Trinayani October 6th: ప్రమాదం నుంచి బయటపడ్డ విశాల్ - తిరిగి ఇంటికొ వచ్చిన విశాలాక్షి!!
విశాల్ ప్రమాదం నుంచి బయటపడడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Trinayani October 6th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో
ఆ పాము కాటేస్తే బతకడం కష్టమని రత్తయ్య అందరితో అంటాడు.
నయని: విక్రాంత్ బాబు, మనం బాబు గారిని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్దాము. నేను నా బాబు గారిని కాపాడుకుంటాను అని అనగా అందరూ అమ్మవారి దగ్గరికి విశాల్ ని తీసుకుని వెళ్తారు.
అప్పుడు నయని అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటుంది. కానీ అమ్మవారి దగ్గర ఉన్న దీపాలు అన్ని ఆగిపోతాయి.
తిలోత్తమ: విశాల్ ప్రాణాలు విడిచినట్టు అమ్మవారి సైగ చేస్తున్నట్టుంది.
విక్రాంత్: వదిన హాస్పిటల్ కి తీసుకెళ్తాము ప్రాణాలు కాపాడుకోవచ్చు.
సుమన: అవును హాస్పిటల్ కి తీసుకెళ్తే మా అక్క మొగుడు చచ్చాడని డాక్టర్లు అయినా తేలుస్తారు.
వల్లభ: ఒకల్ని కాపాడబోయి ఇంకొకళ్ళు ప్రాణాలు విడిచారు పాపం.
Also Read: ఉలూచిని కనిపెట్టిన నయని - విశాల్ ని కాటేసిన నల్ల నాగు!
నయని: చూసావా అమ్మ నా భర్త చనిపోయాడు అని ఇన్ని మంది నా కళ్ళముందు ఇన్ని మాటలు అంటున్నారు. ఒక్క క్షణం ఒకే ఒక క్షణం నా భర్తని బతికించమ్మా వెంటనే నా ప్రాణాలను నీకు అర్పించేస్తాను. తర్వాత నా పిల్లల్ని కూడా నీలో ఏకం చేసుకో.
నువ్వే కాని అమ్మవారిగా కాకుండా కాళికాదేవిలా ఉంటే నీ ఆకలికి మమ్మల్ని బలి తీసుకొ అని చెప్పి అక్కడ ఉన్న త్రిశూలాన్ని తీసి తను పొడుచుకోవాలనుకుంటుంది. ఇంతలో గాయత్రీ వచ్చి తన కాళ్లు పట్టుకుంటుంది అప్పుడు ఆగిపోతుంది నయని.
అదే సమయంలో విశాల్ కూడా స్పృహలోకి వస్తాడు. విశాల్ స్పృహలోకి రావడం చూసి తిలోత్తమ, వల్లభలు ఆశ్చర్యపోతారు.
విశాల్: గాయత్రికి ఏం కాలేదు కదా?
నయని: లేదు బాబు గారు తనని కాపాడబోయి మీరే ప్రాణాలు మీదికి తెచ్చుకున్నారు. అమ్మవారి దయవల్ల మళ్లీ మీరు మాకు దక్కారు అని అంటుంది.
ఆ తర్వాత సీన్లో విశాల్ గాయత్రీ ని ఎత్తుకోగా నయని అక్కడికి వస్తుంది.
నయని: బాబు గారు అమ్మవారి దయవల్ల మీరు క్షేమంగా ఉన్నారు. అదే అమ్మవారి బొట్టు పెట్టుకోండి మనశ్శాంతిని ఇస్తుంది పాజిటివ్ వైప్స్ వస్తాయి అని చెప్పి విభూది పెడుతుంది నయని.
నయని: అవును బాబు గారు గానవికి ఏవైనా ప్రమాదం వస్తే నాకు తెలీదు ఎందుకంటే తను మన సొంత బిడ్డ కనుక. మరి గాయత్రి కి ప్రమాదం వచ్చినా నాకు తెలియలేదు ఎందుకు?
విశాల్: ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడే కవర్ చేయలేదు నేను ఇబ్బంది పడతాను అని మనసులో అనుకుంటాడు విశాల్. నీకు నేను ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఈ రోజు తెలియలేదు కదా కొన్ని కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతూ ఉంటుంది కర్మానుసారం ఏం జరుగుతుందో మనం మాత్రం ఏం చెప్పగలం అని అంటాడు.
Also Read: పెళ్లి పీటల మీద ఆర్య - ఆపడానికి వచ్చిన సుబ్బు, పద్దులు!
ఆ తర్వాత సీన్లో తిలోత్తమ, వల్లభలు సోఫా మీద కూర్చుంటారు.
వల్లభ: మమ్మీ మొగుడు పోయిన తర్వాత ఆడవాళ్ళకి తెలివి పెరుగుతుందంట నిజమేనా?
తిలోత్తమా: అలాగని కాదు కానీ ఎవరి శక్తి ఆనుసారం వాళ్ళ తెలివితేటలు వాళ్ళవి.
వల్లభ: మరేంటి మమ్మీ నువ్వు పసుపు గౌరమ్మని నీళ్లలో వేసిన, ఆ నల్ల పాము చేత కాటేయడానికి ప్రయత్నించినా సరే ఏవి నయని ని సింగిల్ స్టేటస్ కి తీసుకుని రాకపోయాయి!
తిలోత్తమ: ఒరే ఒరే ఆగరా మన ఏమైనా గదిలో ఉన్నామా మాట్లాడడానికి హాల్లో ఉన్నాము అని అనగా మిగిలిన కుటుంబ సభ్యులందరూ అక్కడికి వస్తారు. హాసిని నీళ్లను ఇల్లంతా జల్లుతుంది.
నీళ్లను ఎందుకు జల్లుతున్నావు అని అందరూ హాసినిని అడుగుతారు.
హాసిని: అమ్మ మన ఇంటికి వస్తుంది కదా.
వల్లభ: ఏ అమ్మ?
హాసిని: ఏ అమ్మ అయినా మన అమ్మే అని అనగా ఇంతలో డమ్మక్క అక్కడికి వస్తుంది.
డమ్మక్క: అమ్మ ఏ పిలుపుతో పిలిచిన పలుకుతుంది
Also Read: వేడుకగా వినాయక చవితి సంబరాలు- ముకుంద మనసులో కోరిక భవానీకి తెలిసిపోతుందా!
నయని: విశాలాక్షి వచ్చిందా? అని అనగా విశాలాక్షి చీరలో తయారయ్యి ఇంట్లోకి వస్తుంది.
తిలోత్తమా: చిర అంతా బానే ఉంది కానీ మెడలో నల్లపూసలు ఉన్నాయి ఏంటి కొంపతీసి పెళ్లయిందా?
విశాల్: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అమ్మ.. అలా ఏమీ అయ్యి ఉండదు.
విశాలాక్షి: త్వరలో నవరాత్రులు వస్తున్నాయి కదా దానికి సూచనగా ఇవి వేశాను అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

