Seethe Ramudi Katnam Serial Today September 13th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవికి మహా ఇచ్చిన 5 లక్షలతో బిజినెస్ చేయనున్న సీత.. ట్విస్ట్ సూపర్!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీని ఇరికించడానికి సీత విద్యాదేవి డబ్బులు అర్చన దొంగతనం చేసిందని అందరి ముందు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode అర్చన ఫోటో చూడలేదని బతికిపోయానని విద్యాదేవి అనుకుంటుంది. సీత అన్నీ ఉన్నాయా విలువైన వస్తువులు ఏమైనా పోయావా అని అడుగుతూ టీచర్‌కి సైగ చేస్తుంది. దాంతో విద్యాదేవి బట్టలు అన్నీ ఉన్నాయి కానీ బ్యాగులో నేను పెట్టిన 5 లక్షల రూపాయలు లేవని అంటుంది. ఆ డబ్బు నేను తీయలేదు నాకు సంబంధం లేదని అర్చన అంటుంది. తనకు ఏ పాపం తెలీదు అని ఒట్టు వేస్తుంది.
సీత: మరి టీచర్ గదిలోకి ఎందుకు వెళ్లారు బ్యాగ్‌లో ఏం వెతికారు. చెప్పండి చిన్నత్తయ్య. డబ్బులు కోసం కాకపోతే ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు. మీకు మీరుగా వెళ్లారా లేకపోతే ఎవరైనా పంపించారా.
జనార్థన్: ఆవిడ డబ్బు కొట్టేయాల్సిన అవసరం అర్చనకు ఏంటి.
సీత: మరి టీచర్ గదికి ఎందుకు వెళ్లారో చెప్పమనండి.ఎవరు పంపారో బయట పెట్టమనండి.
మహాలక్ష్మీ: ఏంటి అర్చన నీకు డబ్బు అవసరం అయితే నేను ఇస్తా కదా ఆవిడ గదికి ఎందుకు వెళ్లావ్. అర్చన నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉండు. అర్చన అలాంటిది కాకపోయినా ఆవిడ డబ్బు పోయింది కాబట్టి ఆ డబ్బు నేను ఇస్తా. జనా వెళ్లి ఓ 5 లక్షలు తీసుకురా. ఇది చాలా సెన్సిటివ్ విషయం అర్చన డబ్బు తీసింది అంటే మనం నమ్మం అర్చన మీద నింద పడటం నాకు ఇష్టం లేదు. మీకు అంత డబ్బు ఎక్కడిది అని టీచర్‌ని అడిగితే ఆవిడను అవమానించినట్లు అవుతుంది. అది సీతకు నచ్చదు. అందుకే ఆఫ్ట్రాల్ 5 లక్షలే కదా ఇచ్చేద్దాం. తీసుకోండి ఇక నుంచి డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
జనార్థన్: ఎవరి రూంలో వాళ్లు ఉంటే ఏం ఇబ్బంది ఉండదు. ఇకనుంచి అయినా జాగ్రత్తగా ఉండండి.
సీత: ఆ విషయం అత్తయ్యకు చెప్పండి మామయ్య అదే చిన్నత్తయ్యకు.
గిరిధర్: అనవసరంగా నా భార్యని బలి చేశారు ఈ ఉసురు ఊరికే పోదు.
సీత: ఆ విషయం కూడా అత్తయ్యకు చెప్పండి మామయ్య అదే చిన్నత్తయ్యకు.
అర్చన: ఏంటి మహా ఆ టీచర్‌కి 5 లక్షలు ఇచ్చావ్ నేను డబ్బు తీసుకోలేదు కదా.
మహాలక్ష్మీ: ఆ విషయం నాకు తెలుసు.
అర్చన: అంటే అందరి ముందు నన్ను దొంగని చేశావా.
మహాలక్ష్మీ: నిన్ను కాపాడి నన్ను నేను కాపాడుకున్నాను. నువ్వు కంగారులో నా పేరు చెప్పేస్తావేమో అని అలా చేశాను. అయినా నువ్వు బ్యాడ్ అయితే ఒకటి నేను బ్యాడ్ అయితే ఒకటా. అయినా నువ్వు సీత కంట ఎందుకు పడ్డావ్. ఏ పని అయినా ధైర్యంగా చేస్తే ఎవరికీ దొరకం.
అర్చన: నేను అడిగితే నువ్వు వెయ్యి కూడా ఇవ్వవు వాళ్లకి మాత్రం లక్షలు ఇచ్చావ్.
సీత దగ్గరకు ఉదయం డబ్బులు తీసుకొని విద్యాదేవి వెళ్తుంది. తేలు కుట్టిన దొంగల్లా ఇద్దరూ బయట పడలేదు అని వాళ్లకి బాగా బయపెట్టావని అంటుంది. ఇక టీచర్ ఆ డబ్బు ఇస్తే సీత వద్దని అంటుంది. ఇక విద్యాదేవి ఆ డబ్బుని పెట్టు బడిగా పెట్టి వ్యాపారం మొదలు పెట్టమని సీత చేతిలో పెడుతుంది. సీత చాలా సంతోషిస్తుంది. రేపే వ్యాపారం మొదలు పెడతానని అంటుంది. ఇక సీత రామ్ వస్తే రేపు షాప్ పెడుతున్నానని టీచర్ గారు డబ్బు ఇస్తారని చెప్తుంది. ఏం బిజినెస్ అని రామ్ అడిగితే బకెట్ షాప్ అని సీత అంటుంది. ప్లాస్టిక్ బకెట్ల షాపా అని రామ్ అడిగితే బట్టల షాప్ అంటుంది. అప్పుడు రామ్ ఓహో బొటిక్‌నా అని అడుగుతాడు. సీత అవును అని చెప్తుంది.
మహాలక్ష్మి అత్తయ్య తోనే ఆ షాప్ ఓపినింగ్ చేయించాలి అని ఉందని నువ్వే అత్తయ్యకి చెప్పు అని సీత తెలివిగా ప్లాన్ చేస్తుంది. ఉదయం మహాలక్ష్మీ జనార్థన్, గిరిధర్‌లతో అర్చనను తానే టీచర్ గదిలోకి పంపానని చెప్తుంది. ఇంతలో రామ్ వచ్చి సీత బెటిక్ పెడుతుందని ఓపినింగ్ పిన్నితో చేయించాలి అనుకుంటుందని రేపే వెళ్దామని చెప్తాడు. సీత దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి వని మహాలక్ష్మీ అడిగితే టీచర్ ఇచ్చిందని అంటాడు. మహాలక్ష్మీకి సీత ప్లాన్ అర్థమవుతుంది. బొటిక్ ఓపినింగ్‌కి మేం రాము అని మహాలక్ష్మీ అంటే రమ్మని రామ్ అంటాడు. సీతకి మీరంటే గౌరవం అని తప్పకుండా రావాలి అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: విశాల్‌ని చంపడానికి డాక్టర్ అవతారం ఎత్తిన గజగండ, గంటలమ్మ.. పాప ఐడియా సూపర్!