Trinayani Serial Today August 13th: 'త్రినయని' సీరియల్: విశాల్ మూడు ప్రశ్నలను తిలోత్తమ వినేస్తుందా.. పునర్జన్మ రహస్యం తెలిసిపోతుందా!
Trinayani Today Episode తిలోత్తమ గాయత్రీ దేవి ఆత్మ మాట్లాడిన మాటల తరంగాలను రికార్డ్ చేయడం గాయత్రీ దేవి దాన్నితిలోత్తమ చేతితోనే నాశనం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode గాయత్రీదేవి మాటలు విశాల్‌కు వినిపిస్తాయి. అమ్మ అంటూ విశాల్ ఏడుస్తాడు. నేను నీ ముందే ఉన్నాను.. నీ కోసమే ఉన్నాను.. నీతో ఉంటాను నాన్న అని గాయత్రీదేవి ఏడుస్తుంది. విశాల్ తల్లికి థ్యాంక్యూ అని చెప్తాడు. ఇక తిలోత్తమ గాయత్రీదేవి ఏం చెప్తుందా అని ఆలోచిస్తుంది.
సుమన: బావ గారు ఇంకో ప్రశ్న అడగండి. ఎలా ఉన్నారని అడిగారు అందరమ్మల్లానే బ్రహ్మాండంగా ఉన్నానని బదులు ఇచ్చుంటారు కదా. ఈ సారి కాస్త ఘనమైన ప్రశ్నలు అడగండి.
హాసిని: తల్లీకొడుకులు మధ్యలో నువ్వెందుకులే చిట్టీ.
తిలోత్తమ: ఆనందంలో అసలైన ప్రశ్న అడగకపోవచ్చు. తర్వాత అరే అడగలేకపోయానని బాధ పడొద్దు కదా.
డమ్మక్క: ఏం ప్రశ్న అడగాలి అనుకుంటున్నారో మీరు అయినా చెప్పండమ్మా.
తిలోత్తమ: చెప్పొచ్చా.
నయని: మంచి మాట ఎవరైనా చెప్పొచ్చు అత్తయ్య.
తిలోత్తమ: గాయత్రీ దేవి అక్క పునర్జన్మ ఎత్తింది కదా మళ్లీ ఆత్మగా ఎందుకు కనిపిస్తుందో కారణం తెలుసుకోవచ్చు కదా.
హాసిని: ఫిటింగ్ పెట్టేశారా అనుకున్నా.
నయని: తప్పు లేదు.
తిలోత్తమ: నయని అన్నాక అడగకతప్పు లేదు కదా
విశాల్: అమ్మ ఎందుకమ్మా నువ్వు పునర్జన్మలో పుట్టినా ఆత్మలా కనిపిస్తున్నాను.
గాయత్రీదేవి: నాన్న విశాల్ నీ బిడ్డగా నేను నీ దగ్గరే ఉన్నా నయనికి తెలీకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నావో నాకు తెలుసు. గాయత్రీ పాప దేహం నాకు ఈ జన్మకి ఆశ్రయం ఇచ్చింది. తను స్ఫృహలో లేనప్పుడు నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఆత్మగా రాగలగుతున్నాను. నయని ఆవేశానికి తిలోత్తమకు ఆలోచనలకు విరామం కలిగించడానికే ఈ ప్రయత్నం.
విశాల్: అర్థమైందమ్మా.
డమ్మక్క: సమయం అయిపోతుంది. మూడో ప్రశ్న అడగండి. తామర పువ్వు మహిమ తగ్గిపోతుంది. ఇంకా మూడు నిమిషాలు మాత్రమే సమయం ఉంది.
తిలోత్తమ: గాయత్రీ అక్క పునర్జన్మ ఎత్తి ఇప్పుడు పసిబిడ్డగా ఎక్కడుందో అడుగు విశాల్.
నయని: అవును బాబు గారు నా కోసం ఈ ప్రశ్న అడగండి.
విక్రాంత్: అవును బ్రో వదిన ఎంత ఎదురు చూస్తున్నారో మనకు తెలుసు పెద్దమ్మని అడిగితే తెలిసిపోతుంది కదా.
నయని: బాబు గారు నా ప్రశ్నగా అడగండి. ఆ సమాధానం కోసమే కదా మనం ఎదురు చూస్తున్నాం. నేను అడగాలి అనుకున్న ప్రతీ సారి ఆ అవకాశం దొరకడం లేదు.
విశాల్: అమ్మ వింటున్నావ్ కదా అందరూ ఆత్రుతగా అడుగుతున్నారు. పునర్జన్మలో నువ్వు పసి బిడ్డగా ఎక్కడ ఉన్నావ్ అమ్మా.
తిలోత్తమ: నీ కూతురిగా నీ దగ్గరే నీ ప్రేమను పొందుతున్నాను నాన్న. గాయత్రీ పాపగా ఉన్న నేను నాన్న అని నిన్ను పిలిచే రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు ప్రతీ రోజు నువ్వు నా మాటలు వినొచ్చు,. అందరూ నేను ఏం చెప్తానా అని అడుగు తారు నువ్వేం చెప్తావో ఆలోచించుకో. అని ఆత్మ వెళ్లిపోతుంది.
నయని: బాబు గారు అమ్మగారు వెళ్లిపోతున్నారు.
వల్లభ విశాల్ దగ్గర కుండ తీసుకుంటాడు. విశాల్ బాధగా గదిలోకి వెళ్లిపోతాడు. సుమన విక్రాంత్ దగ్గరకు వెళ్లి విశాల్ బావగారి దగ్గరకు వెళ్లి మీ పెద్దమ్మ అడ్రస్ అడగమని అడుగుతుంది. కష్టపడినట్లు వాళ్లకి కనిపించి ఆర్థిక సాయం చేయమని అడుగుదామని అంటుంది. ఎంత ఆశే నీకు అని విక్రాంత్ సుమనకు చీవాట్లు పెడతాడు.
గాయత్రీ దేవి ఆత్మ ఇంట్లోకి వస్తుంది. తిలోత్తమ, వల్లభలు కుండలో పెట్టిన రికార్డర్‌ని ఢీ కోడ్ చేయడానికి రెడీ అవుతారు. గాయత్రీదేవి దగ్గరకు డమ్మక్క వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అని అంటుంది. మీ అత్మ గాయత్రీ పాపలో ఉందని వీళ్లకి తెలీకూడదని విధ్వంసం చేయమని అంటుంది. వల్లభ గాయత్రీదేవి వాయిస్ ఢీ కోడ్ చేసి వినిపిస్తాడు. ఆ మాటలకు దురంధర, పావనా అక్కడికి వెళ్తారు. ఆత్మ మాటలు మీకు ఎలా వినిపిస్తున్నాయని పావనా అడుగుతాడు. ఇక గాయత్రీదేవి ఆత్మ రావడం తిలోత్తమ చూసి షాక్ అయి నిల్చొనిపోతుంది. గాయత్రీదేవి తిలోత్తమ కుడి చేయి పట్టుకొని జీవం లేని ఈ చేత్తో నా పునర్జన్మ రహస్యం ధ్వంసం చేయ్ అని తన చేతితో కుండని పడగొడుతుంది. కుండ పగిలిపోయి మొత్తం పోతుంది. అందరూ కంగారుగా అక్కడికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కనకమహాలక్ష్మీ సీరియల్: అవినాష్‌తో కనకం పెళ్లి చేయనని తేల్చేసిన సౌధామణి.. ఆది కేశవ్‌కి ఘోర అవమానం!