అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ప్రీతి ఎమోషనల్ యాడ్.. అంజనంలో కనిపించన విద్యాదేవి.. మహాకి కొత్త డౌట్!  

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ వేయించిన అంజనంలో సుమతి స్థానంలో విద్యాదేవి ఫొటో కనిపించడం విద్యాదేవి మ్యానేజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి ఎక్కడుందో తెలుసుకోవడానికి అంజనం వేసే వాడిని పిలిపించానని మహాలక్ష్మీ చెప్తుంది. తానే సుమతి అని తెలిసిపోతుందని విద్యాదేవి టెన్షన్ పడుతుంది. ఇంతలో అంజనం వేసే వ్యక్తి వస్తాడు. అతన్ని మహాలక్ష్మీ అందరికీ పరిచయం చేస్తాడు. అన్నీ ఈయనే చెప్తే మిస్సింగ్ కేసులు ఈయనకు చెప్తే బెటర్ అని జనార్థన్‌ అంటాడు. దాంతో మహాలక్ష్మీ దేవీ ఉపాశకులతో అపహాస్యం వద్దని అంటుంది. 

సుమతి తప్పిపోయిందని తన జాడ తెలిపమని మహాలక్ష్మీ చెప్తుంది. ఇక ఆ వ్యక్తి కింద కూర్చొని ముగ్గు పెట్టి అందులో దీపం వెలిగిస్తాడు. నేనే సుమతి అని తెలిస్తే ఎలా అని విద్యాదేవి టెన్షన్ పడుతుంది. మహాలక్ష్మీ మనసులో విద్యాదేవిని చూస్తూ నువ్వే సుమతి అని నాకు అనుమానంగా ఉంది అందుకే ఇలా చేస్తున్నా అని అనుకుంటుంది. ఆయన అంజనం వేస్తే అందులో సుమతి పాత ముఖం కనిపిస్తుంది.  అందర్ని పిలిచి ఈవిడనేనా మీరు వెతుకుతున్నది అని అడుగుతాడు. అందరూ చూసి షాక్ అయిపోతారు. ఆవిడే మా అమ్మని రామ్, ప్రీతిలు ఎగ్జైట్ అవుతారు. ఇక అందులో తర్వాత విద్యాదేవి ఫొటో కనిపిస్తుంది. దుర్గా అందులో చూసి ఆ విషయం ఎవరికీ చెప్పరు. విద్యాదేవి ముఖం చూసి విద్యాదేవి దగ్గరకు వెళ్లి తర్వాత మహాలక్ష్మీ దగ్గరకు వెళ్లి మీరు చెప్పిన మనిషి అంజనంలో కనిపించడం లేదని అబద్ధం చెప్పి వెళ్లిపోతారు. 

అంజనంలోనూ సుమతి కనిపించడం లేదు అంటే అసలు బతికే ఉందా అని అర్చన అంటుంది. ఇక అందరూ లోపల మాట్లాడుకుంటుంటే విద్యాదేవి ఎవరికీ అనుమానం రాకుండా బయటకు వెళ్తుంది. విద్యాదేవి దుర్గా గారికి వెళ్లి కృతజ్ఞతలు చెప్తుంది.  రాత్రి మహాలక్ష్మీ మీతో మాట్లాడం నేను విన్నానని అందుకే మీకు ఫోన్ చేసి నా గురించి చెప్పొద్దని చెప్పానని అంటుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం మహాలక్ష్మీ చూస్తుంది. ఇక విద్యాదేవి దుర్గారావుకి డబ్బు ఇవ్వడం చూసిన మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. ఎందుకు డబ్బు ఇచ్చిందని విద్యాదేవి ప్రవర్తన అనుమానంగా ఉందని అనుకుంటుంది. 

మరోవైపు కిరణ్‌ డబ్బులు కోసం చాలా టెన్షన్ పడతాడు. డబ్బు లేకపోవడంతో తన ఫ్రెండ్స్ కూడా ముఖం చాటేస్తున్నారని ఇన్వస్టర్లు ఇచ్చిన గడువు దగ్గర పడుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదని రేవతికి చెప్పుకొని బాధపడతాడు. నా వల్లే కదా ఇదంతా అని రేవతి అంటుంది. ఇంతలో సీత అక్కడికి వస్తుంది. ఇక సుమతి అత్తమ్మ వస్తుందని మీ కష్టాలు తీర్చుతుందని సీత రేవతితో చెప్తుంది. మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తానని సీత చెప్తుంది. నువ్వు  మాత్రమే మమల్ని పట్టించుకుంటున్నావని కిరణ్ అంటాడు. ఇక సీత త్వరలో మిమల్ని ఆ ఇంటికి తీసుకొచ్చి ఆస్తి ఇప్పిస్తాను అని సీత చెప్పి వెళ్లిపోతుంది. 

ఉదయం మహాలక్ష్మీ పేపర్ చూస్తుంది. అందులో సుమతి కోసం ప్రీతి యాడ్ ఇచ్చినట్లు ఉంటుంది. మహాలక్ష్మీ కోపంతో ప్రీతిని పిలుస్తుంది. దాంతో అందరూ కిందకి వస్తారు. రామ్‌కి మహాలక్ష్మీ పేపర్ చూపిస్తే రామ్ తీసుకొని యాడ్ చదువుతాడు. "అమ్మ నేను నీ కూతురు ప్రీతీని నాకు పెళ్లి కుదిరింంది. శివకృష్ణ మామయ్య వాళ్లు నాకు సంబంధం తీసుకొచ్చారు. వచ్చే గురువారమే పెళ్లి మగ పెళ్లి వాళ్లు నువ్వు వచ్చి కన్యాదానం చేయాలి అంటున్నారు. నువ్వు రాకపోతే పెళ్లి ఆగిపోతుంది. నువ్వు ఎక్కడున్నా తప్పకుండా రా అమ్మా ఇట్లు నీ కూతురు ప్రీతి" అని రాసుంటుంది. అది రామ్ చదవగానే అందరూ షాక్ అవుతారు. నేను  వేయించలేదు అని ప్రీతి అంటే రామ్ కూడా నేను కాదు అంటాడు. అందరూ మేం ఈ పని చేయలేదు అంటే ఇంతలో సీత వచ్చి నేనే చేశాను అంటుంది. ఇలా చేస్తే సెంటి మెంట్‌కి అయినా అత్తమ్మ వస్తుందని చేశానని సీత  అంటుంది. మహాలక్ష్మీ సీతని తిడితే రామ్, జనార్థన్ సీతకి సపోర్ట్ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: బెడిసికొట్టిన అంబిక ప్లాన్.. విహారిని కాపాడిన లక్ష్మీ.. చీర కొంగు చింపి మరీ..!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
Embed widget