అన్వేషించండి

Trinayani Serial Today February 19th: 'త్రినయని' సీరియల్: పిచ్చిదానిలా హాస్పిటల్ నుంచి వచ్చిన సుమన.. గాయత్రీని గడపదాటించాలనుకున్న సుమనను పాము కాటేస్తుందా!

Trinayani Serial Today Episode ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సుమన ఇంటికి వచ్చి నయని మీద నిందవేసి రచ్చ రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episodes: విశాల్ ఇంటికి వస్తే సుమనకు ఎలా ఉంది అని నయని అడుగుతుంది. సుమన తన మొండితనంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది అని తనకు ఏమైనా అయితే నన్నే అంటారు అని నయని ఏడుస్తుంది. ఆ ఊరు ఈ ఊరు అనక ఆపదలో ఉన్న అందర్ని కాపాడి సొంత చెల్లిని పొట్టన పెట్టుకున్నావు అంటారు అని బాధపడుతుంది. 

విశాల్: కనీసం క్లూ కూడా ఇవ్వలేదు నువ్వు. ఇచ్చుంటే సుమనను అడ్డుకునే వాళ్లం.
నయని: నాకు తెలిస్తే నేను ఎలా ఉంటాను బాబుగారు. 
విక్రాంత్: వదినా..
నయని: సుమనకు ఎలా ఉంది విక్రాంత్ బాబు.
విక్రాంత్: సారీ వదినా అంతా నా దురదృష్టం.. ప్రాణం పోతే పీడా పోతుంది అనుకున్నాను. కానీ బతికిపోయింది అంట.
విశాల్: రేయ్ పిచ్చానీకు.. తన ప్రాణం పోతే హ్యాపీ అంటావ్ ఏంట్రా.
విక్రాంత్: దెయ్యం పట్టేలా బిహేవ్ చేసే తను బతికే ఉంటే ఎవరు బాగున్నా ఓర్చుకోలేదు కదా బ్రో.
విశాల్: భార్య భర్తలు అంటే సవాలక్ష ఉంటాయి. అంత మాత్రాన అంత అసహ్యించుకుంటావ్ ఏంట్రా.
విక్రాంత్: మరి నువ్వు వదినా గొడవ పడరేంటి బ్రో. నాకు తెలీక అడుగుతున్నాను.
నయని: విక్రాంత్ బాబు భార్యభర్తల్లో ఎవరికి సహనం లేకపోయినా సమస్యలు వస్తాయి. నా అదృష్టం కొద్ది బాబు గారు నన్ను అర్థం చేసుకున్నారు. సుమన మారే వరకు ఇబ్బందులు తప్పవు.
విశాల్: సుమన ప్రాణం నిలబడింది నీ ప్రాణం నిలబెట్టుకోవాలి నయని..
విక్రాంత్: బ్రో అదేంటి అలా అన్నావ్..
విశాల్: ఆవేశంతో ముందూ వెనక ఆలోచించకుండా విషం పాలు తాగిన సుమన తనకు మళ్లీ పునర్జన్మ దక్కింది అన్న ఆనందంలో హాస్పిటల్ పాలవడానికి కారణం నయని అనుకుంటుంది కదా. 
విక్రాంత్: అవును వదినా అసలే పిచ్చిది ఏం చేస్తుందో ఏంటో..
నయని: ఇంటికి వచ్చాక సుమనకు అర్థమయ్యేలా చెప్తాను.
విశాల్: నయని అనుకున్నంత ఈజీగా సుమన అర్థం చేసుకోదురా..
విక్రాంత్: అవును అన్నయ్య ఇప్పుడేం చేద్దాం. మరోవైపు తిలోత్తమ, వల్లభ అఖండ స్వామి దగ్గరకు వస్తారు. 

తిలోత్తమ: నడిపి కోడలు నయనికి సొంత చెల్లెలు సుమనకు ప్రాణ గండం వచ్చినా ముందుగా చెప్పలేకపోయింది అంటే ముందు చూపు పోయింది అన్నట్లే కదా..
అఖండ: అలా జరగదే..
తిలోత్తమ: జరిగినందుకే ఇక నయని ఏ గండం గ్రహించలేదు అన్న అనందంలో ఇక్కడికి తీసుకొచ్చాడు వీడు.
అఖండ: అది అసంభవం..
వల్లభ: అయ్యో స్వామి సుమన విషం కలిపిన పాలు తాగేసి హాస్పిటల్ పాలైంది.
అఖండ: బతికే ఉంది కదా..
తిలోత్తమ: చెల్లి బతికింది కానీ అక్క సగం చనిపోయినట్లే.. తన చావు కోరుకున్నావని సుమన నయని మీద పగ పడుతుంది. నా శత్రువుకి చిన్నకోడలు సుమనే చుక్క పెడుతుంది. 
అఖండ: నయని గ్రహించలేదు అంటే తను నిజం చెప్పకుండా దాచిపెట్టింది అనే కదా అర్థం.
వల్లభ: ఇది కూడా లాజిక్‌ ఏ అమ్మ. అనవసరంగా నేనే సంతోషపడ్డా.
తిలోత్తమ: స్వామి రక్త సంబంధాన్నిఅంత త్వరగా ఎవరూ వదులుకోరు. 
అఖండ: విశాలాక్షి ఇంట్లో ఉందా..
తిలోత్తమ: ఇప్పుడుందో లేదో తెలీదు కానీ అప్పుడు మాత్రం ఉంది.
అఖండ: అయితే తనే కారణం అయి ఉంటుంది. 
వల్లభ: చిన్న మరదలు కూడా ఇదే చెప్పింది స్వామి. ఆ విశాలాక్షినే విషం కలిపింది అని వాదించింది ఎవరూ నమ్మకపోవడంతో తానే తాగిసింది.
అఖండ: నేను అంటున్నది అది కాదు వల్లభ. నయనికి ముందే తెలియకపోవడానికి విశాలాక్షినే కారణం. శివభక్తురాలు తన మాయతో కట్టడి చేసి ఉండొచ్చు.
తిలోత్తమ: విశాలాక్షిని ప్రశ్నిస్తే విషం కలిపాను అని చెప్పలేదు. లేదు అని కూడా చెప్పలేదు. 
వల్లభ: విశాలాక్షి మాయవల్ల అక్కకి గండం తెలియకపోవడం వల్ల అక్కాచెల్లెల్లకు వైరమే కదా..
అఖండ: అదే జరుగుతుంది. అలా జరగాలి అనే ఇలా జరిగింది. 
తిలోత్తమ: మంచిది పరోక్షంగా ఆ విశాలాక్షి నాకు ఇలా సాయం చేసింది అనుకుంటాను.

ఇక హాస్పిటల్‌ నుంచి సుమన డ్రస్ కూడా మార్చకుంటా పేషెంట్ డ్రస్‌లోనే అలాగే ఇంటికి వచ్చేస్తుంది. అందరూ చూసి షాక్ అవుతారు. మా పరువు పోయింది అని హాసిని, ధురందర అంటుంది. సెక్యూటరీ వాళ్లు తమని పట్టుకున్నారని గేట్ పాస్ చూపిస్తే కానీ వదల్లేదు అని పావనామూర్తి అంటాడు. 

నయని: సుమన చీర కట్టుకొని రాకుండా ఎవరైనా ఇలా వస్తారా..
సుమన: నేను ఇంకా బతికే ఉన్నాను అని నీకు తెలియాలి అనే ఇలా వచ్చాను. నువ్వు నన్ను చంపాలి అని చూసినా బతికే వచ్చాను కదా..
నయని: నేనా పాలలో విషం కలిపింది. 
సుమన: నువ్వు కలపకపోవచ్చు నీకూతురు కలిపింది కదా..  కూతురు అంటే కన్నది దత్తత తీసుకున్నదే కాదు.. అమ్మ అని పిలవగానే హక్కున చేర్చుకున్నారు కదా ఆ శివభక్తురాలు..
తిలోత్తమ: గారడి పిల్ల విశాలాక్షిని వీళ్ల కూతురుగానే చూస్తారు. కదా...
విశాల్: విశాలాక్షి అలా చేయదు ఇది వేరు ఎవరి పనో.
సుమన: నేనే విషం కలుపుకొని నేనే ప్రాణాలు తీసుకుంటానా బావగారు. ముక్కూముఖం తెలియని వారికి ఏం జరిగా ముందుగా తెలుసుకొని పరుగులు తీసే ఈవిడ నేనే విషం కలిపిన పాలు తాగినా కూడా ఆపలేదు అంటే ఏంటి అర్థం నేను చావాలి అనే కదా. 
తిలోత్తమ: పాపం పాలలో విషం ఉంది అని నయని గ్రహించలేదు ఏమో..
సుమన: పాపమా ఈ మహాతల్లికి ఆపద వస్తే గ్రహించలేదు కానీ. మిగతా ఎవరికి వచ్చినా టక్కున పసిగడుతుంది కదా అత్తయ్య. 
నయని: విశాలాక్షి అమ్మవారి మీద ప్రామాణం వేసి చెప్పమన్నా చెప్పాను సుమన నిజంగా నాకు తెలియ రాలేదు.
సుమన: రాదు ఎందుకు ఇదంతా నీ ప్లాన్.. అందర్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చి ఎలా కావాలి అంటే అలా ఆడిస్తుంది. 
విశాల్: సుమన హాస్పిటల్ నుంచి వచ్చావు కాబట్టి ఓపికగా చెప్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని మా అందర్ని డిస్ట్రబ్ చేయకు. 
సుమన: నేను చచ్చినా పర్లేదు కానీ మీ అందరూ బాగుండాలి అంతే కదా బావగారు. 
విశాల్: నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది. 
సుమన: నేనే మీకు చెప్పిస్తాను. ఎక్కడుంది ఆ విశాలాక్షి..
విక్రాంత్: లేదు. 
సుమన: మాయమైందా.. పారిపోయిందా..
నయని: పంపించేశాను. 
వల్లభ: విషం కలిపిన పిల్లకి వెళ్లిపోమని నువ్వే చెప్పావా.. అంటే.. 
తిలోత్తమ: అంటే ఏముందిరా దోషి దొరకకూడదు అని సాక్ష్యాధారాలు దొరకకూడదు అని..
విశాల్: అమ్మా.. 
తిలోత్తమ: జనం ఇలాగే అర్థం చేసుకుంటారు నాన్న.
సుమన: జనం వరకు ఎందుకు మనకే క్లారిటీగా అర్థమవుతుంది.
హాసిని: చెల్లి విశాలాక్షిని ఎందుకు వెళ్లిపోమన్నావ్. తను ఉంటే నిజం తెలిసేది కదా.. పోనీ డమ్మక్క, ఎద్దులయ్యలనైనా పిలువు. 
నయని: గుడిలో చండీయాగం ఉంది అని వెళ్లారు అక్క.
సుమన: ఒక్క విషయం అక్క. నేను పోతే నా కూతురు ఉలూచిని అనాథ అని దత్తత తీసుకున్నావే గాయత్రీ దీని లా కూడా చూడకు.
విశాల్: ఏయ్ సుమన అర్థం లేకుండా మాట్లాడకు.
విక్రాంత్: అసలు ఇది ఆడదే అయితే ఇలాంటి వేషంలో గుమ్మం తొక్కదు.  
సుమన: నేను చీరే కట్టలేదు. మీ విశాల్ బ్రో వాళ్ల అమ్మ గాయత్రీ దేవిగారు చనిపోయినప్పుడు చీర తీసి ఇంకో చీర కట్టి సుమంగళిగా దహన సంస్కారాలు చేశారు మర్చిపోయారా..
విశాల్: ప్లీజ్ స్టాప్ సుమన జస్ట్ షటెఅప్. 
నయని: బాబుగారు దయచేసి మీరు ఆవేశపడకండి..

సుమన విశాల్‌తో ఇదిగో ఇక్కడున్న ఈ గాయత్రీ రోడ్డున పడితే మీకు ఎలా ఉంటుంది అని గాయత్రీ పాపను ఎత్తుకొని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఎవరూ ఆపినా ఆగదు. అప్పుడు నాగయ్య పాము ఎదురుగా నిల్చొని బుసలు కొడతాడు. దీంతో సుమన షాక్ అయిపోతుంది. 

విక్రాంత్: వెయ్‌వే గాయత్రీ పాపని తీసుకొని ఈ గుమ్మం బయట ఒక్క అడువు వేయవే.. విషం పాలు తాగినా చావని నువ్వు విషపూరితమైనా పాము కాటుకి చచ్చిపోతావ్.. చచ్చిపోవాలి కూడా.. దీంతో సుమన గాయత్రీ పాపని ధురందరకి ఇచ్చేసి గదిలోకి ఉలూచిని తీసుకొని వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: శర్వానంద్: రామ్ చరణ్, రానా పెద్ద రౌడీలు - శర్వానంద్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Anaganaga Oka Raju OTT : ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ యోజన 22వ విడత ఫిబ్రవరిలో! జాబితాలో మీ పేరు ఉందో లేదే ఇలా చెక్ చేయండి!
పీఎం కిసాన్ యోజన 22వ విడత ఫిబ్రవరిలో! జాబితాలో మీ పేరు ఉందో లేదే ఇలా చెక్ చేయండి!

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Anaganaga Oka Raju OTT : ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ యోజన 22వ విడత ఫిబ్రవరిలో! జాబితాలో మీ పేరు ఉందో లేదే ఇలా చెక్ చేయండి!
పీఎం కిసాన్ యోజన 22వ విడత ఫిబ్రవరిలో! జాబితాలో మీ పేరు ఉందో లేదే ఇలా చెక్ చేయండి!
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
Anaganaga Oka Raju Twitter Review - 'అనగనగా ఒక రాజు' ట్విట్టర్ రివ్యూ: నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడా? లేదా? అమెరికా ప్రీమియర్స్‌, సోషల్ మీడియా టాకేంటి?
'అనగనగా ఒక రాజు' ట్విట్టర్ రివ్యూ: నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడా? లేదా? అమెరికా ప్రీమియర్స్‌, సోషల్ మీడియా టాకేంటి?
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Embed widget