Seethe Ramudi Katnam Serial Today November 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతకి వార్నింగ్ ఇచ్చిన రామ్.. అర్చన కూతురితో పెళ్లి చేయమని మహాని బెదిరించిన రాకేశ్!
Seethe Ramudi Katnam Today Episode అర్చన కూతురు ఉషని తనకిచ్చి పెళ్లి చేయమని మహాలక్ష్మీని రాకేశ్ వాళ్లు బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode సీతని తీసుకొని మహాలక్ష్మీ ఇంటికి తీసుకొస్తుంది. మన ఇంటి పరువు గురించి సీత ఆలోచించకపోయినా నేను రామ్ సంతోషం కోసం ఆలోచించి సీతని తీసుకొచ్చానని మహాలక్ష్మీ అంటుంది. ఇలా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావ్ అని చలపతి అడుగుతాడు.
మహాలక్ష్మీ: రామ్ చిన్నప్పటి నుంచి నా కొడుకు అన్నయ్య తన సంతోషమే నా సంతోషం. పైగా సీతని కూడా నా కోడలిగా అంగీకరించాను కదా.
సీత: మీరు ఒప్పుకోలేదు నేను ఒప్పించా
మహాలక్ష్మీ: ఎలా అయినా నువ్వు నా కోడలు అన్నా కదా. నా కొడుకు భార్య గురించి ఆలోచించా నా కొడుకు సంతోషం గురించి ఆలోచించా. సీత చేసింది తప్పే కానీ తను చిన్న పిల్ల కదా ఆ విద్యాదేవి చేసిన తప్పునకు నా కోడలు ఎందుకు బలి అవ్వాలి అని సీఐ గారిని రిక్వెస్ట్ చేసి సీతని తీసుకొచ్చా కానీ సుమతిని చంపిన ఆ విద్యాదేవికి శిక్ష పడాలి. జీవితాంతం తను జైలులో మగ్గిపోవాలి.
జనార్థన్: రామ్ గురించి ఇంటి పరువు గురించి ఆలోచించి సీతని విడిపించి మంచి పని చేశావ్ మహా
గిరిధర్: కానీ ఏం లాభం అన్నయ్య వదిన చేసిన పనిని సీత గుర్తించాలి కదా
మహాలక్ష్మీ: సీత గుర్తింపుకోసం నేను చేయలేదు గిరి రామ్ సంతోషం కోసం చేశా. సీత రామ్ సంతోషంగా ఉండాలని ఇలా చేశా.
చలపతి: ఈ మాటలు నీ మనసు నుంచే వస్తున్నాయా చెల్లి.
రామ్: చూశావా సీత నువ్వు ఎన్ని తప్పులు చేసినా పిన్ని క్షమిస్తూనే ఉంది
సీత: మీ పిన్ని ఇలా నన్ను విడిపించింది అంటే ఏదో కారణం లేకుండా చేయదు.
మా పిన్నిలా మీ తల్లిదండ్రుల కూడా ఆలోచించలేదు అని రామ్ అంటాడు. ఇక రామ్ మహాకి థ్యాంక్స్ చెప్తాడు. మరోవైపు శివ, లలితలు సీత, సుమతి గురించి ఆలోచిస్తారు. వాళ్లని ఎలా విడిపించాలా అని అనుకుంటారు. ఇంతలో సీత తల్లిదండ్రులకు కాల్ చేసి నేను బయటకు వచ్చానని నన్ను మాత్రమే అత్తయ్య తీసుకొచ్చిందని సుమతి అత్తమ్మని తీసుకురాలేదని చెప్తుంది. సుమతి అత్తమ్మని బయటకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని అంటుంది. ఇక సీత మాటలు రామ్ వింటాడు. తను మా అమ్మ కాదని చెప్తున్నా ఎందుకు ఇంకా ఆమెకే సపోర్ట్ చేస్తున్నావ్ మన కోసం మా పిన్ని మంచి మనసుతో ఆలోచించింది. ఇక నుంచి ఆ టీచర్ విషయంలో నువ్వు కలుగజేసుకోవద్దు ఆవిడతో నువ్వు మాట్లాడినా కలిసినా నేను క్షమించను అని అంటాడు. సీత మాత్రం ఎవరు చెప్పినా నా రణం ఆగదని అంటుంది.
మరోవైపు అర్చన మహా దగ్గరకు వెళ్లి సీతని ఎందుకు తీసుకొచ్చావ్ సీత అక్కడే ఉండి ఉంటే రామ్‌కి విడాకులు ఇప్పించేవాళ్లం అని నీ బ్రెయిన్ పని చేయడం లేదని మహాలక్ష్మీని అర్చన అంటుంది. ఆ సుమతి తనని వదలదని అందుకే ఇద్దరినీ ఒక దగ్గర ఉంచకూడదని సీతని విడిపించకూడదని అంటుంది. రాకేశ్ నిన్ను వదలడు మహా సీతని బయటకు తీసుకొచ్చి తప్పు చేశావని అంటుంది. ఇంతలో రాకేశ్ మహాలక్ష్మీకి ఫోన్ చేస్తాడు. ఓ లొకేషన్ పంపిస్తా రండి అంటాడు. రాకేశ్ ఏం చెప్తాడో ఏంటో అని మహాలక్ష్మీ టెన్షన్ పడుతుంది. మరోవైపు సీత రామ్‌కి వడ్డిస్తుంది. రామ్ తిని ఫుడ్ బాగుందని పొడుగుతాడు.
సీత సుమతి విషయంలో తనని నమ్మమని రామ్‌కి చెప్తుంది. మన మధ్య టీచర్ విషయం వద్దని రామ్ అంటాడు. రాకేశ్ వాళ్లు మహాలక్ష్మీని కలిసి ఎలా అయినా నేను మీ ఇంటి అల్లుడుని కావాలని అంటాడు. ప్రీతి పెళ్లి అయిపోయింది కదా అని మహాలక్ష్మీ అంటే అర్చన కూతురు ఉషని ఇచ్చి పెళ్లి చేయమని అంటారు. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. అర్చన ఒప్పుకోదు కుదరదు అని అంటుంది. అర్చన కూతురితో పెళ్లి చేయకపోతే నాతో మీరు మాట్లాడిన మాటలు అన్నీ రికార్డ్ చేశానని అవన్నీ అందరికీ చూపిస్తానని బెదిరిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.