశాల్ గాయత్రీ పాపని ఆడిపిస్తూ సంతోషంగా ఉంటారు. గుమ్మాడి గుమ్మాడి ఆడిందమ్మ అమ్మాడి అని పాట పాడుతూ ఇద్దరూ పాపతో సంతోషంగా గడుపుతారు. పావనా, హాసినిలు క్లాప్స్ కొడుతూ వస్తారు. పాప పడుకుంటుంది. తిలోత్తమ, వల్లభలు కనిపించడం లేదని హాసిని అంటే పాపే గాయత్రీ దేవి అని చెప్పడంతో అందరూ షాక్‌లో ఉన్నారని అనుకుంటారు. నయని పాపని తీసుకెళ్లిపోతే విశాల్, పావనా, హాసినిలు విక్రాంత్‌కి నిజం తెలిసినా తెలియనట్లు ఉన్నాడని అనుకుంటారు.
తిలోత్తమ ఆలోచనలో ఉంటే అక్కడికి వల్లభ వస్తాడు. వాళ్లిద్దరూ మాట్లాడుతుంటే విక్రాంత్ కూడా వెనకాలే వస్తాడు. వల్లభ తిలోత్తమతో రేపో మాపో నువ్వు గాయత్రీ పాప చేతలో చనిపోయి నరకానికి పోతావని అంటే తిలోత్తమ వల్లభని కొడుతుంది. విక్రాంత్ అమ్మ ఇప్పటికీ నీలో పశ్చాత్తాపం కనిపిండచడం లేదు. మారుతావేమో అన్న ఆశతో నేను ఇన్నాళ్లు నీకు పాపే పెద్దమ్మ అన్న విషయం చెప్పకుండా ఉన్నానని విక్రాంత్ అంటే తిలోత్తమ విక్రాంత్‌ని కూడా కొడుతుంది. నేను నీ కన్న తల్లినిరా నా చావు కోరుకుంటావా అని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)