Trinayani Serial Today January 21st: 'త్రినయని' సీరియల్: విశాలాక్షినే అమ్మవారని గ్రహించిన నయని.. లగేజ్ బ్యాగ్‌లో పాపని దాచేసిన తిల్లూ ఆంటీ!
Trinayani Today Episode యమధర్మ రాజు చెప్పిన విషయం విశాలాక్షి చెప్పింది అంటే విశాలాక్షి కచ్చితంగా అమ్మవారే అని నయని అనుమాన పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode తిలోత్తమ మీద వల్లభ సెటైర్లు వేస్తాడు. దాంతో తిలోత్తమ వల్లభని చితక్కొడుతుంది. ఇంతలో హాసిని వచ్చి చంపేయ్మని అంటుంది. వల్లభతో మీ అమ్మతో కలిసి కుట్రలు కుతంత్రాలు చేస్తే మీ పని అయిపోతుందని భర్తకి హాసిని వార్నింగ్ ఇస్తుంది. నయని గాయత్రీ పాప చేతులకు నూనె రాస్తుంటుంది. బామ్మ కూడా అక్కడే ఉంటుంది. ఇంతలో దురంధర కూడా వస్తుంది.
బామ్మ: పిల్ల కరెంట్ వైరుతో వస్తుంటే వాళ్లంతా గజగజ వణికిపోయారు.
నయని: గట్టిగా అనకు బామ్మ వాళ్లు వింటే మాకు ప్రాణ సంకటం అయితే మీకు నవ్వులాటలుగా ఉందా అని అంటారు.
దురంధర: అవును అవును రెండు రోజులు ఉండే మీరు ఎందుకు అనవసరంగా మాటలు పడటం.
బామ్మ: అవును అవును ప్రమాదం జరగలేదు కాబట్టి ఇప్పుడు నవ్వుతున్నాను కానీ ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఇంట్లో విషాదం అలముకునేది కదా.
నయని: జరగరానిది కాదు బామ్మ జరిగి తీరుతుంది.
బామ్మ: నిజంగానే మీ అత్తయ్య గోవిందేనా.
నయని: అవును.
బామ్మ: నిజమా
దురంధర: బామ్మ రాసి పెట్టాడో లేదో తెలీదు కానీ మా పెద్ద వదిన మాత్రం చిన్న వదినను చంపడానికే పునర్జనమ్మ ఎత్తింది.
బామ్మ: అయ్యో రామ అంత పగ ఎందుకంట.
నయని: ఆస్తి కోసం వ్యాపారాల కోసం గాయత్రమ్మ గారి ప్రాణాలు పొట్టన పెట్టుకున్న దుర్మార్గురాలు ఈ తిలోత్తమ అత్తయ్య.
బామ్మ: అయ్యో రామ అంత దుర్మార్గురాలా బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు. విశాలాక్షి చెప్పింది అవుతుంది.
నయని: మనసులో బాల వాక్కు కాదు బామ్మ విశాలాక్షి మాటల్లో అంతరార్థం గ్రహిస్తే తనే విశాలాక్షి అమ్మవారు ఏమో అనిపించింది. యమధర్మ రాజు నాతో చెప్పింది తను చెప్పింది అంటే అది కేవలం ఆ జగన్మాతకే సాధ్యం.
సుమన విక్రాంత్‌కి గాయత్రీ గురించి చెప్పి తిడుతుంది. చిన్న పిల్ల అంత ప్రమాదానికి పూనుకుంటే ఎవరూ ఏం అనరేం అని తిడుతుంది. పాపని ఎవరూ ఏం అన్నా ఊరుకోనని విక్రాంత్ అంటాడు. దానికి సుమన మా అక్కకి ఇద్దరు పాపల్లో ఒక పాప పోయేలా ఉందని అంటుంది. దాంతో విక్రాంత్ అరుస్తాడు పాప పోవడం ఏంటి అని కొట్టడానికి మీదకు వెళ్లి అరుస్తాడు. పాప చేతిలో తిలోత్తమ ప్రాణాలు పోయడం ఖాయమని అంటాడు. మరోవైపు తిలోత్తమ దగ్గరకు వల్లభ గాయత్రీ పాపని తీసుకొని వస్తాడు. తిలోత్తమ పాపని లగేజ్ బ్యాగ్‌లో పెట్టి మీద బట్టలు వేస్తుంది. తర్వాత బ్యాగ్ జిప్ వేసేస్తారు. పాప ఏడుపు ఎవరికీ వినపించకుండా పాటల సౌండ్ పెట్టమని బ్యాగ్ తీసుకెళ్లి కారులో పెట్టమని అంటుంది. అందరూ హాల్‌లో ఉంటారు. వల్లభ పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంటే తిలోత్తమ బ్యాగ్ తీసుకొస్తుంది. పాప మూర్ఛపోయి ఉంటుందని అనుకొని పాటలు ఆపమని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు.
బయటకు వెళ్తున్నాం అని చెప్తారు. పాప వల్ల ఇంట్లో ఉంటే ప్రమాదం జరుగుతుందని అనుకొని బయటకు వెళ్లాలని అనుకుంటున్నారని అందరూ అనుకుంటారు. అందరూ బ్యాగ్‌లో ఏముందని అడుగుతారు. హాసిని మాత్రం బ్యాగ్ లాగేసి కింద పడేసి నేను చూడాలి అని బ్యాగ్ మీద పడి రచ్చ రచ్చ చేస్తుంది. దాంతో వల్లభ లేవవే చచ్చిపోతుంది అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. వల్లభ కవర్ చేస్తాడు. బామ్మ మాత్రం బ్యాగ్‌లో ఏదో ప్రాణం ఉందని అంటుంది. అందరూ ఓపెన్ చేసి చూద్దామని అంటారు. తిలోత్తమ వద్దని అంటుంది. నయని బ్యాగ్ జిప్ తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

