![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rangula Ratnam July 20th: దేవ్ రాకతో మంచి జరగనుందా.. వర్ష కళ్ళే తన కళ్ళు అని తెలుసుకొని షాకైన శంకర్ ప్రసాద్?
సత్యం దగ్గరికి దేవ్ వచ్చి శంకర్ ప్రసాద్ గురించి మాట్లాడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Rangula Ratnam July 20th: దేవ్ రాకతో మంచి జరగనుందా.. వర్ష కళ్ళే తన కళ్ళు అని తెలుసుకొని షాకైన శంకర్ ప్రసాద్? Shankar Prasad is shocked to know that Varsha's eyes are his eyes in Rangula Ratnam July 20th eposide Rangula Ratnam July 20th: దేవ్ రాకతో మంచి జరగనుందా.. వర్ష కళ్ళే తన కళ్ళు అని తెలుసుకొని షాకైన శంకర్ ప్రసాద్?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/20/f4c27bc2c48019be504b7da295b6550c1689833899617768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rangula Ratnam July 20th: సీతని తీసుకెళ్లడానికి వచ్చిన రఘు తన తండ్రి నర్సింగ్ కు కనిపించాడన్న విషయం చెప్పటంతో సత్యం వాళ్లంతా సంతోషపడతారు. అందుకే సీతను త్వరగా తీసుకెళ్లి నాన్నను వెతకడానికి వెళ్లాలి అని అంటాడు. దాంతో సత్యం సరే అంటాడు. ఇక జానకి కూతురికి చీరసారపెట్టి పంపిస్తుంది. ఆ తర్వాత కారులో చక్రి, రేఖ ప్రయాణిస్తూ ఉంటారు. ఇక రేఖ దీర్ఘంగా ఆలోచించటంతో చక్రి ఏం జరిగింది అని అంటారు.
తన దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయని అందరి కన్ను తనపై ఉంటుంది అని శత్రువులు ఎక్కువ అవుతుంటారు కాబట్టి అందర్నీ వెయ్యి కళ్ళతో గమనిస్తూ ఉండాలి అని అందుకే 24 గంటలు ఆలోచనలోనే ఉండాలి అని అంటుంది. ఇక చక్రి కూడా మీ జోలికి ఎవరు రారు.. మీకున్న ఆలోచనలు మరెవరికి ఉండవు అని అంటాడు. ఇక మధ్యలో కారు ఆగిపోవడంతో చక్రి కారు ట్రబుల్ ఇచ్చింది అని అక్కడే ఉన్న మెకానిక్ చేసే వ్యక్తిని పిలుస్తాడు.
అతడు సిద్దుని పిలవడంతో సిద్దు కార్ దగ్గరికి రాగానే అందులో ఉన్న రేఖను చూసి సైలెంట్ గా రిపేర్ చేస్తాడు. మరో వైపు చక్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక రిపేర్ అయిపోయింది అని సిద్దు చక్రి తో అంటాడు. తిరిగి చూసేసరికి సిద్దు ఉంటాడు. ఇక రేఖ కూడా సిద్ధుని చూసి షాక్ అవుతుంది. వెంటనే చక్రి మెకానిక్ చేస్తున్నావా అని అనటంతో.. రేఖ కారు దిగివచ్చి ఏంటి అల్లుడు మెకానిక్ చేస్తున్నాడని బాధపడుతున్నావా అని చక్రిని అంటుంది.
ఎవరేం చేస్తే నాకేం బాధ ఎవరు ఏమైతే నాకేంటి అని అంటుంటాడు చక్రి. ఇక అక్కడ కాసేపు వారి మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. పని చేసినందుకు రేఖ సిద్దుపై డబ్బులు విసిరేయటంతో కింద పడిపోవడంతో ఆ డబ్బులు తీసుకుంటాడు సిద్దు. అవసరం చాలా ఉందనుకుంట అని రేఖ వెటకారం చేయడంతో కష్టపడ్డందుకు ఇది నా డబ్బులు అని.. మా నాన్న ఆస్తులను కొట్టేసి కూర్చుని తింటుంది నువ్వు కౌంటర్ వేయటంతో అక్కడి నుంచి రేఖ కోపంగా వెళ్ళిపోతుంది.
మరోవైపు తన భర్త అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది పూర్ణ. అప్పుడే రఘు దంపతులు వచ్చి తన తండ్రి కనిపించాడనే విషయం చెప్పడంతో.. ఇక్కడికి కూడా వచ్చాడు అని తనను అనరాని మాటలు అన్నాడని చెప్పుకొని బాధపడుతూ అక్కడినుండి వెళ్ళిపోతుంది. ఇక రఘు నేను నాన్నని వెతికి వస్తాను నువ్వు అమ్మ దగ్గర ఉండు అని చెప్పి బయలుదేరుతాడు.
ఆ తర్వాత సత్యం ఇంటికి ఎమ్మెల్యే దేవ్ తన కూతురుతో వస్తాడు. ఇక కాసేపు మాట్లాడాక దేవ్ శంకర్ ప్రసాద్ కు ఇలా జరిగిందంట అది నిజమేనా అనటంతో అవునని సత్యం అంటాడు. తన కూతురు జానకితో కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. తరువాయి భాగంలో వర్ష పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ వాళ్ళు అన్నదనం కార్యక్రమం ఏర్పాటు చేయగా అది చూసి శంకర్ ప్రసాద్ ఇవి చూడటానికైనా నా కళ్ళు వచ్చాయి అని బాధపడతాడు. గుడ్డివాడినే అయి ఉంటే బాగుండేది అనటంతో.. అలా ఉండకూడదు అనే వర్ష కోరిక అని అందుకే తను నీకు కళ్ళను ఇచ్చింది అనటంతో శంకర్ ప్రసాద్ షాక్ అవుతాడు.
also read it : Prema Entha Madhuram July 20th: కేక్ లో విషం కలిపిన మాన్సీ.. సర్ప్రైజ్ తో సంతోషంగా ఉన్న ఆర్య?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)