Krishnamma kalipindi iddarini July 24th: ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సీరియల్: ఆదిత్య ప్రేమ గుట్టు బయట పెట్టడానికి ప్లాన్ చేసిన సౌదామిని, మొదటి రోజే అత్తతో అవమానపడ్డ అఖిల
అడుగుపెట్టిన మొదటి రోజె అఖిల అత్తతో మాటలు పడిపించుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini July 24th: మరోవైపు ఈశ్వర్ జరిగిన విషయంలో గౌరీ కి థాంక్స్ చెబుతాడు. గౌరీ మంచితనాన్ని పొగుడుతూ ఉంటాడు. అమ్మకు అత్త ఇంట్లో ఉండటం ఇష్టం లేకున్నా కూడా నీ మాటలతో అమ్మ మనసుని మార్చావు అత్తను ఇంట్లో ఉండేటట్టు చేసావు అందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు ఈశ్వర్. దాంతో గౌరీ ఇంటి కోడలుగా నా బాధ్యతలు అని అందరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని అంటుంది.
దాంతో గౌరీ మాటలకు ఫిదా అయినా ఈశ్వర్ తనకు నుదుట మీద ప్రేమగా ముద్దు పెడతాడు. ఇక గౌరీ కూడా ఈశ్వర్ ని ప్రేమగా చూస్తుంది. ఆ తర్వాత ఉజ్వల తన తల్లితో ఆల్రెడీ ఆదిత్య ప్రేమించే అమ్మాయి గురించి తెలిసింది కదా ఇప్పుడు ఏం చేయబోతున్నావు అనటంతో.. ఇప్పుడు ఆదిత్య అమృత అని ప్రేమిస్తున్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేయాలి అని.. దాంతో ఇంట్లో మళ్లీ గొడవలు మొదలవ్వాలి అని కాబట్టి వారి ప్రేమ గురించి బయటపడడమే కాకుండా ఇష్టం లేని అఖిలతో ఆదిత్య ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అంటుంది.
వెంటనే ఉజ్వల ఆదిత్య గదిలో ఏమైనా ప్రూఫ్స్ దొరుకుతాయి కదా అని అనటంతో అవును అని అదే సమయంలో బయట ఉన్న ఆదిత్యను చూసి ఇప్పుడే మంచి సమయం అని ఆదిత్య గదిలోకి వెళ్తారు. ఉజ్వల బయట కాపలాగా ఉంటుంది. సౌదామిని అక్కడున్న ఫోన్ చూసి అవి ఇవి వెతకడం ఎందుకు నేరుగా ఫోన్లోనే చూసే సరిపోతుంది కదా అని ఫోన్ తీస్తుంది. ఇక ఫోన్ కి ఎటువంటి లాక్ కూడా లేకపోయేసరికి.. ఆదిత్య ఎంత అమాయకుడో అని అనుకుంటుంది.
ఇక అందులో అమృతతో కలిసి దిగిన ఫోటోలను చూసి వెంటనే తన ఫోన్లో పంపించుకుందాం అనుకున్న సమయంలో ఆదిత్య ఫోన్ కి ఫోన్ వస్తుంది. ఆదిత్య ఫోన్ రావటంతో ఇంట్లోకి వస్తుండగా ఉజ్వల ఆదిత్య వస్తున్నాడని చెప్పటంతో సౌదామని బయటికి వస్తుంది. తమ ప్లాన్ సక్సెస్ కాలేదు అని సౌదామిని బాధపడుతుంది. ఇక ఆదిత్య తన ఫ్రెండ్ కు మళ్లీ కాల్ చేస్తాను అని చెప్పి కట్ చేస్తాను.
మరుసటి రోజు ఉదయాన్నే గౌరీ లేచి తలస్నానం చేసి వాకిలి ఊడ్చి ముగ్గు వేసి.. తులసి పూజ చేస్తూ ఉండగా ఇంట్లో సునంద దంపతులు, వృద్ధ దంపతులు చూసి మురిసిపోతూ ఉంటారు. నీ కోడలు నీ బాధ్యతను తీసుకుంది అని సునందతో తన అత్త అంటుంది. అప్పుడే అక్కడికి ఈశ్వర్ రావటంతో గౌరీ గురించి చెబుతూ మురిసిపోతారు.
ఇక గౌరీ వచ్చి అందరికీ హారతి ఇస్తుంది. ఇక ఈశ్వర్ కు తన హారతి అద్దుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళు మరింత ఫిదా అవుతారు. ఆ తర్వాత సునంద పైకి వెళ్తుండగా అక్కడ గాడ నిద్రలో ఉన్న అఖిలని చూసి తన దగ్గరికి వెళ్లి లేపుతుంది. కానీ అఖిల లేవకుండా కాసేపు ఆగు అమ్మ అని అంటుంది. దాంతో గట్టిగా సునంద అరవడంతో వెంటనే అఖిల లేచి షాక్ అవుతుంది. రాత్రి ఆలస్యంగా పడుకున్నందుకు ఇప్పుడు ఆలస్యం అయ్యింది అని అంటుంది.
ఇక సునంద కోపంతో అక్కడ మీ అక్క గౌరీ పొద్దున్నే లేచి తులసి కోట దగ్గర పూజ చేసిందని అనటంతో అఖిలకు బాగా కోపం వస్తుంది. గౌరీని చూసి నేర్చుకో అని కొన్ని మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్తుంది సునంద. దాంతో కోపంతో రగిలిపోతున్న అఖిలను సౌదామిని, ఉజ్వల పొగరుగా చూస్తూ ఉంటారు.
also read it : Trinayani July 24th: ‘త్రినయని’ సీరియల్: సుమనకు రూ.10 లక్షల చెక్ ఇచ్చిన తిలోత్తమా, షాకింగ్ విషయాన్ని మోసుకొచ్చిన వల్లభ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial