Seethe Ramudi Katnam Serial Today November 30th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తో.. అసలు సినిమా ముందుంది.. ట్విస్ట్‌లకు రెడీగా ఉండు.. క్యారెక్టర్లు మార్చుకున్న సీత, మహా!
Seethe Ramudi Katnam Today Episode సీత చీరల్ని వారంలో అమ్మేస్తా అని మహా.. మహా బిజినెస్ వారంలో డెవలప్ చేస్తా అని సీత, మహాలు ఛాలెంజ్ చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ సీఐ త్రిలోక్‌తో పాటు అందరినీ గదిలోకి తీసుకెళ్తుంది. చూస్తే అక్కడ విద్యాదేవి ఉండదు. గదిలో పెట్టి డోర్ వేశాను కానీ విద్యాదేవి లేదు అని మహాలక్ష్మీ అంటే అందరూ నీ మెంటల్ కండీషన్ బాలేదని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని అంటారు. విద్యాదేవిని చూసుకున్నానని మహాలక్ష్మీ ఎంత మొత్తుకున్నా ఎవరూ వినరు. ఇక సీత మహాలక్ష్మీతో సీఐ గారిని పిలిచి ఫూల్ చేశావని అంటుంది.
సీఐ: ఏంటి మహాలక్ష్మీ గారు నా టైం వేస్ట్ చేశారు.
మహాలక్ష్మీ: నేను నిజంగానే విద్యాదేవిని ఇక్కడ చూశాను సీఐ గారు.
సీఐ: ఇలా కాదు నేను డైరెక్ట్‌గా జైలుకి వెళ్లి ఆవిడ అక్కడ ఉందో లేదో చూస్తాను.
మహాలక్ష్మీ: నేను విద్యాదేవిని చూశాను చూశాను. ఇక మహాలక్ష్మీ బయటకు వెళ్తూ అక్కడ ముసుగు వేసుకొని విద్యాదేవి వెళ్లడం చూస్తుంది. ఆపి విద్యాదేవి ముసుగు తీస్తుంది. నేను నిన్ను చూశాను మరి నాతో ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నావ్.
సీత: మిమల్ని పిచ్చిదాన్ని చేయడానికి అత్తయ్య. మా రిసెప్షన్ రోజున మీరు నాకు చేసిన దానికి మీ పెళ్లి రోజున వడ్డీతో సహా ఇచ్చేశా.
విద్యాదేవి: నీ వల్ల సీత చాలా ఇబ్బందులు పడింది అందుకే నీతో ఓ ఆట ఆడుకోవడానికి నేను పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను.
మహాలక్ష్మీ: నన్నే ఫూల్‌ని చేస్తారా ఇప్పుడే మీ సంగతి చెప్తా.
సీత: ఆగండి అత్తయ్య మీరు లోపలికి వెళ్లి అందరికీ చెప్పేలోపు అత్తమ్మ వెళ్లిపోతుంది. మళ్లీ అందరూ పిచ్చిది అంటారు. ఈసారి మీ కోసం అంబులెన్స్ వస్తుంది. మీరు చేసిన తప్పులను ఒప్పుకొని అత్తమ్మని విడిపించే వరకు మేం మిమల్ని వదలము అత్తయ్య ఇలాగే వెంటాడుతూ ఉంటాం
విద్యాదేవి: వెళ్లొస్తా సీత మహాలక్ష్మీ మళ్లీ కలుస్తా.
సీత: అత్తయ్య అసలు సినిమా ముందుంది ఊహించని ట్విస్ట్‌లు ముందున్నాయి అన్నీంటికి రెడీగా ఉండండి.
జనార్థన్: ఇంట్లో ఇంత మంది గెస్ట్‌లు ఉంటే ఇప్పటి వరకు ఎక్కడకి వెళ్లావు మహా
మహా కేక్ కట్ చేస్తాం అంటే అందరూ మమల్ని వెయిట్ చేయించి అవమానించారని తిండికి గతి లేకా ఇక్కడికి రాలేదని తిట్టేసి వెళ్లిపోతారు. అందరూ మహాలక్ష్మీని పిచ్చిగా ప్రవర్తించావని అందర్ని పిలిచి పరువు తీసుకున్నామని అనుకుంటారు. రోడ్డు మీద చీరలు అమ్ముకునే సీత నన్ను పిచ్చిది చేసిందని దీన్ని వదలను అని మహాలక్ష్మీ అంటుంది. దానికి సీత ఏంటి ఈ సీత ఈ సీత అంటున్నావ్.. తిండికి గతి లేక కాళ్లకి చెప్పులు కూడా లేని ఈ మహాలక్ష్మీ మా అత్తయ్య దయ వల్ల బతికిన ఈ మహాలక్ష్మీ కంటే ఈ సీత చాలా గొప్పదని అంటుంది. డొక్కు బండిలో నువ్వు చీరలు అమ్ముకుంటావని నేను టర్నోవర్‌లో బిజినెస్ చేస్తానని అంటుంది.
ఇక సీత, మహాలక్ష్మీ ఇద్దరూ ఛాలెంజ్‌లు చేసుకుంటారు. సీత బండిలో చీరలు వారంలో మొత్తం అమ్మెస్తానని మహాలక్ష్మీ అంటే మహాలక్ష్మీ ఆఫీస్ బిజినెస్ చేసి లాభం తెస్తానని సీత అంటుంది. ఎందరు ఎన్ని చెప్పినా సీత, మహాలక్ష్మీలు ఛాలెంజ్ చేసుకుంటారు. సీత ఓడిపోతే వారం తర్వాత ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని మహాలక్ష్మీ అంటుంది. ఇక సీత మహాలక్ష్మీతో పందెంలో నేను గెలిస్తే ఆ రోజు నేను ఏం చెప్తే అది చేయాలని అంటుంది. ఇద్దరూ ఒకే అనుకుంటారు. రామ్ సీత మీద చాలా కోపంగా ఉంటాడు. ఛాలెంజ్‌లో నువ్వు గెలవడం కష్టమని రామ్ అంటాడు. ప్రతీ సారి నువ్వే గెలవవు సీత అని అంటాడు. ఎలా అయినా గెలుస్తానని సీత రామ్‌కి మాటిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: కబడ్డీ ఆడుతూ మిత్ర, లక్ష్మీల రొమాన్స్.. కుళ్లుకున్న మనీషా.. లక్కీ తల్లి ఎంట్రీ ఎప్పుడో?