అన్వేషించండి

Madhuranagarilo August 10th: సంయుక్త చేతిని చూసి షాకైన శ్యామ్.. రాధ చెంప పగలగొట్టిన అపర్ణ?

శ్యామ్ సంయుక్త చేతి మీద ఉన్న మెహేంది డిజైన్ చూసి షాక్ అవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Madhuranagarilo August 10th: శ్యామ్ సంయుక్త చేతి మీద ఐ లవ్ యూ రాధ అని రాయడంతో సంయుక్త బాధపడటంతో వెంటనే శ్యామ్ ఇలా చెప్పడం తప్పే కావచ్చు కానీ తప్పదు అని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. దాంతో సంయుక్త తన గదికి వెళ్లి తన చెయ్యి చూసుకుంటూ బాగా ఏడుస్తుంది. అప్పుడే రాధ వచ్చి సంయుక్త ఏం జరిగింది ఇలా ఉన్నావని అడగటంతో సంయుక్త కోపంగా ఏం జరిగిందా అంటూ చెయ్యి చూపిస్తుంది.

చూసావా శ్యామ్ ప్రేమ ఎంత దూరం వచ్చిందో చూసావా అంటూ కోపంగా మాట్లాడుతూ.. నా మెహేంది ఫంక్షన్ లో ఐ లవ్ యూ రాధ అని నా చెయ్యి మీద రాసే వరకు వచ్చిందని అంటుంది. అసలు శ్యామ్ నాకోసం రాలేదు మధుర అత్తయ్యకు నిజం చెప్పి పెళ్లి ఆపించాలని వచ్చాడు అని అంటుంది. అందుకే చేతి మీద మెహేంది పెట్టాడు అని అంటుంది. ఇలా చేస్తే నా పెళ్లి జరుగుతుందా అని బాధపడుతుంది.

శ్యామ్ ఇంతలా తెగించాడు అంటే నువ్వు ప్రేమిస్తున్నట్లు అతనికి ఏమైనా హింటిచ్చావా అని అంటుంది. వెంటనే రాధ అటువంటి హింట్ ఏమి ఇవ్వలేదు.. నేను తనని ప్రేమిస్తున్నట్లుగా ఎటువంటి హింట్ ఇవ్వలేదు అనటంతో సంయుక్త షాక్ అవుతుంది. దాంతో రాధ మాటలకు అనుమానం రావటంతో నువ్వు శ్యామ్ ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. నేను సార్ ని అస్సలు ప్రేమించడం లేదు మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది అని అంటుంది.

శ్యామ్ సర్ మధుర మేడమ్ కి నిజం చెప్పకుండా నేను చూసుకుంటానని మాట ఇస్తుంది. దాంతో సంయుక్త నా చేతిలో ఉన్న నీ పేరు ఎవరి కంటపడకుండా ఎలా చూసుకుంటావని అడుగుతుంది. చూసే వాళ్లకు ఏం సమాధానం చెప్పాలని అరుస్తుంది. దాంతో రాధ ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటుంది. మధుర తన డిజైన్ బాగుంది అనడంతో వెంటనే శ్యామ్ మధుర దగ్గరికి వచ్చి నేను సంయుక్తకు వేసిన డిజైన్ ఇంకా బాగుందని అంటాడు.

దాంతో ఏం డిజైన్ వేశావురా అని సంయుక్తను పిలుస్తుంది. అప్పుడే శ్యామ్ నీతో మాట్లాడాలని మధుర తో అంటాడు. నాతో తర్వాత మాట్లాడొచ్చు గాని ముందు సంయుక్త చేతికి ఏం డిజైన్ వేసావో చెప్పు అని అడుగుతుంది. మీరే చూస్తారు కదా అని శ్యామ్ అంటాడు. ఇక సంయుక్త ని పిలవటంతో సంయుక్త అక్కడికి రాగా శ్యామ్ ఏం డిజైన్ వేసాడో చూపించు అని అంటుంది.

తర్వాత చూపిస్తాను అని అనటంతో శ్యామ్ ఇప్పుడే చూపించమని అంటాడు. సంయుక్త చూపించకపోయేసరికి బలవంతంగా శ్యామ్ వెళ్లి తన చెయ్యి అందరికీ చూపిస్తాడు. ఇక అందరూ షాక్ అయినట్లు కనిపిస్తారు. కానీ మళ్లీ మెల్లిమెల్లిగా నవ్వుకుంటున్నట్లు కనిపిస్తారు. వారిని చూసి మరింత ఆశ్చర్యపోతాడు.

వెంటనే మధుర చాలా బాగుంది డిజైన్ అని అంటుంది. శ్యామ్ అనుమానం వచ్చి సంయుక్త చెయ్యి చూడటంతో ఐ లవ్ యూ సంయుక్త అని రాసి ఉంటుంది. వెంటనే రాధ ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేయగలం అని అనుకుంటుంది. ఇక మధుర మాత్రం తెగ మురిసిపోతూ ఉంటుంది. సంయుక్త అక్కడినుంచి మళ్లీ తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది.

అప్పుడే అపర్ణ, సంయుక్త ఫ్రెండ్ అక్కడికి వస్తారు. ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అపర్ణ అడుగుతుంది. వెంటనే సంయుక్త జరిగిన విషయం మొత్తం చెబుతుంది. రాధ తన పేరును కనపడకుండా చేసి సంయుక్త అని రాసినట్లు చెబుతుంది. ఇక అపర్ణకు బాగా కోపం వస్తుంది. తను రాధను ప్రేమిస్తున్న విషయం డైరెక్ట్ గా నీకే చెప్పాడు అంటే ఎంత తెగించాడు అని అంటుంది.

ఇప్పుడు మధురకు తెలిస్తే ఏంటి పరిస్థితి అనటంతో అప్పుడే రాధ ఏం జరగకుండా నేను చూసుకుంటాను అని అక్కడికి రావడంతో వెంటనే అపర్ణ రాధ చంప పగలగొడుతుంది. ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు.. నా కూతురు, అల్లుడికి మధ్య నువ్వు అనేది లేకుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు అని అంటుంది. దాంతో రాధ తన ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనేం చేయాలి అని అంటుంది.

కానీ అపర్ణ మాత్రం బాగా అరుస్తూ ఉంటుంది. ఇక రాధ శ్యామ్, సంయుక్తల పెళ్లి జరిగే బాధ్యత నాది.. ఎటువంటి అడ్డంకులు రాకుండా నేను చూసుకుంటాను.. అందుకే ఇందాక నా పేరు తీసేసి సంయుక్త పేరు పెట్టాను వెంటనే సంయుక్త.. అలా నా పేరు పెట్టినందుకు థాంక్స్ కాని ఇలా శ్యామ్ రాయడానికి కారణం నువ్వే అని అంటుంది.

ఇక రాధ నేను మాత్రం తనని ప్రేమించడం లేదు అని అంటుంది. ఇక ఈ విషయం మధురం మేడంకి శ్యామ్ సర్ చెప్పాడని.. ఎందుకంటే తను హార్ట్ పేషెంట్ అని.. ఎలాగైనా మీ పెళ్లి జరుగుతుంది అని ధైర్యం ఇస్తుంది. కానీ సంయుక్త జరగకపోతే పండుకి నువ్వు కన్న తల్లివి కాదన్న విషయం చెప్పేస్తాను అని బెదిరిస్తుంది. మరోవైపు వాసంతి గోరింటాకు ఎర్రగా పండటంతో అందమైన మొగుడు వచ్చాడా అని మరో అమ్మాయి అడగటంతో గన్నవరం గురించి కౌంటర్ వేసే విధంగా డైలాగ్ కొడుతుంది.

శ్యామ్ ఒంటరిగా కూర్చొని తన తల్లికి తన ప్రేమ విషయం ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సంయుక్త వస్తుంది. డిన్నర్ కి రమ్మని అనటంతో వెంటనే నువ్వు చేసిన పనికి నా కడుపు నిండిపోయింది అని చిరాకు పడతాడు. నా మనసులో ఏముందో అని తెలుసి కూడా మళ్లీ నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు కదా అని అంటాడు.

అసలు విషయం మీ మమ్మీకి మా మమ్మీకి చెప్పచ్చు కదా అని అంటాడు. వెంటనే సంయుక్త నేను నిన్ను ఇంతలా ఇష్టపడుతున్న దాన్ని ఎలా చెప్పాలి అని అంటుంది. రాధను ప్రేమించిన నువ్వు తనను పెళ్లి చేసుకోవడానికి ఎంత ఆశ పడుతున్నావో నేను కూడా నీ విషయంలో అంతే ఆశ పడుతున్నాను అని అంటుంది. ఇక శ్యామ్ ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మనిద్దరికీ నరకం అని అంటాడు. ఆ నరకాన్ని నేను స్వర్గంగా మార్చుకుంటాను అని సంయుక్త అంటుంది.

ఏదేమైనా రేపు మనిద్దరికీ పెళ్లి జరుగుతుంది అని గట్టిగా చెబుతుంది. శ్యామ్ మాత్రం తల పట్టుకొని చిరాకు పడుతూ ఉంటాడు. రాధ గాని సంయుక్త చేతుల్లో తన పేరు చెరిపేయకుండా ఉంటే ఈపాటికి అందరికీ తెలిసేది అని అనుకుంటాడు. అసలు ఈ రాధ ఎక్కడ ఉంది అని అనుకుంటాడు.

also read it : Krishnamma kalipindi iddarini August 10th: 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' సీరియల్: గౌరీ పక్కన ఉండటానికి కంపురంగ ఫీలవుతున్న ఈశ్వర్, సౌదామినిపై నమ్మకం పెంచుకుంటున్న సునంద?

 


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget