అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 28th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: దెయ్యం.. విద్యాదేవి.. సుమతి అంటూ రచ్చ రచ్చ చేసిన మహాలక్ష్మీ.. సీత ఐడియా సూపర్!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ గదిలోకి విద్యాదేవి వెళ్లి దెయ్యంలా మారి మహాలక్ష్మీని భయపెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode కానిస్టేబుల్ సాయంతో విద్యాదేవి మహాలక్ష్మీ ఇంటికి వస్తుంది. సీత బయట ఉండి టీచర్‌తో ఈ పెళ్లి రోజు మహాలక్ష్మీ అత్తయ్యకు ఓ పీడ కలలా ఉండాలని అంటుంది. మహాలక్ష్మీలో భయాన్ని రెట్టింపు చేయాలని అంటుంది. గతంలో మహాలక్ష్మీ సీతని పిచ్చిదాన్ని చేసి రిసెప్షన్‌లో చేసిన రచ్చని విద్యాదేవికి చెప్తుంది. ఈ రోజు మహాలక్ష్మీని పిచ్చిదాన్ని చేసి తనని అందరితో  మాటలు అనిపించాలని అంటుంది. 

మరోవైపు మహాలక్ష్మీ వాళ్లు ఫంక్షన్‌ గురించి హాల్‌లో ఉండి మాట్లాడుకుంటారు. సీత ఎవరూ చూడకుండా వెనక దాస్తుంది. ఇక అక్కడే ఉన్న ఓ పెద్ద చెక్కని తీసి పక్కన పెట్టినట్లు జరిపి దాని చాటుగా విద్యాదేవిని ఎవరూ చూడకుండా గదిలోకి పంపేస్తుంది. టీచర్ గదిలోకి వెళ్లగానే డోర్ దగ్గరకు వేసేస్తుంది. తర్వాత మహాలక్ష్మీ వాళ్ల దగ్గరకు వస్తుంది. ఫంక్షన్‌లో జాగ్రత్తగా ఉండాలని సీతతో మహాలక్ష్మీ వాళ్లు చెప్తారు. సీత మహాలక్ష్మీని చూసి చాలా సింఫుల్‌గా ఉన్నారు అత్తయ్య మామయ్య కొన్ని డైమండ్ నెక్లెస్ పెట్టుకోమని చెప్తుంది. అందరూ మహాలక్ష్మీ నెక్లెస్ పెట్టుకోమని చెప్తారు. మహాలక్ష్మీ సీతకి థ్యాంక్స్ చెప్పి నెక్లెస్ పెట్టుకోవడానికి గదికి వెళ్తుంది. 

అక్కడ సీత వాళ్లు ప్లాన్ చేసుకున్నట్లు విద్యాదేవి మహాలక్ష్మీ గదిలో జుట్టు విరబోసుకొని ముఖానికి పౌడర్ కొట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పెద్దగా నవ్వుతూ దెయ్యంలా మహాలక్ష్మీని భయపెడుతుంది. దెయ్యం, సుమతి అని మహాలక్ష్మీ అరుస్తూ భయపడుతూ కిందకి వెళ్తుంది. అందరూ షాక్ అయిపోతారు. సీత నవ్వుకుంటుంది. విద్యాదేవి గదిలో ఉందని మహాలక్ష్మీ చెప్తుంది. ఆవిడ బతికే ఉంది కదా దెయ్యంలా ఎలా వస్తుందని సీత అడుగుతుంది. జైలులో ఉన్న మనిషి బయటకు ఎలా వస్తుందని అడుగుతారు. టీచర్ బయట నుంచి చూసి నవ్వుకుంటుంది. నిన్నటిలా భయపడుంటావని రోజూ ఈ గొడవ ఏంటి అని జనార్థన్ మహాలక్ష్మీ మీద అరుస్తాడు. ఇక మహాలక్ష్మీ అందరినీ తీసుకొని మీదకు వెళ్తానంటుంది. ఇంతలో గెస్ట్‌లు వస్తారు. దాంతో ఆగిపోయి వాళ్లని రిసీవ్ చేసుకుంటారు. 

అర్చన మహాలక్ష్మీని చాటుగా తీసుకెళ్లి ఏమైంది మహా నీకు అని అడుగుతుంది. దాంతో మహాలక్ష్మీ అది విద్యాదేవినే అని అంటుంది. అర్చన నమ్మదు. సీఐకి కాల్ చేసి కనుక్కో అని అర్చన అంటే మహాలక్ష్మీ కాల్ చేస్తుంది. విద్యాదేవి  ఉందో లేదో తెలుసుకొని చెప్పమని అంటుంది. ఇక సీత విద్యాదేవితో అందరూ అత్తయ్యకు పిచ్చి పట్టిందని అనుకుంటున్నారని సీత అంటుంది. మహాలక్ష్మీ రెట్టింపు బాధ పడాలని ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ మాటలు మహాలక్ష్మీ వినేస్తుంది. సుమతి వచ్చింది అని దీన్ని ఇప్పుడే అందరికీ పట్టించాలని హడావుడిగా వెళ్లి అందరినీ తన వెంట తీసుకెళ్తుంది. గెస్ట్‌ల ముందు మహాలక్ష్మీ ప్రవర్తనకు అందరూ మహాలక్ష్మీకి ఏదో అయిందని అనుకుంటారు.

మహాలక్ష్మీ వాళ్లు అక్కడికి వెళ్లే సరికి సీత సాంబతో మాట్లాడుతుంది. మహాలక్ష్మీ సీతని విద్యాదేవి ఏది అని నిలదీస్తుంది. నేను సాంబతోనే మాట్లాడుతున్నానని సీత అంటుంది. ఇక మహాలక్ష్మీ నిజంగా పిచ్చిదానిలా విద్యాదేవి విద్యాదేవి అని అరుస్తుంది. జనార్థన్ మహాలక్ష్మీ పట్టుకొని ఆపుతాడు. అయినా మహాలక్ష్మీ వినదు అందరూ ఎంత చెప్పినా వినదు. అత్తమ్మను మీరే చంపినట్లు మీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చినట్లు అంత భయం ఎందుకని సీత అడుగుతుంది. దాంతో మహాలక్ష్మీ నేను చూసింది విద్యాదేవినే అని అంటుంది. మరోవైపు సీఐ త్రిలోక్ కాల్ చేసి విద్యాదేవి జైలులో ఉందని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఊరుని ఇంటిని చూసి గతం గుర్తుచేసుకొని ఎమోషనలైన లక్ష్మీ.. తగలబెట్టేస్తానంటోన్న మనీషా!

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
Illu Illalu Pillalu Serial Today August 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
Meghasandesam Serial Today August 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
Nindu Noorella Saavasam Serial Today August 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముగ్గుల పోటీలో ఓడిపోయిన అమర్‌ - పరువు పోయిందన్న రాథోడ్
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముగ్గుల పోటీలో ఓడిపోయిన అమర్‌ - పరువు పోయిందన్న రాథోడ్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget