Prema Entha Madhuram October 2nd: బాధతో కుమిలిపోతున్న అను.. ఆర్యను నిలదీసిన సుబ్బు, పద్దులు??
ఆర్యనీ సుబ్బు, పద్దులు నిలదీయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema entha madhuram October 2nd: మాన్సి అను కి ఆర్య పెళ్లికి ఒప్పుకున్న వీడియో చూపిస్తుంది.
అను: లేదు ఇలా జరగదు. ఇదంతా అబద్ధం. ఇక్కడ జలంధర్ ఉండడం ఏంటి?
మాన్సి: ఓ నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను చాయాదేవి ఎవరో కాదు జలంధర్ తోడు పుట్టిన చెల్లి.
అను: ఇదంతా తెలిసి కూడా ఆర్య సార్ పెళ్లికొప్పుకున్నారా? నేను నమ్మను దీనికి ఏదో కారణం ఉండే ఉంటుంది.
మాన్సి: అవును కారణం ఉంది. బ్రో ఇన్ లా ఛాయాదేవిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఒకటి స్కూల్ ని కాపాడడానికి, రెండోది వర్ధన్ కుటుంబానికి వారసులు కావాలంటే దత్తకు తీసుకోవడానికి కూడా భార్య స్థానంలో ఒకలు ఉండాలి అందుకే పెళ్లి చేసుకుంటున్నారు.
నీరజ్ ని నన్ను కలపమని నిన్ను ఎంత వేడుకున్నా అంజలికి సపోర్ట్ చేశావు. ఈరోజు నేను కూడా ఛాయదేవికి సపోర్ట్ చేస్తున్నాను అని నుదుట మీద బొట్టు పెట్టి పెళ్లికి మాత్రం రావద్దు చూస్తే తట్టుకోలేవు. అందుకే తెగేవరకు లాగకూడదంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాన్సి. అను అక్కడే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది.
ఆ తర్వాత సీన్లో సుబ్బు, పద్దులు రోడ్లమీద అను కోసం వెతుకుతూ అలిసిపోయి ఒక మూలకి వచ్చి కూర్చుంటారు.
పద్దు: ఏంటి సుబ్బు బుజ్జమ్మ కోసం ఎంత వెతుకుతున్నా తన జాడ కూడా తెలియడం లేదు.
సుబ్బు: బాధపడొద్దు పద్దు దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది. మనం ఎలాగా బుజ్జమ్మ దొరకడం లేదని బాధపడుతున్నామో ఆర్య సార్ అంతకన్నా ఎక్కువే బాధపడుతున్నారు.
పద్దు: అవును సుబ్బు ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము కదా అలాగే ఆర్య సార్ ని కూడా పలకరించి అందర్నీ కలిసి వెళ్దాము అని అనగా ఇంతలో ఆర్య ఇంటి వాచ్మెన్ అక్కడికి వస్తాడు.
వాచ్మెన్: నమస్తే మేడం, నమస్తే సార్. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీకు కూడా పెళ్లి విషయం తెలిసే ఉంటుంది కదా అని చెప్పి ఛాయతో పెళ్లి విషయాన్ని స్కూలు గొడవని అంతా వాళ్లకు చెప్పుకొని వస్తాడు. అయినా పెద్దింటోళ్లు ఏదైనా చేసుకోగలరు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వాచ్మెన్.
పద్దు: ఏంటి పొద్దు వాడు చెప్తుంది? ఆర్య సార్ ఇంకొక పెళ్లి చేసుకోవడం ఏంటి? లేదు ఇది నిజం కాదు.
సుబ్బు: రా ఆర్య సార్ దగ్గరికి వెళ్లి ఇప్పుడే తెలుసుకుందాం అని బయలుదేరుతారు.
ఆ తర్వాత సీన్లో నీరజ్ దిగులుగా హాల్లో కూర్చుని ఉండగా అంజలి వచ్చి జూస్ ఇస్తుంది.
అంజలి: రాత్రి కూడా ఏం తినలేదు నీరజ్ ఇప్పుడైనా జ్యూస్ తాగు అని నీరజ్ కి జ్యూస్ తాగిస్తూ ఉండగా అక్కడికి మాన్సి, జలంధర్ తో పాటు వస్తుంది.
మాన్సి: పెళ్లి కాబోతున్న జంట కన్నా పెళ్లయిపోయిన జంట చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు
నీరజ్: అసలు నిన్ను ఎవరు లోపలికి రమ్మన్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?
జలంధర్: అదేంటి చిన్న బావగారు ఎందుకు అంత కోపం. ఇది మన ఇల్లే కదా ఇద్దరం ఒక కుటుంబమే కదా ఇప్పుడు. పెళ్లికి తేదీ పంతులుగారు చెప్పారు అలాగే మీకు పళ్ళు ఇవ్వడానికి వచ్చాను. అయినా ఏంటి పెళ్లి అనగానే డెకరేషన్లు ఉండాలి కదా ఏమీ లేవు.
నీరజ్: మర్యాదగా ఇంటి నుంచి బయటకు వెళ్ళండి అని అనగా ఇంతలో ఆర్య అక్కడికి వస్తాడు.
ఆర్య: ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఇవన్నీ తెచ్చారు పెళ్లి జరుగుతుంది అని చెప్పాను కదా ఇవన్నీ తీసుకురావద్దు మర్యాదగా తీసుకొని వెళ్ళండి.
జలంధర్: సరే బావగారు కనీసం పెళ్లి డేట్ అయినా వినండి. అక్టోబర్ మూడు ఉదయం రెండు గంటలకి అని అనగా ఇంతలో సుబ్బు, పద్దులు అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అరుస్తారు.
పద్దు: ఏంటి ఆర్య సార్ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? మీ ఇంటి వాచ్మెన్ విషయం చెప్పినప్పుడు ఇదంతా కేవలం పుకారే అని తేల్చుకుందామని వచ్చాము కానీ మేమే ఇక్కడ మోసపోయాము.
సుబ్బు: మా బుజ్జమ్మ గురించి మీకు తెలుసు కదా తను నీకు అన్యాయం చేసినా సరే మీ క్షేమం కోసమే ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి మీ పక్కన స్థానం ఎప్పుడూ బుజ్జమ్మదే కదా.
పద్దు: మేము ప్రతిరోజు గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగేది ఎందుకో తెలుసా సార్? ఏ రోజుకైనా మా బుజ్జమ్మ తిరిగి కనబడుతుందని మీతో పాటు నిండు నూరేళ్లు చల్లగా బతుకుతుందని అందుకే. కానీ మీరు ఇక్కడ మా బుజ్జమ్మకి అన్యాయం చేద్దామని చూస్తున్నారు.
ఆర్య: నేను ఎవరికి అన్యాయం చేయడం లేదు. నేను కేవలం పరిస్థితులకు అనుకూలంగా నన్ను నేను మార్చుకుంటున్నాను అంతే. దీనికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇంతలో మాన్సి పిన్ని గారు అంటూ ఏదో చెప్తూ ఉండగా పద్దు ఆపుతుంది.
పద్దు: ఆగు ఇంటి పరువును కోర్టుకు ఈడ్చుకు వెళ్లి, మంగళసూత్రం విలువ కూడా తెలియని నువ్వు ఇందులో దూరద్దు. అయినా ఆర్య సార్ మీ పక్కన స్థానం ఎప్పటికీ మా బుజ్జమ్మదే, మా బుజ్జమ్మదే అని అంటుంది పద్దు.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial