
Seethe Ramudi Katnam Serial Today October 4th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిరణ్ అరెస్ట్.. రేవతిని కిడ్నాప్ చేసింది ఎవరు? రేపే పెళ్లి చేస్తానని మరోసారి సవాలు చేసిన సీత!
Seethe Ramudi Katnam Today Episode రేవతి కనిపించకుండా పోవడంతో జనార్థన్ం కిరణే ఇదంతా చేసుంటాడని అతన్ని అరెస్ట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode కిరణ్‌తో రాత్రి బయటకు వెళ్లిన తర్వాత నుంచి రేవతి కనిపించదు. సీత వాళ్లు చాలా టెన్షన్ పడతారు. ఇంట్లో అందరూ వెతకుతారు. మహాలక్ష్మీ బ్యాచ్‌కి విషయం తెలియడంతో కిరణ్‌తో వెళ్లడం చూశామని కిరణే కిడ్నాప్ చేసుంటాడని మహాలక్ష్మీ అంటుంది.
రామ్: రేవతి అత్తయ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కిరణ్ గారికి ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నారు.
సీత: ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా.
గిరిధర్: పెళ్లి మాకు ఇష్టం లేదని మేం అడ్డుకుంటామని ఆ కిరణ్ గాడు ఇలా చేసుంటాడు.
అర్చన: మనం పెళ్లికి ఒప్పుకోమని రేవతిని చంపేస్తాడేమో.
జనార్థన్: రేవతికి ఏమైనా జరిగితే ఆ కిరణ్ గాడిని చంపేస్తాం.
మహాలక్ష్మీ: రేవతి క్షేమమే మనకు ముఖ్యం.
జనార్థన్: నాకు తెలిసిన సీఐకి చెప్పి అరెస్ట్ చేయిస్తా అప్పుడే రేవతి ఎలా బయటకు రాదో మేం చూస్తాం.
రామ్: తొందర పడొద్దు నాన్న.
అర్చన: రేపు ముహూర్తం దాటే వరకు ఆ కిరణ్ గాడు పోలీస్ స్టేషన్‌లోనే ఉండాలి.
సీత, రామ్ ఎంత చెప్పినా జనార్థన్ సీఐతో మాట్లాడి విషయం చెప్తాడు. కిరణ్ ఇంట్లో రేవతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. కిరణ్‌ని అరెస్ట్ చేస్తారు. రేవతిని నువ్వే కిడ్నాప్ చేశావని ఆమె అన్నయ్యలు కంప్లైంట్ ఇచ్చారని చెప్తాడు. షాకైన కిరణ్ రామ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి పోలీసులతో మాట్లాడమని అంటాడు. రామ్‌తో పోలీసులు మాట్లాడకుండా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. రామ్ సీతకి విషయం చెప్తాడు.
సీత: అప్పుడే అరెస్ట్ ఏంటి ఇదంతా మీ వాళ్లు కావాలనే చేస్తున్నారు మామ.
రామ్: ఒకసారి నాన్న పిన్ని వాళ్లతో మాట్లాడుదాం తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం.
అర్చన: మహా రేవతి ఏమైనట్టు తన కనిపించకపోవడం వాడి పనే అయింటుందా.
మహాలక్ష్మీ: వాడి పని అవ్వకపోయినా వాడి పని అయిపోవాలి. ఈ రోజు వాడి చాప్టర్ క్లోజ్ అవ్వాలి.
చలపతి: ఇళ్లంతా వెతికాను బావ రేవతి గారు ఎక్కడా లేరు.
గిరిధర్: రేవతిని ఆ కిరణ్ గాడు కిడ్నాప్ చేస్తే ఇంట్లో ఎందుకు ఉంటుంది.
రామ్: కిరణ్ గారికి అరెస్ట్ చేశారంట నాన్న.
సీత: కిరణ్ గారు అలాంటి వారు కాదు. రేవతి పిన్ని, కిరణ్ గారు ఇద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ల పెళ్లి ఆపడానికి మీరు ఇలా చేయడం సరి కాదు మామయ్య.
జనార్థన్: ఏం చేయాలో నువ్వు మాకు చెప్పొద్దు సీత.
రామ్: అందరం కలిసి అత్తయ్యని వెతుకుదాం నాన్న.
మహాలక్ష్మీ: స్టేషన్‌కి వెళ్లి కిరణ్‌కి తప్పు ఒప్పుకోమని రేవతి ఎక్కడుందో చెప్పమని అడగండి అప్పుడు రేవతి బయటకు వస్తుంది.
జనార్థన్: రేవతి బయటకు వచ్చే వరకు కిరణ్‌ని వదిలేదు లేదు.
సీత: మీరు ఎన్ని నాటకాలు ఆడినా రేపు వాళ్ల పెళ్లి జరుగుతుంది. మీరు ఎవరూ ఆపలేదు.
మహాలక్ష్మీ: ఓడిపోయే ముందు ఓవర్ చేస్తుంది. ఎలా ఈ పెళ్లి అవుతుందో నేను చూస్తా.
టీచర్ వచ్చి రేవతి ఎక్కడా కనిపించలేదని చెప్తుంది. ఇక కిరణ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సంగతి విద్యాదేవికి రామ్ వాళ్లు చెప్తారు. ఇక సీత, రామ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. ఇక ఇప్పుడు కురుక్షేత్రం జరగబోతుందని విద్యాదేవి అంటుంది. మరోవైపు ప్రీతి, ఉషలు చదువుకుంటుంటారు. అక్కడికి చలపతి వెళ్లి మీకు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ఎప్పుడూ చదువేనా అని అంటాడు. ఇక ప్రీతి, ఉషలు జరిగిందా చలపతికి చెప్తారు. చలపతి బిత్తర పోతాడు. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోండని అని అంటాడు. కిరణ్‌ని సెల్‌లో పెట్టి ఉంటారు.
రామ్, సీత కిరణ్ దగ్గరకు వెళ్తారు. కిరణ్ వాళ్లతో రేవతి కనిపించిందా అని అంటాడు. కిరణ్ రేవతిని నేనే ఏం చేయలేదని ప్రామిస్ చేస్తాడు. సీత మహాలక్ష్మీ వాళ్లని అంటే రామ్ తన పిన్నిని ఏం అనొద్దని అంటాడు. రేవతి కనిపించడం లేదు నేను అరెస్ట్ అయ్యాను రేపు మా పెళ్లి జరుగుతుందో లేదో అని కిరణ్ అంటే ఎలా అయినా జరిపిస్తామని సీత అంటుంది. రామ్, సీతలు పోలీస్‌తో మాట్లాడి కిరణ్ గారికి వదిలేయ్ మంటే కేసు పెట్టిన మీ నాన్న వస్తే విడిపిస్తామని ఎస్ ఐ అంటారు. కిరణ్‌కి ధైర్యం చెప్పి రామ్, సీత బయల్దేరుతారు. ఇక ఇంట్లో జనా, గిరిధర్‌లు రేవతి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
