(Source: Poll of Polls)
Trinayani Serial Today December 10th: 'త్రినయని' సీరియల్: బయోమెట్రిక్‌తో దొరికిపోయిన నయని.. ఇంట్లో ఉన్నది ఆత్మ అని కంగారు పెట్టేసిన విక్రాంత్!
Trinayani Today Episode నయని చనిపోయిందని ఇంట్లో ఉన్నది ఆత్మ అని విక్రాంత్ సుమనకు చెప్పడం సుమన నమ్మేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode తిలోత్తమ ప్లాన్ ఫెయిల్ అయినందుకు వల్లభని చితక్కొడుతుంది. ఈ రోజు త్రినేత్రి పని అయిపోతుందని అనుకుంటే వీడు పేపర్లు మార్చేసి ప్లాన్ అంతా పోగొట్టేశాడని అఖండ స్వామితో చెప్పి వల్లభని తిడుతుంది. వల్లభ బిక్కు ముఖం వేసుకుంటాడు. వల్లభ కన్ప్యూజ్ అయింటాడని అఖండ స్వామి అంటాడు. ఇక వల్లభ అయితే గాయత్రీ దేవి ఎప్పుడు ముద్రలు వేసిందని అంటాడు వల్లభ దాంతో అఖండ స్వామి చిన్న పిల్ల పేపర్ పట్టుకున్నప్పుడు ఇలా అయింటుందని అంటాడు. ఈ సారి పూర్తి సాక్ష్యాలతో వస్తానని చెప్పి అఖండ స్వామి వెళ్లిపోతాడు.
ఇక నయని పాపని ఎత్తుకొని ఉంటే హాసిని వచ్చి చెల్లి నువ్వు త్రినేత్రిగా ఉన్నప్పుడు కనీసం నువ్వు కన్న పిల్లలకు కూడా దగ్గరగా ఉండవని చెప్తుంది. ఎందుకు అలా చేస్తున్నా అక్కా అని నయని అంటుంది. ఇక వల్లభ వాళ్లు వచ్చి తను త్రినేత్రినే అని నయనిలా నటిస్తుందని అంటాడు. అందరూ త్రినేత్రిని నమ్మేస్తున్నారని అంటాడు. ఇక తాను వెంట తీసుకొచ్చిన బయోమెట్రిక్ చూపించి దాని ద్వారా తను నయనినా కాదా తేల్చేస్తామని వల్లభ అంటాడు. గాయత్రీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్‌లో నయని వేలిముద్ర వేయాల్సి ఉంటుందని అందులో భాగంగా ఇప్పుడు వేయమని అంటారు. దాంతో నయని మనసులో నా ఆత్మ ఇప్పుడు త్రినేత్రి శరీరంలో ఉంది. ఇప్పుడు నేను వేలిముద్రలు వేస్తే కచ్చితంగా తప్పు అని తెలిసిపోతుంది.
దాంతో వీళ్ల అనుమానం నిజం అవుతుంది దాంతో నేను వీళ్లని నమ్మించలేకపోతాను ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటుంది. వల్లభ బయోమెట్రిక్‌ని ల్యాప్ ట్యాప్‌కి కనెక్ట్ చేస్తాడు. ఆటో ముబైల్స్ కంపెనీకి యాక్సెస్ ఇవ్వమని తిలోత్తమ చెప్తుంది. దాంతో విశాల్ కూడా నయని నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు యాక్సెస్ ఇవ్వుని అంటాడు. నయని కంగారు పడుతుంది. విశాల్‌తో పాటు అందరూ చెప్పడంతో వెళ్లి బొటనువేలి బయోమెట్రిక్ వేస్తుంది. అయితే అది ఫెయిల్ అని చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దాంతో అఖండ స్వామి తను నయని కాదు కాబట్టి అవ్వడం లేదని అంటాడు. ఇక నయని చూపుడు వేలు పెట్టినా అవ్వదు. దాంతో సుమన మిషెన్ ప్రాబ్లమ్ అంటే యాక్సెస్ ఉన్న విశాల్ బయోమెట్రిక్ వేస్తే ఓపెన్ అవుతుంది. అందరూ షాక్ అయిపోతారు. నయనిది ఎందుకు అవ్వలేదా అని ఆలోచిస్తారు.
హాసిని వేసినా అవుతుంది దాంతో విశాల్ మరోసారి నయనిని ప్రయత్నించమని అంటాడు. మళ్లీ ఫెయిల్ అనే వస్తుంది. అందరూ తను నయని కాదని త్రినేత్రి అంటే విశాల్ మాత్రం నేను తను నయని అని నమ్ముతున్నాను అని అంటాడు. ఇక నయని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను త్రినేత్రి అని నయని ఎక్కడుందో తెలుసుకోమని చెప్పి అఖండ స్వామి వెళ్లి పోతాడు. ఇక విక్రాంత్ ఆలోచనలో పడతాడు. తను నయని వదిన కాదని చెప్తే హాస్పిటల్‌లో ఉన్న నయని ఎక్కడని తన కాలర్ పట్టుకొని ఇంట్లో వాళ్లు అడుగుతారని విక్రాంత్ ఏం చేయాలో తెలీక ఆలోచిస్తూ ఉంటాడు.
సుమన వచ్చి ఫింగర్ ఫ్రింట్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదో చెప్పమని విక్రాంత్‌ని విసిగిస్తుంది. దాంతో విక్రాంత్ నయని చనిపోయిందని ఆత్మగా ఇంటికి వచ్చిందని తన కాలు కూడా వెనక్కి తిరిగి ఉంటాయని సుమనకు చెప్తాడు. సుమన అవునా అని షాక్ అయిపోతుంది. మన మీద అభిమానంతో ఆత్మ మనకి కనిపిస్తుందని చెప్తాడు. సుమన నమ్మేస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అంటాడు. సుమన సరే అంటుంది.ఇక విశాల్ రావడంతో నయని విశాల్ చేయి పట్టుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















