అన్వేషించండి

'త్రినయని' సీరియల్: నయని ఫొటోకి దండ.. చనిపోయేది నయనీ ఏనా.. ఆ లాజిక్ మిస్.. అసలేం జరగబోతోంది?

Trinayani Today Episode నయని కళ్లు మూసుకొని భవిష్యత్ చూడటానికి ప్రయత్నించడం అందులో నయని చనిపోయినట్లు ఫొటోకి దండ కనిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode వరసగా హారతి ఆరిపోవడంతో ఏదో జరగబోతుందని నయని అంటుంది. ఏం జరగబోతుందో నయనీకి తెలుసని తిలోత్తమ అంటుంది. దాంతో తెలిస్తే చెప్పకుండా ఉంటానా అని నయని అడుగుతుంది. దాంతో తిలోత్తమ నువ్వు కావాలని దాస్తున్నావేమో అని అంటుంది. ఇంటిళ్లపాది ఎవరికి వారే నాకు ఆపద వస్తుందంటే నాకు వస్తుందేమో అని టెన్షన్ పడతారు. 

విశాల్: దయచేసి మీ అందరూ ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉంటారా. నయని నువ్వు చెప్పు ఏం జరుగుతుంది. ఎందుకు అందరూ నిన్ను తాలా ఓ మాట అనే వరకు ఆగిపోతున్నావ్.
నయని: నాకు తెలిస్తే చెప్పనా బాబుగారు. 
విశాల్: నయని నాకు తెలుసు కానీ నీకు ఏదో తెలిసే చెప్పడం లేదని అనుకుంటున్నారుగా.
విక్రాంత్: వదినా పోనీ ఒకసారి మా కోసం కళ్లు మూసుకొని చూడు ఏమైనా తెలుస్తుందేమో.
తిలోత్తమ: ఒక్క సారి చూడు నయని.
హాసిని: అనుకోగానే అయిపోడానికి ఇది మ్యాజిక్ కాదు.

నయని గాయత్రీ  దేవి ఫొటో వైపు చూస్తుంటుంది. అందరూ సైలెంట్ అయిపోతారు. నయని గాయత్రీ దేవి ఫొటో చూస్తూ దగ్గరకు వెళ్లి రాబోయే ఆపద నాకు ముందే తెలుస్తుంది కానీ ఈ సారి తెలీడం లేదు ఏంటది ఏమై ఉంటుంది నాకు తెలియాలి నేను తెలుసుకోవాలి అమ్మగారు అని కళ్లు మూసుకుంటున్నాను నాకు కనిపించేలా చేయండని కోరుకుంటుంది. దాతో నయని ఫొటోకి దండ వేసి దీపం పెట్టినట్లు కనిపిస్తుంది. నయని బిత్తర పోతుంది. షాక్‌తో కళ్లలో నీరు తిప్పుకొని వెనక్కి వాలిపోతుంది. అందరూ ఏమైందని అడిగి రిలాక్స్ అవ్వమని అంటారు.

తిలోత్తమ: ఎవరికి ఆపదో తనకు తెలిసినట్లుంది.
వల్లభ: అంత కంగారు పడుతుంది అంటే ఆపద మనకు కాదు అని అర్థమవుతుంది మమ్మీ.
హాసిని: మీరు కాస్త ఊరుకుంటే నేను చెల్లితో మాట్లాడుతా. చెల్లి ఇలా చూడు కంగారు పడకు. ఏమైంది.
నయని: ఏడుస్తూ ఏదో జరగబోతుంది. ప్రాణగండం పొంచి ఉంది బాబుగారు. మృత్యువు వెంటాడుతోంది. మరణం తపప్పదని అనిపిస్తుంది. 
విక్రాంత్: ఎవరికి వదినా.
నయని: నేను లేకపోతే నా బాబుగారిని నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు. ఆపద ఏ రూపంలో వస్తుందో తెలీదు కానీ ప్రాణం గండం ఉంది నాకే. 
వల్లభ: హమ్మాయ్య మనం బతికి పోయాం.
హాసిని: మీ ముఖం చెల్లి బతికి ఉంటేనే మనం బతికి ఉంటాం.
దురంధర: అవునే నాకు ఓ డౌట్ నయనికి కానీ తన బిడ్డలకు కానీ ఆపద వస్తే నయనికి తెలీదు కదా. 
విశాల్: నయని కరెక్టే కదా.
నయని: అవును బాబుగారు నాకు తెలీకూడదు కదా. 
హాసిని: మరి లాజిక్ మిస్ అవుతుంది కదా.
విశాల్: నయని నిన్ను ఒత్తిడి చేసినందుకు ఇలా అనిపించుంటుంది బీ కూల్ పద.

రాత్రి సుమన ఆస్తులు ఎన్ని ఉన్నాయని అంచనా కోసం రాసుకుంటుంది. విక్రాంత్ ఎందుకని అడిగితే మా అక్క పేరుతో ఎంత ఆస్తి ఉందో బావగారితో కలిసి ఎంత సంపాదించిందో అని అక్క చనిపోతే ఆస్తి దక్కించుకోవచ్చని అంటుంది. విక్రాంత్ సుమనను ఇష్టమొచ్చినట్లు తిడతాడు. పేపర్లను చింపేస్తాడు. మరోవైపు నయని విశాల్ ఒడిలో పడుకొని ఉంటే విశాల్ ధైర్యం చెప్తాడు. దాని గురించి ఆలోచించొద్దని అంటాడు. ప్రమాదం ఎలా వస్తుందో అని నయని అంటే నీకు కచ్చితంగా తెలుస్తుందని అంటాడు. ఇక నయని నేను ఉన్నా లేకపోయినా మన బిడ్డల కోసం మీరు ఉండాలని నయని విశాల్‌తో చెప్తుంది. నయని ప్లీజ్ ఇలా మాట్లాడకని విశాల్ చెప్తాడు. మనద్దరం కలిసే ఉంటామని అంటాడు. మరోవైపు తిలోత్తమ నయని జాతకం ఉన్న పేపర్‌ని  చూస్తుందని నయనికి ప్రాణ గండం ఉందని చెప్పిందని అందుకే చూస్తున్నా అని అంటుంది. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: వరసగా అదే అపశకునం.. నయనికి కనిపించని భవిష్యత్.. అసలేం జరుగుతోంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
Chandrababu: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SpaceX catches Starship booster with Chopsticks | Mechzilla తో రాకెట్ ను క్యాచ్ పట్టిన SpaceX | ABPNASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు
Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
Chandrababu: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం
Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
Tata Punch EV Offers: టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ కారు - రూ.2 లక్షలు కట్టి తీసుకెళ్లపోవచ్చు!
టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ కారు - రూ.2 లక్షలు కట్టి తీసుకెళ్లపోవచ్చు!
Best Budget Compact Cars: రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
Embed widget