Trinayani August 16th: విశాలాక్షి చావును కోరుకున్న సుమన.. నయనిని గెలిపించిన గాయత్రి పాప?
ఆటలో గెలిచి విశాలాక్షిని చంపేయాలని సుమన అనుకోవటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.

Trinayani August 16th: సుమన ఈ ఆట చాలా సార్లు ఆడాము అని.. డమ్మక్క ను తప్పుకోమని చెప్పి ఈ ఆటలో నేనే గెలుస్తాను అని విశాలాక్షి ముందు కూర్చుంటుంది. ఇక సుమన ఆడబోతుండగా వెంటనే విక్రాంత్ ఆపి.. విశాలాక్షి గెలిస్తే ఏంటి అన్నది చెప్పలేదు కదా అనటంతో.. వెంటనే సుమన అడుక్కోమను.. తనకు అలవాటే కదా అని వెటకారంగా అంటుంది. దాంతో తిలోత్తమా, వల్లభ వెటకారంగా నవ్వుతూ ఉంటారు. వెంటనే హాసిని వారిపై చిరాకు పడుతుంది.
ఇక హాసిని గెలిస్తే ఏంటి అన్నది చెప్పమని అడగటంతో చెబితే బాగోదేమో అని అంటుంది. దాంతో ఢమక్క చెప్పులను విశాలాక్షి కాళ్లకు తొడగాలి అని అంటుంది. వెంటనే తిలోత్తమా చెప్పులు తొడగటం ఏంటి అని చీదరించుకుంటుంది. వెంటనే నయని వద్దని.. అత్తయ్య ఆడలేక ఓడలేక ఇలా అంటుంది అని అంటుంది. సుమనను లెగమని అనడంతో నేను ఆడి తనను ఓడిస్తాను అని అంటుంది.
ఇక తిలోత్తమా మొదట సుమనను ఆడనివ్వమని అంటుంది. నయని సుమనతో నువ్వు గెలిస్తే నువ్వేం అడగాలనుకుంటున్నావో అని అడగటంతో కడుపులో ఉన్న బిడ్డ గురించి అడుగుతాను అని అంటుంది. అలా చెబితే ప్రాణాపాయమని గురువుగారు చెప్పారు కదా అని విశాల్ అనటంతో.. మీరు ఏమి కంగారు పడకండి విశాలాక్షి చెప్పి చచ్చిపోతుంది అని అంటుంది. దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.
వెంటనే విక్రాంత్ తనని ఆటలో నుంచి లెగమని అంటాడు. విశాల్ కూడా ఆటను ఆడకూడదు అని అంటాడు. నయని కూడా విశాలాక్షిని లెగమని అంటుంది. తిలోత్తమా వాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. వల్లభ సుమనను ఎంకరేజ్ చేసి ఆడమని అంటాడు. విశాల్ వద్దు అని.. వెంటనే వల్లభ ఆడనివ్వు తమ్ముడు పోయేది నీ పెళ్ళాం ప్రాణాలు కాదు కదా అంటాడు.
దాంతో విశాల్ కోపంగా అరుస్తాడు. ఇక తిలోత్తమా అవన్నీ పట్టించుకోకు అని సుమనను ఆడమని అంటుంది. వెంటనే విక్రాంత్.. నువ్వే గెలిచి తనతో చెప్పులు తొడిగించుకోవాలి అని విశాలాక్షితో అంటాడు. దాంతో విశాలాక్షి సరే అని అంటుంది. కానీ సుమన మాత్రం మొండి పట్టుగా తనే గెలుస్తాను అని అంటుంది. ఇక ఆట మొదలుపెడతారు. ఇంట్లో వాళ్లంతా ఆటను ఇంట్రెస్ట్ గా చూస్తారు.
ఇక విశాలాక్షి గెలవడంతో అందరు సంతోషపడగా సుమన, తిలోత్తమా లు రగిలిపోతూ ఉంటారు. ఇక సుమన ఆట అయిపోయాక తిలోత్తమా ఆట మొదలు పెడుతుంది. ఇక విశాల్ నువ్వే గెలవాలమ్మ అంటూ తిలోత్తమా కు సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే విశాలాక్షి చెప్పులు పట్టుకునే పరిస్థితి రావద్దని అంటాడు. రాదు అంటూ వల్లభ పొగరుగా చెబుతాడు.
ఆట మొదలుపెట్టాక తిలోత్తమా మొదట దూసుకెళ్తుంది. ఆ తర్వాత విశాలాక్షి ఆడి తనను ఓడిస్తుంది. ఇంట్లో వాళ్ళు సంతోషంగా గంతులు వేస్తారు. ఇక చెప్పులు వేయమని దురంధర సుమనను అనటంతో సుమన తన అక్క కూడా ఆడుతుంది అని అంటుంది. ఇక నయని కూడా కొన్ని విషయాలు తెలుసుకోవటానికి విశాలాక్షితో ఆట ఆడుతుంది.
నయనికి గవ్వలు మంచిగా పడకపోయేసరికి వెంటనే విశాల్ గాయత్రి పాపను నయని ఒడిలో కూర్చోబెడతాడు. కలిసి వస్తుందా అని తిలోత్తమా అనటంతో మా అమ్మది లక్కీ హ్యాండ్ అని నోరు జారుతాడు విశాల్. వెంటనే దురంధర అమ్మనా అంటూ ఆశ్చర్యపోగా వెంటనే హాసిని కవర్ చేస్తుంది. ఇక నయని విశాలాక్షి అమ్మవారిని తలుచుకొని ఆట ప్రారంభిస్తుంది.
దాంతో విశాల్ తన మనసులో.. అమ్మ కూడా నీలాగే అమ్మవారికి పరమ భక్తురాలు.. పాప ఒడిలో ఉంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చి ఆడిన ఓడిపోతుంది అని అనుకుంటాడు. అప్పుడే విశాలాక్షి నిజమే నాన్న అనటంతో.. ఏంటమ్మా ఆ నిజం అని అడుగుతాడు. నువ్వు మనసులో అనుకున్నది అని అనటంతో విశాల్ ఆశ్చర్యపోతాడు.
ఇక నయని గాయత్రి పాపతో గవ్వలు వేయించడంతో నయని గెలుస్తుంది. వెంటనే హాసిని సంతోషంగా అక్కడినుంచి లోపలికి పరిగెత్తుతుంది. ఇక విశాల్ విశాలాక్షి నువ్వు ఓడిపోయావు అని అనటంతో.. నువ్వు ముందే అనుకున్నావు కదా నాన్న అని అనటంతో విశాల్ ఆశ్చర్యపోతాడు.
also read it : Maamagaru serial: ఈ ఇంట్లో ఆడాళ్ళు ఇంట్లో పనులు చెయ్యడానికే కానీ ఉద్యోగాలు చేసి వెలగపెట్టడానికి కాదు.. కొత్త సీరియల్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

