Trinayani June 20th: వల్లభకు కుట్టిన తేనెటీగలు-గాయత్రి పుట్టుమచ్చ చూసి భయపడ్డ తిలోత్తమా?
గాయత్రి తలపై ఉన్న అర్థ చంద్రకారపు పుట్టుమచ్చ చూసిన తిలోత్తమాకు గాయత్రి గుర్తుకు వచ్చి భయపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani June 20th: కుటుంబ సభ్యులందరూ హాల్లో ఉండగా విశాలాక్షి గురించి అడుగుతారు. ఇక డమక్క విశాలాక్షి వస్తుంది అని అనటంతో అమ్మవారి లాగా తయారైన విశాలాక్షిని చూసి అందరూ మురిసిపోగా వల్లభ, తిలోత్తమా మాత్రం షాక్ తింటారు. అక్కడ పడేసిన మూటను చూస్తారు. విశాలాక్షిని చూసి నయని వాళ్ళు అచ్చం అమ్మవారి లాగా ఉంది అంటూ పొగడ్తలల్లో ముంచుతారు. ఇక విశాలాక్షి ఎవరి కంటికి ఎలా కనిపించాలో అలాగే కనిపిస్తాను అని ఉంటుంది.
ఇక ఐ డ్రాప్స్ వేసుకున్న సుమన కళ్ళు తెరిచి విశాలాక్షిని చూడగానే తన చుట్టూ తేనె తీగలు అల్లుకున్నట్లు కనిపిస్తుంది. దెబ్బకు భయపడి తిలోత్తమా వెనుకకు వెళ్లి తేనెటీగలు అంటూ అరుస్తుంది. ఇక అందరూ షాక్ అవుతారు. ఇక షాక్ లో ఉన్న వల్లభ, తిలోత్తమా కూడా బంగారం, తేనెటీగలు అనటంతో అందరూ ఆశ్చర్యపడి ఏం జరిగింది అని అంటారు.
దాంతో అక్కడున్న మూట చూపిస్తాడు వల్లభ. తనకోసం బంగారం తీసుకొచ్చాడు అని హాసిని సంతోషపడుతుంది. ఆ తర్వాత మూట తెరిచి చూడడంతో తేనెటీగలు అతడిని కరుస్తాయి. అందరూ కంగారు పడుతుంటారు. ఇక వల్లభ బయటికి పారిపోగా వెంటనే హాసిని నవ్వుతుంది. బంగారం తేనందుకు ఇలాగే జరుగుతుంది అని అంటుంది.
ఆ తర్వాత విశాలాక్షిని తీసుకొని లోపలికి వెళ్తారు. ఇక సుమన ఫోన్ మాట్లాడుతూ వస్తుండగా విశాలాక్షి, డమక్క ఎదురుపడి ఫోన్ ఎక్కువగా మాట్లాడద్దు అని సలహా ఇస్తుంటారు. కానీ సుమన వాళ్లు మాటలు పట్టించుకోకుండా వెటకారంగా మాట్లాడుతుంది. దాంతో విశాలాక్షి త్వరలో నోరు మూతపడుతుంది అనటంతో అవన్నీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తుంది.
మరోవైపు తేనెటీగలు కరిచి బాధపడుతున్న వల్లభకు హాసిని పాటలు పాడుతూ పౌడర్ వేస్తుంది. అప్పుడే తిలోత్తమా అక్కడికి వచ్చి హాసినిని తిడుతుంది. కానీ హాసిని తిరిగి వెటకారం చేసి అక్కడినుంచి వెళ్తుంది. ఇక తిలోత్తమా కొడుకుతో ఆ పిల్ల మాయలదని చెప్పాను కదా అని అంటుంది. ఇక నగలు గురించి కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు అంటే బాగానే ప్లాన్ చేసింది అని అంటుంది.
అయితే వల్లభ కూడా మనం కూడా ఆ విద్యను నేర్చుకొని గజదొంగలం అవుదాం అనటంతో.. అవన్నీ అవసరం లేదు ఇక్కడున్న ఆస్తిని సంపాదించుకుంటే చాలు అని అంటుంది. ఆ తర్వాత నయని దంపతులు గాయత్రి కి గుండు చేయించుకొని తీసుకొని వస్తారు. దాంతో తిలోత్తమా మాకు చెప్పకుండా ఈ కార్యక్రమం ఎలా పూర్తి చేశారు అనగా దానికి కారణం పంతులు చెబుతాడు.
ఇక గాయత్రి తల మీద అర్థ చంద్రాకారంలో ఉన్న పుట్టుమచ్చన్ని చూసి తిలోత్తమా ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత నయని పాపకు గంధం రాయమని చెప్పటంతో తిలోత్తమా పాపకు గంధం రాస్తూ ఉండగా ఆ పుట్టుమచ్చని ఆలోచిస్తూ ఉండగా వెంటనే తనకు గాయత్రి గుర్తుకొస్తుంది. దెబ్బకు వెనక్కి జరగటంతో అందరు షాక్ అవుతారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial