అన్వేషించండి

Krishnamma kalipindi iddarini July 7th: కోడలికి డబ్బు సహాయం చేసిన సునంద.. చెల్లెలను కాపాడుకున్న గౌరీ?

చెల్లెల్ని కాపాడటం కోసం గౌరీ పడుతున్న తాపత్రయంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishnamma kalipindi iddarini July 7th: ఈశ్వర్ ఫోన్ కలవక పోయేసరికి భవాని గౌరీని ఈశ్వర్ దగ్గరికి వెళ్ళమని పంపిస్తుంది. దాంతో గౌరీ ఈశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా.. ఈశ్వర్ ను డబ్బులు ఎలా అడగాలి.. ఏమని చెప్పాలి అంటూ టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది. ఇక వెళ్ళగానే ఈశ్వర్ చెల్లెలు గౌరీ వదిన వచ్చింది అంటూ తెగ సంబర పడిపోతుంది.

మెహేంది ఫంక్షన్ కు ఏర్పాటు చేస్తున్నారు అని చెబుతోంది. అని గౌరీ ఈశ్వర్ గురించి చూస్తూ ఉండటంతో వెంటనే తను అన్నయ్య గురించి చూస్తున్నావా అని అంటుంది. అప్పుడే అక్కడికి సునంద వచ్చి అమ్మ వాళ్ళు రాలేదా అనటంతో.. వాళ్లు కాసేపయ్యాక వస్తారు అని చెబుతుంది. కానీ ఈశ్వర్ గురించే చూస్తూ ఉంటుంది. ఇక వదిన అన్నయ్య కోసం చూస్తుంది అని అనటంతో అలా అనకూడదు అని సునంద అంటుంది.

 గౌరీ తన మనసులో అక్కడ తన చెల్లి వాళ్ళు టెన్షన్ పడుతున్నారేమో అని బాధపడుతూ ఉంటుంది. సునంద ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. జలజ గౌరీ కోసం జ్యూస్ తీసుకురావడానికి వెళ్తుంది. మరో వైపు పోలీస్ స్టేషన్లో తల్లి కూతుర్లు టెన్షన్ పడుతూ ఉంటారు. మీడియా ముందు పడితే తన పరువు పోతుంది.. పెళ్లి కాదు అని బాధపడుతూ ఉంటుంది.

ఇక తన ఫోన్ పోయినందుకు అప్పుడే ఈశ్వర్ కూడా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఈశ్వర్ ని చూసి ఇద్దరు భయపడతారు. ఈయన ఇక్కడ ఎందుకు వచ్చాడు అని అనుకుంటాడు. ఇక సైలెంట్ గా ఉండి ఈశ్వర్ పోలీస్ తో ఏం మాట్లాడుతున్నారో వినడానికి పక్కకు వెళ్తారు. ఇక ఈశ్వర్ తన ఫోన్ పోయిందని అందులో ఉన్న డేటా తనకు చాలా ఇంపార్టెంట్ అని అనడంతో మీరేం టెన్షన్ పడకండి మీ ఫోన్ మీ దగ్గరికి వస్తుంది మీ ఇంటికి మేము పంపిస్తాము అని అంటాడు ఇన్స్పెక్టర్.

దాంతో ఈశ్వర్ పర్లేదు ఫోన్ వచ్చేవరకు ఇక్కడే ఎదురు చూస్తాను అని అంటారు. దాంతో అఖిల వాళ్లు భయపడతారు. మీడియా వస్తే ఈశ్వర్ ముందు దొరికిపోతాము అని అనుకుంటారు. అక్కడ గౌరీ ఈశ్వర్ కోసం వెళ్తే ఈశ్వర్ ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటారు. మరోవైపు గౌరీ ఈశ్వర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జలజ జ్యూస్ తీసుకొని రాగా అది తాగకుండా పక్కకు పెట్టేస్తుంది.

ఒకసారి సునందతో మాట్లాడాలి అని సునంద దగ్గరికి వెళ్తుంది. సునంద తన భర్తతో గౌరీ వాళ్ళు వచ్చేశారు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేయించారా అని హడావుడిగా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గౌరీ అక్కడికి రావటంతో ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తాడు. గౌరీ ఒకసారి ఈశ్వర్ గారికి ఫోన్ చేయండి అని అంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి బిజీగా ఉన్నాడేమో అని అంటుంది సునంద.

దాంతో గౌరీ ఈశ్వరి విషయంలో టెన్షన్ పడుతున్నట్లు గమనిస్తుంది. ఇక నేను నీ తల్లి లాంటిదాన్ని నీకేం జరిగినా నాకు చెప్పాలి ఏదైనా సమస్య ఉన్న చెప్పాలి అని ప్రేమగా సునంద అడగటంతో.. గౌరీ కాస్త ఇబ్బంది పడుతూ తనకు పాతిక లక్షలు కావాలి అని మళ్లీ తల తాకట్టు పెట్టి అయినా ఇస్తాను అని అంటుంది. దాంతో సునంద మరో మాట అడగకుండా డబ్బులు మళ్లీ ఇవ్వకున్నా పర్వాలేదు అనటంతో తన కాళ్ళను దండం పెట్టుకుంటూ థాంక్స్ చెప్పుకుంటుంది.

ఆ తర్వాత గౌరీ డబ్బులు తీసుకొని అక్కడినుంచి వెళ్తుంది. మరో వైపు పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ ఫోన్ దొరకటంతో వెంటనే ఈశ్వర్ గౌరీ ఫోన్ కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ భవాని దగ్గర ఉండటంతో వెంటనే కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇక గౌరీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అక్కడి నుంచి వెళ్తాడు ఈశ్వర్. ఇక ఇన్స్పెక్టర్ భవాని వాళ్ళ దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు వచ్చారు ఇంకా మీ కూతురు రాలేదు.. మీ పేరు మీడియా వాళ్లకు చెప్పేస్తాను అని అంటాడు. ఇక గౌరీ డబ్బులు తీసుకొని అదే సమయానికి పోలీస్ స్టేషన్ కి రావటంతో అఖిల వాళ్లు ఊపిరి పీల్చుకుంటారు.

Also Read: Trinayani July 7th: ‘త్రినయని’ సీరియల్: మరింత వయసు తగ్గించుకున్న తిలోత్తమా, సంతకంతో షాక్ ఇచ్చిన గాయత్రి పాప?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget