Rangula Ratnam July 24th: ‘రంగులరాట్నం’ సీరియల్: భార్యను కాపాడిన శంకర్, రేఖను ఇంట్లో నుంచి గెంటేసిన పూర్ణ?
నిజం తెలుసుకున్న శంకర్ ఆత్మహత్య చేసుకోబోతున్న పూర్ణను కాపాడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Rangula Ratnam July 24th: తను కూడా నీలాగే ఒక ఆడదే కదా అనటంతో వెంటనే రేఖ శంకర్ తనని నమ్మకుండా తన గుండెని రాయిని చేసింది నేనే అని అనటంతో అప్పుడే పైనుండి కిందికి వస్తున్న శంకర్ ఆ మాటలు విని షాక్ అవుతాడు. ఇక గతంలో తను పూర్ణ విషయంలో చేసిన మోసాలన్నీ ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సీత, శంకర్ షాక్ అవుతారు.
ఆ అర్చననే పూర్ణ అని తను డాక్టర్ అమ్మచే నిజం చెప్పించాలని చేస్తుందని తనను కిడ్నాప్ చేయించాను అని అన్ని నిజాలు బయట పెడుతుంది. దాంతో శంకర్ కోపంతో రగిలిపోతాడు. అంతేకాకుండా సిద్దు డిఎన్ఏ టెస్టులు మార్పించడానికి డాక్టర్ కు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించాను అని తను చేసిన కుట్రలు మొత్తం బయటపెడుతుంది. ఇక ఈ విషయం శంకర్ అసలు చెప్పను గాక చెప్పను అనటంతో అక్కడే ఉన్న శంకర్ రేఖ అంటూ గట్టిగా అరుస్తాడు.
శంకర్ ని చూసి రేఖతో పాటు సీత కూడా షాక్ అవుతుంది. ఒక ఆడదానికి మరో ఆడది శత్రువు అంటూ.. ఇప్పుడు సీత ద్వారా నీ నిజరూపం బయటపడింది.. అన్యాయంగా నా భార్య పూర్ణ ను నీ వల్ల చాలా బాధ పెట్టాను.. తని పూర్ణ అని తెలుసుకోలేకపోయాను అని చెప్పుకుంటూ బాధపడుతూ తనపై కోపంతో రగిలిపోతాడు. నిన్ను బతకనివ్వను అని అక్కడే ఉన్న చాకు తీసి పొడవడానికి వెళుతుండగా సీత ఆపుతుంది.
అక్కడ మీ కోసం అత్తయ్య గారు ఎదురుచూస్తున్నారు అని ఇంటికి వెళ్దాం అనటంతో ఇప్పుడు వెళ్లి నేను పూర్ణకు ముఖం ఎలా చూపించాలి అని బాధపడతాడు. మీకు నిజం తెలియక ముందు అలా ప్రవర్తించారు కదా మీరు వచ్చి పూర్ణ అని పిలుస్తే అత్తయ్య మిమ్మల్ని చూసి సంతోషపడుతుంది అని నచ్చచెప్పుతుంది. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరాక రేఖ కోపంతో రగిలిపోతుంది.
మరోవైపు పూర్ణ శంకర్ ప్రసాద్ ఫోటో చూసుకుంటూ ఇక ఈ జన్మకు మనం కలవలేము అని.. నాకు మునిపటి రూపం కూడా రాదు అని బాధపడుతూ ఉంటుంది. ఉండలేను అని అక్కడి నుంచి ఒక లోయ దగ్గరికి వెళుతుంది. అదే సమయంలో అక్కడి నుంచి ఆటోలో శంకర్ ప్రసాద్, సీత వస్తుంటారు. ఇక శంకర్ గతంలో తను పూర్ణను బాధపెట్టిన ఘటనలను గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు.
లోయలో దూకడానికి వెళ్తున్న పూర్ణను సీత చూసి ఆటో ఆపుతుంది. వెంటనే శంకర్ ప్రసాద్ పరిగెత్తుకు వెళ్లి పూర్ణ ను ఆపుతాడు. ఇక తన పూర్ణ అని పిలవడంతో పూర్ణ సంతోషపడుతుంది. నిజం మొత్తం తెలిసింది అని జరిగిన విషయం మొత్తం చెబుతుంది సీత. ఇక తను కూడా వర్ష ఫోటో కోసమని ఆ ఇంటికి వెళ్తే వీరిద్దరూ మాట్లాడిన మాటలు విని నిజం తెలుసుకున్నాను అని అంటాడు శంకర్. దాంతో పూర్ణ సంతోషపడి శంకర్ ప్రసాద్ కళ్ళ వైపు చూసి వర్ష నీ కోరిక తీరిందమ్మ అని అంటుంది. తరువాయి భాగంలో గదిలో నిద్రపోతున్న రేఖ దగ్గరికి పూర్ణ వచ్చి ఇది నా ఇల్లు నా ఇంట్లో నువ్వు ఉండే హక్కు నీకు లేదు అని తనని బయటికి గెంటేస్తుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial